రాజకీయ వైరంతో దార్శనికుడి ప్రతిభను మరుగున పడేయలేరు!

Publish Date:Aug 23, 2023

Advertisement

రాజకీయవైరంతో ఒక దార్శనికుడిని మరుగున పడేయాలను కోవడం అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోగలమనుకోవడం లాంటి భ్రాంతి మాత్రమే. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి విషయంలో అది పదే పదే రుజువౌతోంది.   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన సాధించిన నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారు  చంద్రబాబు దార్శనికతపై ప్రశంసలు కురిపిస్తూనే  ఉన్నారు. ఉంటారు.  

 రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న, వచ్చిన గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్ట ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తుందేమో కాని అనితర సాధ్యం అనదగ్గ రీతిలో ఆయన సాధించిన విజయాలు, ఆయన చొరవవల్లే.. ఔను కేవలం ఆయన చొరవ, దూరదృష్టి కారణంగానే  జంటనగరాలకు అదనంగా ఆయన నిర్మించిన సైబరాబాద్ మహానగరం, హైదరాబాద్ కు అనేమిటి.. యావద్దేశానికే తలమానికం అనదగ్గ  ఇండియన్ స్కూల్ ఆప్ బిజినెస్, ఇండియన్ ఇనిస్టిట్యట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటైన క్రీడా ప్రాంగణాలు.. ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇలా ఒకటనేమిటి హైదరాబాద్ విశ్వనగరంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేందుకు దోహదపడిన ప్రతి ప్రగతి నిర్మాణంలోనూ చెరిగిపోని విధంగా చంద్రబాబు ముద్ర ఉంది. ఉంటుంది

అనడంలో సందేహమే లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం, చేపట్టిన ప్రతి కార్యక్రమం, ఏర్పాటు చేసిన ప్రతి సంస్థ.. రాజకీయ లబ్ధి కోసం కాకుండా రాష్ట్ర ప్రగతి, పురోగతే లక్ష్యంతోనే చేశారు. వర్తమానం గురించి మాత్రమే కాదు భవిష్యత్ తరాల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగారు.  ఆ దార్శనికతే  చంద్రబాబుకు ఒక విశిష్ట నేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా సీఈవోగా ఆయన అమెరికా వీధుల్లో ఫైళ్లు పట్టుకుని తిరిగి మరీ ప్రపంచ ప్రఖ్యాల సంస్థలను ఆహ్వానించారు. ఆయన సింప్లిసిటీ, ఆయన దూరదృష్టి కారణంగానే ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న సమయంలో దేశంలో ఏ రాష్ట్రానికీ రాని విధంగా ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు హైదరాబాద్ కు తరలివచ్చాయి.

అలా చంద్రబాబు కృషి వల్ల హైదరాబాద్ వచ్చిన ఐఐఐటీ హెచ్  బుధవారం (ఆగస్టు 23) సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటోంది. ఈ ఉత్సవాల్లో  తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు   పాల్గొంటున్నారు.  ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ఆయన బుధవారం ( ఆగస్టు 23) విద్యార్థులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ట్రిపుల్ ఐటీ ఆవిర్భావం, ఐటీ రంగ అభివృద్ధి వంటి అంశాలపై విద్యార్థులతో చర్చిస్తారు. వారి ప్రశ్నలకు సమాధానమిస్తారు.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలోనే  1998లో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ రంగాలలో దేశంలోనే నంబర్ వన్ గా గుర్తింపు పొందింది. హైదరాబాద్ బెంగళూరును అధిగమించి మరీ ఐటీ హబ్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.

 హైదరాబాద్ నలుచెరగులా జరిగిన అభివృద్థిలో ప్రతి అడుగులోనూ చంద్రబాబు ముద్ర కనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే రాజకీయంగా ఉన్న విభేదాలతో దార్శనికుడి ప్రతిభ మరుగున పడేయాలన్న ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి.  ఐఐఐటీ హెచ్  సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా దాదాపుగా జాతీయ పత్రికలన్నీ ఆ సంస్థ ఉన్నతి గురించీ, అది హైదరాబాద్ లో ఏర్పాటు కావడం వెనుక ఉన్న చంద్రబాబు దార్శనికత గురించీ  ప్రత్యేక వ్యాసాలు ప్రచురించాయి. చంద్రబాబు వంటి దార్శనికుడి అవసరం దేశానికి ఎంతో అవసరమంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు. 

By
en-us Political News

  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.