వైజాగ్ టెక్కీ అనుమానాస్పద మృతి...భర్త వేధింపులే కారణమా?

Publish Date:Jun 19, 2026

Advertisement

 

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మసూరీకి భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి (26) అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. వివాహమైన కేవలం ఏడు నెలలకే ఆమె ఇలా విగతజీవిగా మారడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కుమార్తె మరణం వెనుక అల్లుడి వేధింపులు, అనుమానపు బుద్ధులే కారణమంటూ మృతురాలి తల్లిదండ్రులు విశాఖపట్నం పోలీసులను ఆశ్రయించారు.

బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆర్మీ విశ్రాంత ఉద్యోగి కుమార్తె అయిన గాయత్రి ఎంబీఏలో కాలేజ్ టాపర్‌గా నిలిచింది. గతేడాది నవంబర్‌లో శ్రీచరణ్ అనే యువకుడితో ఆమెకు ఘనంగా వివాహం జరిగింది. అయితే, ఈ నెల 15న మసూరీలోని ఓ హోటల్ గదిలో గాయత్రి స్పృహలేకుండా పడి ఉందంటూ శ్రీచరణ్ భార్య తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. హుటాహుటిన వారు అక్కడికి చేరుకునే లోపే దేహ్రాదూన్‌లో శవపరీక్ష సైతం ముగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భర్త శ్రీచరణ్‌కు విపరీతమైన అనుమానపు స్వభావం ఉందని గాయత్రి తల్లిదండ్రులు సత్యవతి, సుధాకర్ ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసే సమయంలో ఆమె ఉంటున్న గదికి ఎవరు వచ్చినా సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించేవాడని, చివరకు రాపిడో బైక్‌పై వచ్చినా వాచ్‌మెన్‌తో ఆరా తీసేవాడని పేర్కొన్నారు. అంతేకాకుండా, గాయత్రికి తెలియకుండా ఆమె ఆఫీస్ బ్యాగ్‌లో లొకేషన్ ట్రాకర్ కూడా పెట్టాడని, దీనిపై ఆమె గతంలోనే తమ వద్ద ఎంతో బాధపడిందని కన్నీరుమున్నీరయ్యారు.

మరికొద్ది రోజుల్లో (జూన్ 20న) ఇంట్లో జరగబోయే ఒక శుభకార్యం కోసం గాయత్రి ఎంతో ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకుందని, ఈ లోపే ఇలాంటి ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నిత్యం వీడియో కాల్స్ చేస్తూ ఎంతో సంతోషంగా మాట్లాడే తమ కుమార్తె, అనుమానాస్పద స్థితిలో మరణించడం వెనుక ఖచ్చితంగా భర్త వేధింపులే ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.

ఈ దారుణ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపి తమ కుమార్తె మృతికి కారణమైన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని డీసీపీ మణికంఠను కలిసి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఏ ఆడపిల్లకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై విశాఖ పోలీసులు ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఉత్తరాఖండ్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ కేసు దర్యాప్తును ముమ్మరం చేయనున్నారు. భర్త శ్రీచరణ్‌ను విచారిస్తేనే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

By
en-us Political News

  
బాపూ సరోవర్ నిర్మాణానికి అవసరమైన అత్యంత కీలకమైన రక్షణశాఖ భూముల బదలాయింపునకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ అధికారికంగా అనుమతులు మంజూరు చేస్తూ శుక్రవారం (జూన్ 19) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుమారు 550 కోట్ల రూపాయల భారీ వ్యయంతో చేపట్టతలపెట్టిన ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యం...కొత్త వ్యూహాలతో జనసేన ముందడుగు!
సాయికృష్ణ కేసులో దోషులపై కఠిన చర్యలు..
లింగంగుంట్ల నుంచి నిధులు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు..
హైదరాబాద్ శివార్లలోని గండిపేట పరిధిలో వెలుగుచూసిన సంచలనాత్మక నకిలీ జీఓల భూ కబ్జా కేసు
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది
గుజరాత్‌లో డెయిరీ క్వీన్ గా ఎదిగిన మహిళా ప్రస్థానం..
పాఠశాల వార్షికోత్సవంలో పాక్ దేశభక్తి గీతం..
హైదరాబాద్ నగరంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక నీట్ (NEET) పరీక్ష వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే
చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లతో ధర్మశాల, న్యూజిలాండ్ మైదానాలను తలపిస్తున్న కడప క్రికెట్ స్టేడియం అందాలు
లీప్‌ఫ్రాగ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఐపీఓ (Leapfrog Engineering SME IPO) నేటితో ముగియనుంది. తాజా సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, గ్రే మార్కెట్ ప్రీమియం (GMP), లాట్ సైజ్ మరియు కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి.
క్రెడిట్ కార్డ్ స్వైప్ ఛార్జీలు లేదా MDR అంటే ఏమిటి? 1% నుండి 3% వరకు ఉండే ఈ అదృశ్య రుసుములు మీ జేబును ఎలా ప్రభావితం చేస్తాయో పూర్తి వివరాలతో తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.