అమెరికా దాడిలో విశాఖ వాసి, మెరైన్ చీఫ్ ఇంజినీర్ సురేష్ పట్నాల మృతి

Publish Date:Jun 12, 2026

Advertisement

 

ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో  విశాఖపట్నానికి చెందిన మెరైన్ చీఫ్ ఇంజినీర్ సురేష్ పట్నాల  మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. వారిలో సురేష్ కూడా ఉన్నట్లు కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి ముకేశ్ మంగళ్ వెల్లడించారు. విశాఖలోని శ్రీహరిపురానికి చెందిన సురేష్ గత 15 ఏళ్లుగా మెరైన్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో భాగంగా ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లిన ఆయన..  ఇటీవల ఎంటీ సెట్టెబెల్లో అనే వాణిజ్య నౌకలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నౌకలో జనరేటర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిశీలిస్తున్న సమయంలో దాడి జరగడంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు నౌక యాజమాన్యం కుటుంబ సభ్యులకు తెలిపింది.

సురేష్ భార్య భార్గవి మాట్లాడుతూ.. ప్రతిరోజూ గుడ్ మార్నింగ్ సందేశం పంపేవారు. వీడియో కాల్ చేసే అవకాశం లేకపోయినా మెసేజ్ మాత్రం తప్పకుండా వచ్చేది. కానీ రెండు రోజులుగా ఎలాంటి సమాచారం రాలేదు. ఇప్పుడు ఆయన మరణించారనే వార్త వినాల్సి వచ్చింది  అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

జూన్ 9న చివరిసారిగా మాట్లాడినప్పుడు త్వరలో ఇంటికి వస్తానని చెప్పారని, జూన్ 24న తమ వివాహానికి 15 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కలిసి వేడుక చేసుకుందామని చెప్పారని ఆమె గుర్తుచేసుకున్నారు.  ఇంటికి వస్తానన్నారు కానీ ఇలా శవమై వస్తారని ఊహించలేదు  అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

సురేష్‌కు భార్యతో పాటు 13, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. అంతేకాకుండా భార్గవి అక్క బావ చనిపోవడంతో వారి ఇద్దరు పిల్లల బాధ్యతను కూడా ఈ కుటుంబమే తీసుకుంది. ప్రస్తుతం నలుగురు పిల్లల భవిష్యత్తుపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబం మొత్తం ఆయన సంపాదనపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు పిల్లల చదువులు, భవిష్యత్తు ఎలా సాగుతుందో అర్థం కావడం లేదని భార్గవి తెలిపారు. ప్రభుత్వం తమ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు సురేష్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సురేష్ మరణవార్తతో విశాఖలోని ఆయన నివాసానికి బంధువులు, స్నేహితులు, రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సంతాపం ప్రకటించింది.

By
en-us Political News

  
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
హైదరాబాద్‌ మహానగరంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్‌లో శనివారం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
డిజిటల్ విప్లవంలో దూసుకుపోతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.