డీజీపీకి డెప్యూటీ స్పీకర్ లేఖ.. విషయమేంటంటే?
Publish Date:Jun 12, 2026
Advertisement
ఏపీలో ఎవరైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేస్తే.. సదరు ఫిర్యాదుదారుడి ఎస్సీ హోదాను తప్పనిసరిగా పరిశీలించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ మేరకు ఆయన ఏపీ డీజీపీకి రాసిన లేఖలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలకు దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అట్రాసిటీ చట్టం దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు ఈ చర్యలు అవసరమని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు..తన లేఖలో ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావించారు. ఆ తీర్పు ప్రకారం క్రైస్తవ మతంలోకి మారిన వారు ఎస్సీ హోదాను కోల్పోతారని, వారికి అట్రాసిటీ చట్టం కింద ఎలాంటి హక్కులు వర్తించవని గుర్తు చేశారు. అందువల్ల అట్రాసిటీ చట్టం కింద ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు, ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముందు గానీ, లేదా నమోదు చేసిన వెంటనే గానీ ఫిర్యాదుదారుడి కుల హోదాను క్షుణ్ణంగా ధ్రువీకరించుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
http://www.teluguone.com/news/content/-deputy-speaker--letter-to-dgp-36-222706.html





