విశాఖలో దారుణం... కూతుర్ని చంపి... తల్లి ఆత్మహత్యాయత్నం..!

Publish Date:Feb 13, 2020

Advertisement

విశాఖలో అదృశ‌్యమైన చిన్నారి జ్ఞానస కథ విషాదంగా ముగిసింది. తల్లి ఆవేశమో లేక అమాయకత్వమో తెలియదు గానీ, జరగరాని దారుణం జరిగిపోయింది. ఓ కంటి పాప తీరని లోకాలకు వెళ్లిపోయింది. అందమైన ఆ ఇంటి కల చెదిరిపోయింది. అనుకోని అపార్ధాలు కుటుంబం మొత్తానికి తీరని ఆవేదన మిగిల్చింది. 

విశాఖ పులగవానిపాలెంలో బంగారం అత్తాకోడళ్ల మధ్య చిచ్చుపెట్టింది. తన బంగారాన్ని ఆడపడుచుకు ఇచ్చేశారంటూ అత్తతో కోడలు గొడవ పడింది. చివరికి అత్త సూటిపోటి మాటలను తట్టుకోలేక తనువు చాలించాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువుగా తనకున్న ఏడాదిన్నర పాపతో తీసుకుని తన ఇంటి వెనుకున్న ఎత్తయిన కొండ ఎక్కింది.... మూడ్రోజులపాటు కొండ దగ్గరే తిరుగుతూ గడిపింది... అయితే, అన్నం నీళ్లూ లేకపోవడంతో సొమ్మసిల్లిపడిపోయింది... చివరికి గొర్రెల కాపరులు ఆమెను గమనించి... పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... మూడ్రోజుల క్రితం అదృశ్యమైన సుమలతగా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే, పాప కనిపించకపోవడంతో... తల్లి సుమలత ఇచ్చిన సమాచారం మేరకు పెందుర్తి ఎర్రకొండ అడవుల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తో కొండను... కొండ కిందనున్న పరిసరాలను జల్లెడ పట్టారు. అయితే, సుమలత చెప్పినట్లుగా ఎక్కడా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో మరోసారి గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా, రెండు మూడుసార్లు ఎర్రకొండ పరిసరాలను జల్లెడ పట్టినా... పాప ఆచూకీ దొరకకపోవడంతో... అసలు చిన్నారి ఏమైందనేది పోలీసులను కంగారుపెట్టింది.

అయితే, అన్నంనీళ్లూ లేక ఏడ్చిఏడ్చి ఆకలితో చిన్నారి చనిపోతే తానే కొండ కింద పాతిపెట్టానని తల్లి సుమలత చెప్పడంతో మరోసారి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే, డాగ్ స్క్వాడ్‌తో రెండ్రోజులపాటు చిట్టడవిలో గాలించినా పోలీసులు ఆచూకీ కనిపెట్టలేకపోయారు. మూడ్రోజులపాటు వెదికినా చిన్నారి ఆచూకీ దొరకకపోవడంతో... చివరికి తల్లిని కూడా స్పాట్‌కి తీసుకొచ్చారు. తల్లి కూడా స్పాట్‌ని ఐడెంటిఫై చేయలేకపోవడంతో... 20మంది పోలీసులు, 30మంది కుటుంబ సభ్యులతో కలిసి అడవి జల్లెడపట్టి చివరికి చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. మట్టిలో కప్పిన చిన్నారి మృతదేహాన్ని చూసిన జ్ఞానస తండ్రి తట్టుకోలేకపోయాడు. చిన్నారి మృతదేహం దగ్గర కూర్చొని గుండెలు పగిలేలా విలపించాడు.

చిన్నారి తల్లి సుమలత... ఇంటి నుంచి వెళ్లిపోయే ముందు... తన వయస్సున్న మహిళ ఆహారం నీళ్లూ లేకుండా ఎన్ని రోజులు జీవించవచ్చనే విషయాన్ని  తన ఫోన్ ద్వారా గూగుల్ వెదికినట్లు పోలీసులు గుర్తించారు. ఇక, చిన్నారిని తీసుకుని కొండెక్కి చిట్టడవిలోకి వెళ్లిన సుమలత.... తన గొంతు, చేతిపై గాయాలు చేసుకుని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే, ఆ ప్రయత్నంలో సొమ్మసిల్లిపడిపోవడంతో మూడ్రోజుల తర్వాత గొర్రెల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. అలా, సుమలత ఆచూకీ దొరికినా... చిన్నారి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. అయితే, చిన్నారిని తల్లే చంపిందా? లేక సుమలత చెబుతున్నట్లుగా అన్నంనీళ్లూ లేక ఏడ్చిఏడ్చి చనిపోయిందా? అనేది సస్పెన్స్‌గా మారింది. పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత క్లారిటీ రానుంది. అయితే, సుమలత పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో... ఆమె మానసిక స్థితిపైనా పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

By
en-us Political News

  
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బిజీ విద్యార్థులు మరియు ఉద్యోగినుల కోసం ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్ అందిస్తున్న వీకెండ్ బ్యూటీ కోర్సుల వివరాలు. శని, ఆదివారాల్లో మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ నేర్చుకుని ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా మారే సువర్ణ అవకాశం!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.