Publish Date:Feb 23, 2025
చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా పాకిస్థాన్ ను చిత్తు చేసి లెక్క సరి చేసింది. ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. అలవోకగా సెంచరీ సాధించి భారత్ కు ఘన విజయాన్ని అందించాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా పాకిస్థాన్ పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత కింగ్ కోహ్లీ వన్డే సెంచరీ సాధించి ఫామ్ ను అందిపుచ్చుకున్నాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 244 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా 42.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ రిజ్వాన్ 77 బంతుల్లో 46 పరుగులు, షకీల్ 76 బంతుల్లో 62 పరుగులు సాధించారు. భారత్ బౌలర్లలో కుల్దీప్ మూడు వికెట్లు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు దక్కించుకుకోగా, హర్షిత్ రాణా, జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.
ఇక భారత్ బ్యాటర్లలో స్కిప్పర్ రోహిత్ వర్మ 20 పరుగులు చేయగా, శుభమన్ గిల్ శుభ్మన్ గిల్ 46, శ్రేయస్ అయ్యర్ 56 పరుగులు చేశారు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ తొలి బంతి నుంచీ సాధికారికంగా ఆడాడు. 111 బంతుల్లో సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. వికెట్ల మధ్య చిరుతలా పరుగెడుతూ సింగిల్స్ సాధించాడు. కోహ్లీ ఏడు ఫోర్లు సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 51వ సెంచరీ. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/virat-kohli-unbeaten-century-25-193311.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.