కాలికనడకన తిరుమల కొండకు 116 ఏళ్ల బామ్మ.. టీటీడీ రియాక్షన్.. వెరీ గుడ్.!

Publish Date:Jul 6, 2026

Advertisement

కలియుగ  ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల పవిత్ర క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. సాధారణంగా భక్తులు తిరుమలేశుని దర్శనం చేసుకోవడానికి గంటల తరబడి కంపార్ట్ మెంట్లలో, క్యూలైన్లలో వేచి చూడాల్సి వస్తుంది. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం తక్కువగా ఉంటుంది. క్యూలైన్లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా బ్రేక్ దర్శనం భక్తులకు ఒకింత సులభంగా స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆ వీఐపీ బ్రేక్ దర్శనం మూమూలు భక్తులకు లభించే అవకాశం ఇసుమంతైనా లేదు. కానీ ఓ సామాన్య భక్తురాలికి టీటీడీ ఆ సౌకర్యం కల్పించింది. ఆమెను వెతికి పట్టుకుని మరీ వీఐపీ బ్రేక్ దర్శనం చేయించింది. 

ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.   116 ఏళ్ల వయసున్న ఒక వృద్ధురాలు శ్రీవారి దర్శనం కోసం కొండపైకి కాలినడకన వచ్చారు. ఆ వయోవృద్ధురాలు మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  సాధారణంగా యువకులే తిరుమల కొండ మెట్లు ఎక్కడానికి ఆపసోపాలు పడుతుంటారు. అలసిపోయి పదేసి మెట్లకు ఒక సారి ఆయాసంతో విశ్రాంతి తీసుకుని మళ్లీ నడక ప్రారంభిస్తుంటారు. అటువంటిది..  116 ఏళ్ల వయస్సులో, శారీరక ఇబ్బందులను అధిగమించి, కేవలం భగవంతుడిపై ఉన్న అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆమె తిరుమల కొండ మెట్లను ఎక్కి స్వామివారి దర్శనం కోసం రావడం నెటిజనులనే కాదు, సామాన్యులనుసైతం విశేషంగా ఆకట్టుకుంది. 

తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు.  శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం  చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.  

వెంటనే స్పందించిన ఆయన ఆ వృద్ధురాలి వివరాలను తెలుసుకుని.. మెట్టు మెట్టూ ఎక్కి తిరుమలేశుని దర్శనానికి వచ్చిన ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు  ప్రత్యేకంగా విఐపి బ్రేక్ దర్శనం కల్పించారు.  116 ఏళ్ల వయసులో కాలినడకన వచ్చిన నవనీతమ్మకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అత్యంత గౌరవప్రదంగా స్వామివారిని దర్శించుకు ఏర్పాట్లు చేశారు. టీటీడీ చర్యపట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  

Tirumala updates, TTD VIP Break Darshan, 116 year old lady Tirumala, Navaneetamma Tirupati

By
en-us Political News

  
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
2026 రక్షాబంధన్ సందర్భంగా సోదరుడి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం మరియు దీర్ఘాయువు కోసం సోదరీమణులు చేయాల్సిన పవిత్ర దానాల విశిష్టతలను తెలుసుకోండి. ఆహార ధాన్యాలు, బెల్లం, వస్త్రాలు మరియు నల్ల నువ్వుల దానం వల్ల కలిగే ఆధ్యాత్మిక, జ్యోతిష్య ప్రయోజనాలు ఇవే!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.