జగన్‌కు ఊడిగం చేశారు.. ఇప్పుడు ఇరుక్కున్నారు!

Publish Date:Mar 23, 2025

Advertisement

ఎట్టకేలకు రాష్ట్ర సమాచారశాఖ మాజీ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి పాపం  పండింది.  వైసీపీ  హయాంలో అనేక అవినీతి,అక్రమాలు, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన విజయకుమార్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, చెప్పాపెట్టకుండా ఢిల్లీకి వెళ్లిపోయారు. జగన్‌ మీడియాతో పాటు ఆయనకు భజన చేసిన కొన్ని టీవీ చానళ్లు, మరిన్ని యూట్యూబ్‌ చానళ్లు, సోషల్‌ మీడియాకు నిబంధనలు ఉల్లంఘించి  వందల కోట్ల రూపాయలను ప్రకటనల రూపంలో దోచిపెట్టారని ఆయనపై అభియోగాలున్నాయి. ఎట్టకేలకు విజయ్‌కుమార్‌రెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేయడంతో ఆయనకు కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కేంద్ర సర్వీసులకు చెందిన ఆయన ప్రస్తుతం కోల్‌కతాలో పనిచేస్తున్నారు. ఈ-మెయిల్‌ ద్వారానేగాక హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి కూడా ఏసీబీ నోటీసులు పంపింది. ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌కు చెందిన విజయ్‌కుమార్‌రెడ్డి, జగన్‌ పాదయాత్ర సమయంలోనే ఆయనకు మద్దతు ప్రకటించి జగన్ భజన మొదలుపెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక 2019లో డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. 2024 వరకు సమాచార శాఖ కమిషనర్‌గా విచ్చలవిడి వ్యవహారాలు చేపట్టారు. జగన్‌ సొంత మీడియాతో పాటు అనుకూల మీడియా, భజన మీడియాకు ప్రభుత్వ ప్రకటనల రూపంలో అడ్డగోలుగా వందల కోట్ల రూపాయలు దోచిపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ఓడించి గత ఏడాది గద్దెనెక్కిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై విజిలెన్స్‌-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే బాధ్యతను ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి విజయ్‌కుమార్‌రెడ్డిపై గుంటూరులో కేసు నమోదు చేశారు.

రాష్ట్ర సర్వీసుల నుంచి వెళ్లిపోతే, తన అవినీతి, అక్రమాలు బయటకు రావనీ,  తనను ఎవరూ ఏమీ చేయలేరని విజయ్‌కుమార్‌రెడ్డి భావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గత ప్రభుత్వంలో అవినీతిపై ఆచితూచి చర్యలు తీసుకుంటుండడంతో, తనను ఏమీ చేయరనే ధీమాతో విజయ్‌కుమార్ కనిపించారు. అయితే, విజిలెన్స్‌ విచారణలో ఆయన చేసిన అవినీతి, అక్రమాలు, అనైతిక కార్యక్ర మాలు బట్టబయలు కావడంతో ఇప్పుడు ఏసీబీ అధికారుల ముందు నిల్చోవాల్సి వచ్చింది. జగన్‌ అధి కారంలోకి రాకముందే, రాష్ట్ర సంపదను ఎలా జగన్‌కు దోచిపెట్టాలన్నదానిపై ఒప్పందం చేసుకు, రాష్ట్రానికి వచ్చిన విజయ్‌కుమార్‌రెడ్డి వచ్చిన వెంటనే పనిలోకి దిగిపోయారు. 

జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విజయ్‌కుమార్‌రెడ్డి చేసిన మొదటి పని పత్రికల టారిఫ్‌ పెంపుదల. పత్రికా యాజమాన్యాలు ఎవరూ అడగకపోయినా..అన్ని పత్రికల టారిఫ్‌ పెంచేశారు. ఎవరూ అడగకుండానే టారిఫ్‌లు పెంచడంతో అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు. కేవలం పెద్ద పత్రికలకే కాదు..చిన్న పత్రికలకు కూడా టారిఫ్‌ పెంచేశారు. ఎవరో ఒకరు కోర్టులో కేసులు వేసి,  జగన్ మీడియాకు దోచిపెట్టకుండా అడ్డుకుంటారన్న భావనతో..అందిరికీ పెంచేశారట. 

అయితే రేట్లు పెంచారు కానీ, ఇతర పత్రికలకు ఐదేళ్లలో కనీసం ఒక్క ప్రకటన ఇచ్చిన పాపాన పోలేదు. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, చిన్నపత్రికలకు ఎన్నోకొన్ని ప్రకటనలు ఇచ్చేవి. ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పుడల్లా, వారికీ ప్రకటనలు ఇచ్చేవి. కానీ జగన్‌, విజయ్‌కుమార్‌రెడ్డిలు ఐదేళ్లలో ఒక్క ప్రకటనా ఇచ్చిన పాపాన పోలేదు. జగన్‌ సొంత మీడియాతోపాటు అనుకూల మీడియా, భజన మీడియాకు ప్రభుత్వ ప్రకటనల రూపంలో అడ్డగోలుగా వందల కోట్లు దోచిపెట్టారు. 

ఇప్పుడు విజయ్‌కుమార్‌రెడ్డి ఏసీబీ విచారణకు హాజరుకాకుండా రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. విచారణకు రావాలని శుక్రవారం ఆయనకు నోటీసు ఇవ్వగా,  తాను ఇప్పుడు బిజీగా ఉన్నానని, రానని.. వీలు చూసుకొని ఏప్రిల్‌లో వస్తానంటూ సమాధానమిచ్చారు. విజయ్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసుకున్నారు. అది విచారణలోనే ఉంది. అరెస్టు నుంచి ఆయనకు ఎలాంటి రక్షణ లేదు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కాకుండా సాకులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు మరోసారి ఫలానా తేదీలో విచారణకు రావాలంటూ నోటీసులివ్వాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
ఏపీ లిక్కర్ స్కాంలో గోవిందప్ప లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఆయన రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ సిండికేట్‌లో గోవిందప్ప బాలాజీ సభ్యుడిగా ఉన్నారని, మద్యం ఆర్డర్ ఆఫ్ సప్లై, గుర్తింపు పొందిన బ్రాండ్లు నిలిపివేతలో గోవిందప్ప కీలకంగా వ్యవహరించారని సిట్ తేల్చింది. ప్రముఖ బ్రాండ్ల లిక్కర్ ను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి కోట్ల రూపాయలు ఆర్జించారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది.
ఆపరేషన్ సిందూర్ ఆపి అమెరికాకు మోకాలొడ్డిన ప్రధాని మోడీ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఈ ఆపరేషన్ ద్వారా ఇండియా పాకిస్థాన్ కు కలిగించిన నష్టం నుంచి కోలుకోవడానికి రెండుమూడు దశాబ్దాలు పడుతుందంటూ.. యుద్ధ నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలు, విశ్లేషణలు భారత ప్రభుత్వం ఎంత సంయమనంతో వ్యవహరించిందో.. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు సాధించిందో అవగతమౌతోంది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్టైలే డిఫరెంట్. అభివృద్ధి పనుల విషయంలో ఆయన టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరీ ముందుకు కదులుతారు. తన సొంత నియోజకవర్గమైన నెల్లూరు రూరల్ లో దాదాపు 41 కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో మొత్తం 339 అభివృద్ధి పనులను రికార్డు సమయంలో పూర్తి చేసి అన్ని పనులనూ ఓకే రోజు ప్రారంభిస్తున్నారు.
ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న వేళ అకస్మాత్తుగా భారత్,పాక్ ల మధ్య కాల్పుల విరమణ జరగడం..కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలనూ అంగీకరింపచేయడం తన ఘనతేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భుజాలను తానే చరిచేసుకుని, తనను తానే ఓ గొప్ప శాంతి దూతగా అభివర్ణించేసుకోవడం తెలిసిందే.
భారత్ పై టర్కీ డ్రోన్స్ తో పాక్ దాడి చేసింది. నాలుగురోజుల ఆపరేషన్ సింధూర్ తో భారత్ గట్టి జవాబు ఇచ్చింది. వందల సంఖ్యలో టర్కీడ్రోన్స్ ను భారత్ కూల్చివేసింది. 2023 లో టర్కీలో వచ్చిన భూకంపానికి ఆ దేశం కకావికలం అయి దిక్కుతోచని స్థితిలో పడిన సమయంలో ఏ దేశం ముందుకు రాని స్థితిలో భారత్ ఆపరేషన్ దోస్తు అంటూ ఆహారం,మందులు ఇతర సహాయం అందించింది.
జూన్, జూలై నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గడవు ముగిసనా ఎన్నికలు జరగక పోవడం వలన స్థానిక సంస్థలకు రావలసిన కేంద్ర నిధులు ఆగిపోయాయి. దీంతో కులగణన అయిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని గత ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్తలొచ్చాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం (మే15) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 14 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
కల్నల్ సోఫియా ఖురేషి పై బీజేపీ మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఉగ్రవాదుల సోదరిగా పేర్కొంటూ మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను మీడియాకు వివరించిన కల్నల్ సోఫియా ఖురేషీ 1999లో ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్‌లో చేరారు. 2016లో మల్టీనేషనల్ మిలటరీ విన్యాసాలకు సారథ్యం వహించిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
పాకిస్థాన్ ప్రభుత్వానికి, ఉగ్రవాదానికి ఉన్న నెక్సస్ ప్రతి సందర్బంలోనూ బయటపడుతూనే ఉందిద. భారత్ లో జరిగిన ప్రతి ఉగ్రదాడిలోనూ ఆ దేశ ప్రేరేపిత ఉగ్ర సంస్థల ప్రమేయం, వాటికి పాకిస్థాన్ ప్రభుత్వ, సైన్యం సహాయ సహకారాలు మద్దతు ఉన్నట్లు పదేపదే రుజువైంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎట్టకేలకు దాదాపు 3 నెలల తరువాత బెయిలు మంజూరైంది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారు సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి, బెదరించి ఆ కేసు ఉపసంహరించుకునేలా చేసిన కేసులో వల్లభనేని వంశీని ఈ ఏడాది ఫిబ్రవరి 13న పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
అమెరికా, చైనా ఫైటర్‌ జెట్లను చూసుకుని తమ వాయుసేన బలంపై పాకిస్థాన్ మిడిసిపడింది. అయితే తాజాగా ఆపరేషన్‌ సిందూర్‌లో ఆ దళాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే భారత్‌ చావు దెబ్బ తీసింది. అత్యంత కచ్చితత్వంతో దాదాపు డజను సైనిక స్థావరాలను భారత్‌ ధ్వంసం చేసింది.
వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు ఆర్థిక మంత్రిగా చక్రం తిప్పి, ఐదేళ్లూ వరుసగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన బుగ్గన ఆ ఓటమితో డోన్ లో అడ్రస్ లేకుండా పోయారు.
వైసీపీలో కీలక నేతగా వెలుగొందిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అధికారంలో ఉన్నంత కాలం తెగ దూకుడు ప్రదర్శించారు. అలాంటి ఫైర్‌బ్రాండ్ కనీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. తన స్వగ్రామం తుమ్మలగుంట అత్మీయసభలో మీకు అన్ని చేశాను, కాని మీరు నా కొడుకును ఓడించారంటూ తన మనోవేదన వెళ్లగక్కిన సందర్భంలో ఆయన కళ్లు చెమర్చాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.