అగజానునికి... అగ్రికల్చర్ కి లింకేంటో తెలుసా?

Publish Date:Sep 5, 2016

Advertisement

వినాయక చవితి... కేవలం ఒక్క రోజు పండుగ కాదు. చవితినాడు మొదలై చతుర్ధశి దాకా సాగే సుదీర్ఘ పండగ! వినాయక నవరాత్రులు అంటారుగాని పది లేదా పదకొండు రోజులు కొనసాగే అతి పెద్ద పండుగ! ఇన్ని రోజులు నడిచే మరో పండగ ఏదీ హిందువులకు లేదు మన దేశంలో! అంటే... అందరికంటే ఎక్కువగా పండుగలు చేసుకునే మనకే లేదంటే... ఇక భూమ్మీద మరెవరికి ఇంత కాలం కొనసాగే పండగ లేదన్నట్టే! మొత్తానికి ప్రపంచంలో అతి సుదీర్ఘ పండగ... వినాయక ఉత్సవం!

వినాయక చవితి పండుగ ఎక్కువ రోజులు కొనసాగటం మాత్రమే విశేషం కాదు! గణపతికి సంబంధించిన ప్రతీదీ ప్రత్యేకమే! మామూలుగా విఘ్నేశ్వరుని పార్వతీ తనయుడు, శివ నందనుడు, షణ్మఖు సోదరుడు అంటుంటాం. అలాగే, ఆయన మూషికాసురుని సంహరించాడని, విఘ్నాలకి అధిపతి అని పురాణ కథలు చెప్పుకుంటూ వుంటాం. కాని, వీటన్నిటికంటే విశేషమైన కోణం మరొకటి వుంది గణాధిపతిలో! ఆయన రూపం వ్యవసాయానికి , వ్యవసాయ ఆధారిత జీవనశైలికి సంకేతం అని మీకు తెలుసా? 


గణపతి కేవలం పురాణాల్లో చెప్పిన ఒకానొక దేవుడు మాత్రమే కాదు. ఆయన్ని పూజించని హిందువు ఎవ్వరూ ఉండరు! అందుక్కారణం ఏ పూజ చేసినా ప్రథమ పూజ అందుకోవాల్సింది ఆయనే! అంత ప్రాముఖ్యత గణపతికి వుండటానికి కారణం ఆయనతో అత్యంత సామాన్య జనానికి కూడా వున్న సంబంధం , అనుబంధమే!. వినాయక చవితి వచ్చేది భాద్రపద శుక్ల పక్షంలో. అంటే వర్షాలు పడుతూ రైతులు నాట్లు వేసే సమయమన్నమాట! అందుకే, మన ఋషులు ఆయన రూపాన్ని ప్రత్యేకంగా మట్టితో తయారు చేయమన్నారు! గణపతి భూ స్వరూపుడు! జగన్మాత అయిన పార్వతి నలుగు పిండితో, అంటే భూ అంశతో , ఆయన్ని రూపుదిద్దుతుంది! ఇలా భూ తత్వం గల వినాయకుడ్ని పూజిస్తే పంటలు సమృద్దిగా పండుతాయని మన వారి విశ్వాసం!


ఇక గజాననుడైన వినాయకుడికి ఒక దంతం వుంటుంది. అందుకే , ఆయన ఏకదంతుడని అంటారు! ఇది వ్యవసాయ దృష్టితో చూసినప్పుడు నాగలికి సంకేతం! నాగలి వుంటేనే పంటలు పండేది! కడుపులు నిండేది!. నాగలి మాత్రమే కాదు గణపయ్య రూపంలో తూర్పార పట్టే చేటలు కూడా వుంటాయి! అవ్వే ఆయన పెద్ద పెద్ద ఏనుగు చెవులు! ఇంకాస్త కిందకి వస్తే లంబోదరుడైన ఆయన పెద్ద పొట్ట ధాన్యం నిలువ చేసే గాదెలకు సంకేతం. అంతే కాదు, తాను ఎంత భారీగా వున్నా చిట్టి ఎలుకని మూషిక వాహనుడు ఎక్కడం వెనుక కూడా వ్యవసాయ కోణం వుంది! పంటల్ని పాడు చేసే ఎలుకల్ని వినాయకుడు తన అధీనంలో వుంచుకుంటాడన్నమాట! ఎలుకల్ని నిలువరించే పాముల్ని కూడా గణాధిపతి తన కడుపుకి మొలతాడుగా కట్టుకుంటాడు! 


గణేశుడి రూపంలోని సంకేతమే కాదు ఆయన పూజ కూడా ప్రకృతితో ముడిపడిందే! 21 రకాల పత్రాలతో పచ్చగా సాగిపోతుంది పార్వతీ తనయుడి ఆరాధన! ఈ రకరకాల పత్రాలన్నీఊళ్లలో పంట, పొలాల పక్కనే దొరుకుతాయి. అంటే... వ్యవసాయం బావుండాలని పూజ చేస్తూ అదే పొలాల్లో దొరికే పూలు, పత్రితో పూజించటం అన్నమాట!. పదకొండు రోజులు పూజలందుకున్న గణనాథుడు నిమజ్జనానికి గంగమ్మ వద్దకు వెళతాడు! ఇది కూడా వ్యవసాయానికి సంకేతమే! మట్టిని దున్ని పంటలు పండించుకుని రకరకాల పత్రాలు, పూలు మొలిచిన తరువాత ఏం చేస్తాం? కొత్త పంట వేసుకునే ముందు నిండుగా నీళ్లతో మడులన్నీ నింపేస్తాం! అచ్చం అలాగే, మట్టితో చేసిన మహాగణపయ్యని నీళ్లలో నిమజ్జనం చేసి నీటిని పావనం చేస్తాం!

భారతీయ పండుగలు కేవలం ఛాందసమైన విశ్వాసాల ఆధారంగా ఏర్పడ్డవి కావని నిరూపించే మరో మహోన్నత పర్వం వినాయక చవితి! ఈ పండుగలో భక్తి మాత్రమే కాక ప్రకృతి పట్ల ప్రేమ కూడా అణువణువునా తొణికిసలాడుతుంది! 

By
en-us Political News

  
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.