సీపీఆర్‌తో నడిరోడ్డుపై ప్రాణాలు కాపాడిన లేడీ డాక్టర్!

Publish Date:May 17, 2024

Advertisement

మీ ఇంట్లో మీరు మీ కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడుతూ వుంటారు. ఇంతలో ఒక ఫ్యామిలీ మెంబర్ అచేతనంగా పడిపోతారు. కార్డియాక్ అరెస్ట్ కావచ్చు.. అప్పుడు మీరేం చేస్తారు? మీరు ఆఫీసులో వుంటారు.. మీ కొలీగ్ ఒకరు ఉన్నట్టుండి స్పృహ కోల్పోతారు అప్పుడు మీరేం చేస్తారు? వేరే ఎవరో కాదు.. మీరే అనుకోండి.. ఉన్నట్టుండి దబ్బుమని కింద పడిపోతారు.. అప్పుడు మీ ఇంట్లోవారు గానీ, ఆఫీసులో వాళ్ళు గానీ ఏం చేయాలి? మీ ప్రాణాలు పోకుండా ఎలా కాపాడాలి? ఇలాంటి సందర్భాల్లో ప్రాణాలు పోసే సంజీవని సీపీఆర్ (Cardio pulmonary resuscitation - CPR).

కార్డియో పల్మోనరీ రీససిటేషన్‌ని షార్ట్ కట్‌లో సీపీఆర్ అని పిలుస్తారు. ఎవరైనా స్పృహ తప్పి పడిపోయినా, కార్డియాక్ అరెస్టు అయినా, ఏదైనా గొంతుకు అడ్డం పడినా, కరెంట్ షాక్‌కి గురై అచేతనంగా పడిపోయినా, నీటిలో మునిగిపోయినా, ఊపిరి అందకపోయినా, డ్రగ్స్ ఓవర్ డోస్ అయినా... ఇలాంటి సందర్భాల్లో సీపీఆర్ చేయడం వల్ల అచేతనంగా పడిపోయిన వ్యక్తులు మళ్ళీ ప్రాణాలతో బతికి బయటపడతారు. శ్వాస ఆడేలా చేయడం, ఆగిపోయిన గుండెను మళ్ళీ కొట్టుకునేలా చేయడం సీపీఆర్ ద్వారా జరిగి జీవితాలు నిలబడతాయి.

సీపీఆర్ వల్ల ప్రాణాలు నిలబడతాయని తెలిసినా చాలామంది సీపీఆర్ చేయడం నేర్చుకోరు. జనానికి సీపీఆర్ మీద అవగాహన లేకపోవడం వల్ల ప్రతి ఏటా ఎంతోమంది చనిపోతున్నారు. ఎవరైనా అచేతనంగా పడిపోతే చుట్టూ వున్నవారు హడావిడి పడిపోవడమో, అంబులెన్స్.ని పిలవటమో, ఆస్పత్రికి తరలించడమే చేస్తారు తప్ప సీపీఆర్ చేయాలన్న ఆలోచన చాలామందికి రావడం లేదు. దాని వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో సీపీఆర్ అందించగలిగితే ప్రాణాలు నిలబడతాయి. అందుకే అందరికీ సీపీఆర్ మీద అవగాహన వుండాలి. సీపీఆర్ నేర్చుకోవాలి.

విజయవాడలోని అయ్యప్ప నగర్ ప్రాంతంలో సాయి అనే ఆరేళ్ళ బాలుడికి కరెంట్ షాక్ కొట్టింది. దాంతో ఆ బాలుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు సాయిని తీసుకుని డాక్టర్ దగ్గరకి వెళ్తున్నారు. రోడ్డు మీద వెళ్తున్న వీళ్ళని డాక్టర్ రవళి చూశారు. వాళ్ళని ఆపారు. ఆ బాలుడికి అక్కడే సీపీఆర్ చేశారు. దాంతో సాయి ప్రాణాలు దక్కించుకున్నారు. సమయానికి అక్కడకి వచ్చి, సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన డాక్టర్ రవళికి అందరూ ధన్యవాదాలు తెలిపారు. అందుకే అందరూ సీపీఆర్ నేర్చుకోవాలి. ఆపదలో వున్నవారినిని కాపాడాలి.

By
en-us Political News

  
సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. జూన్ 4న ఫలితాలు అధికారికంగా వెలువడతాయి. అయితే ప్రజా నాడి ఎలా ఉంది అనేది తెలుసుకునేందుకు ఎగ్జిట్ పోల్స్ చాలా వరకూ దోహదం చేస్తాయి.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ!
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమిదే అధికారం అని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ తేల్చేసింది. ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ సొంతంగా 95 నుంచి 100 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది.
ఏపీ లోక్‌సభ సర్వే మరింత విస్తారంగా...
లోక్‌సభ స్థానాల్లోనూ వైసీపీకి పెద్ద దెబ్బ
ఏపీలో ఎవ‌రు గెల‌వ‌బోతున్నారు. తెలుగుదేశం కూట‌మి అధికారంలోకి రాబోతోందా? మ‌రో సారి వైసీపీ అధికార పీఠాన్ని ద‌క్కించుకోబోతుందా? ఒక‌వేళ తెలుగుదేశం కూట‌మి గెలిస్తే ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది. ప్ర‌ముఖ‌ రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్న‌ట్లు వైసీపీకి ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌దా?
ap parliment Exit polls, exit poll, ap exit polls, andhra pradesh elections 2024, ap elections 2024, exit poll, pre poll survey
కూటమిదే భారీ విజయం: జనగళం
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సర్వే సంస్థలు విడుదల చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ లో తెలుగుదేశం హవానే సూచిస్తున్నాయి. దాదాపు వందకు పైగా స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ముందుగా పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలుగుదేశం కూటమికి 125 స్థానాలు, వైసీపీకి 50 స్థానాలు వస్తాయి.
టీడీపీ కూటమికే ఘన విజయం దక్కనుందని రైస్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. తెలుగుదేశం కూటమికి 113 నుంచి 122 సీట్లు వస్తాయిని, వైసీపీకి 48 నుంచి 60 సీట్లు వస్తాయని, ఇతరులు ఒక్క స్థానం గెలుచుకునే అవకాశం వుందని రైస్  సర్వే వెల్లడించింది.
కేకే సర్వే కూడా కూటమి వైపే.. వైసీపీకి 14 సీట్లే!
కూటమిదే ఘన విజయం: పీపుల్స్ పల్స్ సర్వే
ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి దాదాపు ఇర‌వై రోజులు కావొస్తున్నది. ఎన్నిక‌లు ముగిసిన నాటి నుంచి మేమే అధికారంలోకి వ‌స్తున్నామ‌ని తెలుగుదేశం, వైసీపీ నేత‌లు చెబుతున్నారు. మ‌రోసారి జ‌గ‌న్ సీఎం అవుతార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్న‌ప్ప‌టికీ.. పోలింగ్ స‌ర‌ళిని చూస్తే అలాంటి ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో అభివృద్ధిని మ‌రిచి కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కే ప‌రిమితం కావ‌టంతో ప్ర‌జ‌లు విసిగిపోయారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.