కాంగ్రెస్ కు క్యూ కడుతున్న  విజయశాంతి..?

Publish Date:Jun 26, 2023

Advertisement

దేశ రాజకీయాలలో కాంగ్రెస్ కర్ణాటక విజయం.. కొత్త ఉత్సాహం.. కొత్త సమీకరణాలకు శ్రీకారం చుట్టింది.  ఇక తెలంగాణలో.. కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్ గెలుపుతో.. ఆ పార్టీ గ్రాఫ్ పైకి దూసుకెళ్లుతుంది. పార్టీలో చేరికలు ..భారీగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. బీజేపీని వదిలేసి తొందరలో కాంగ్రెస్ లో చేరబోయే నేతల పేర్లలో విజయశాంతి పేరు కూడా ప్రచారమవుతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణల పేర్లు వినబడుతున్నాయి. ఒకపుడు విజయశాంతి కాంగ్రెస్ లో ఉన్నవారే. అయితే వివిధ కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో తనకు గుర్తింపు దక్కటం లేదనే తీవ్ర అసంతృప్తి ఈమెను పట్టి పీడిస్తోంది. తన సేవలను ఉపయోగించుకోవాల్సిన పార్టీ ఏమాత్రం పట్టించుకోవటంలేదని బాహాటంగానే తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. చాలాకాలంగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు.అందుకనే తొందరలోనే కమలం పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రచారంలో నిజం కూడా లేకపోలేదనే అనుకుంటున్నారు. ఎందుకంటే అందుకు విజయశాంతి వైఖరే కారణం. ఆమె బీజేపీలో గుర్తింపు  లేక..ఇబ్బంది పడుతున్నారు. ఏ పార్టీలో ఉన్నా తనకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం దక్కాలని కోరుకుంటారు. అయితే అందరు ప్రత్యేకంగా గుర్తించటానికి, గౌరవించటానికి ఆమెకున్న కెపాసిటి ఏమిటి అనే విషయాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  నిజానికి సినీ గ్లామర్ అన్న ఒక్క విషయాన్ని పక్కనపెట్టేస్తే విజయశాంతిలో మరే ప్రత్యేకతా లేదు. జనాలను ఆకర్షించేంత వాగ్దాటిలో కూడా జీరోనే.  రాష్ట్రంలోని ఏ ఒక్క నియోజకవర్గంలో కానీ వర్గంలో కానీ ఆమెకు పట్టులేదు. సినిమాల్లో అయితే ఆమె బాగానే రాణించారు. అది గతం.  అదే విధమైన గుర్తింపు రాజకీయాల్లో కూడా రావాలంటే దొరకదని ఆమె నమ్మి తీరాలి. 

ఎటువంటి ప్రత్యేకత, పట్టులేని విజయశాంతిని ఏ పార్టీ అయినా ఎందుకు అంతగా ప్రాధాన్యతిస్తుంది ? పైగా తల్లి తెలంగాణా అనే పార్టీ పెట్టారు. దుకాణం సరిగా నడవకపోవటంతో దాన్ని టీఆర్ఎస్ లో కలిపేశారు. అక్కడినుండి ఒకసారి ఎంపీగా గెలిచారు. తాను ఎంపీగా గెలవగానే అంత తన గొప్పతనమే అనుకున్నారు. దాంతో కేసీయార్ తో వ్యక్తిగతంగా చెడింది. అందుకనే టీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరారు. మళ్ళీ బయటకు వచ్చేస్తారనే ప్రచారం పెరిగిపోతోంది. విషయ పరిజ్ఞానం లేదు... వాక్పటిమ లేదు.. జనాకర్షణ లేదు... ఇక రాజకీయ పరిణతి అసలే లేదు. అలాంటి నాయకురాలిని ఏ పార్టీ కూడా  చేర్చుకునేందుకు ముందుకు రాదు.   ఆమె ఏ పార్టీలో చేరినా..  మూడునాళ్ల ముచ్చటే.  ప్రస్తుతం విజయశాంతి రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.