బక్కన్నకి రాములమ్మ జలక్

Publish Date:May 30, 2013

Advertisement

 

ఒకవైపు తెలంగాణా ఉద్యమ సైన్యాదిపతి బక్కన్నకేసీఆర్, పార్టీలోకి రావడానికి చాలాకాలంగా మొరాయిస్తున్న ఇద్దరు టీ-కాంగ్రెస్ యంపీలను అతికష్టం మీద పార్టీలోకి లాక్కొని వచ్చేందుకు తిప్పలు పడుతుంటే, మరో వైపు ఆయనను నిత్యం అంటిబెట్టుకొని తిరిగే చెల్లెమ్మ రాములమ్మ వెళ్లి ముఖ్యమంత్రిని కలిసివచ్చి ఆయనకు జలక్ ఇచ్చింది.

 

తన మెదక్ సీటుపై కేసీఆర్ ఇంతవరకు స్పష్టమయిన హామీ ఏమీ ఈయకపోగా, దానిని పార్టీలోకి కొత్తగా జేరిన ఐఏయస్ ఆఫీసర్ రమణాచారికి అప్పగించేందుకు బ్రదర్ బక్కన్న డిసైడ్ అయినట్లు కనిపెట్టింది చెల్లెమ్మ. అందువల్ల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మేలనుకొని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలో తన సరికొత్త అన్నగారిని చూసుకొన్న రాములమ్మ, కాంగ్రెస్ కండువా ఇస్తే కప్పుకోవడానికి తాను సిద్దం అని స్పష్టమయిన సంకేతం ఇచ్చి వచ్చింది.

 

అయితే శంఖంలో పోస్తే గానీ నీళ్ళు తీర్ధం కావు గనుక అమ్మహస్తం పట్టుకొని తిరుగుతున్నకిరణన్నగారు తనకి అభయ హస్తం ఇచ్చేవరకు ఎటువంటి (ఇందిరమ్మ) కలలు కనడం మంచిది కాదని ఆమెకు తెలుసు గనుక, ముఖ్యమంత్రితో తన భేటీని అపార్ధం చేసుకొని రాజకీయం చేయవద్దని, తానూ కేవలం తన మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మెదక్- అక్కన్నపేట రైల్వే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరడానికే మాత్రమె ఆయనను కలిసానని ఆమె సంజాయిషీ ఇచ్చుకొన్నారు. అయితే తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు త్రాగుతున్నానని చెప్పినా నమ్మని జనం ఆమె మాటలని నమ్మడం లేదిప్పుడు.

 

ఆమె గతంలోనే ఒకసారి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని కలిసివచ్చినపటికీ కాలం కలిసి రాకపోవడంతో వెనక్కి తగ్గింది. ఆ తరువాత కిషన్ రెడ్డికి రాఖీ కట్టి బీజేపీలో చేరుదామని చెల్లెమ్మ కొంచెం ఊగిసలాడినా మళ్ళీ బక్కన్నకన్విన్స్ చేసేయడంతో ఇంతవరకు తెరాసనే అంటిపెట్టుకొని ఉంది. కానీ, తన బక్కన్నమళ్ళీ తనకి హ్యాండిస్తునట్లు అనుమానం రాగానే, ఎందుకయినా మంచిదని కిరణన్నని కలిసి తన కర్తవ్యం తానూ నిర్వర్తించి వచ్చింది.

 

మరి తన బక్కన్న, కిరణన్నలలో ఎవరు ఆమెచేత రాఖీ కట్టించుకొని ఆమెకు మెదక్ లోక్ సభ టికెట్ గిఫ్టుగా ఇస్తారో చూడాలి మరి.

By
en-us Political News

  
కాళేశ్వరం మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్‌ భూక్యా హరిరాంని అక్రమాస్తుల కేసులో అరెస్టు చేసింది ఏసీబీ. హరిరాంతో సంబంధమున్న 14 ప్రదేశాలతో దాడులు చేసింది అవినీతి నిరోధకశాఖ. ఈ దాడుల్లో భూక్యా హరిరాంకి సంబంధించిన భారీ ఎత్తున అక్రమాస్తులున్నట్టు గుర్తించిన ఏసీబీ హరిరాంను గజ్వేల్ లో శనివారం అరెస్టు చేసింది.
Hanmakonda, Elkaturthi, BRS Party, Silver Jubilee Celebration, Rahul Gandhi, Janareddy, KK, Vem Narender Reddy, Operation Kagar,KCR, KTR, Maoists
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం. గత ఆ నియోజకవర్గ కేంద్రం అయిన కుప్పం మునిసిపాలిటీ మాత్రం గత ఐదేళ్లుగా వైసీపీ చేతిలో ఉంది. కుప్పం మునిసిపల్ చైర్మన్ గా వైసీపీ నేత డాక్టర్ సుధీర్ రెడ్డి ఉండేవారు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత సుధీర్ రెడ్డి తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు.
విశాఖ మహానగర పాలక మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవం ఎన్నికయ్యారు. మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ ప్రతిపాదించగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. మేయర్ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. దీంతో మేయర్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. కోరం సరిపోవడంతో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. జీవీఎంసీ పాలకవర్గ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. జిల్లా సంయుక్త కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి.. కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు హాజరయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ టీం మొత్తం ఇప్పుడు విజయవాడ జిల్లా జైలులో ఊచలు లెక్కపెడుతోందా? అంటే అందరూ కాకపోయినా చాలా మంది పరిస్థితి అలాగే ఉందని సమాధానం వస్తుంది.
అమరావతి పనుల పున: ప్రారంభానికి మే2న ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు షెడ్యూల్ కూడా ఖరారైంది. మోడీ పర్యటనను విజయవంతం చేయడానికి ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో జగన్‌కు అత్యంత సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ4 గా నమోదు అయిన రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇటీవల సీఐడీ అధికారులు విచారించారు. తర్వలో మరోసారి విచారణకు హాజరు అవ్వాలని నోటీసులు ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీకి 2023లో జరిగిన ఎన్నికలలో పరాజయం పాలై అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ చరిత్రలో అత్యంత కీలకమైన రాజకీయ సభ ఏదైనా ఉందంటే... అది ఆదివారం వరంగల్ వేదికగా జరిగిన రజతోత్సవ సభ మాత్రమే.
వేసవి సెలవులు కావడం, ఇంటర్ టెన్త్ పరీక్షా ఫలితాల విడుదల కారణంగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. మరీ ముఖ్యంగా వారాంతాలలో అయితే తిరుమల కొండపై ఇసుక వేస్తే రాలనంతగా భక్త జనసందోహం ఉంటోంది.
తినేమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం (ఏప్రిల్ 28) శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ లోనే అనుమతిస్తున్నారు.
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటక సెక్రటరీ స్మితా సభర్వాల్‌ను ఫైనాన్స్ క‌మిష‌న్ మెంబ‌ర్ సెక్ర‌ట‌రీగా స్మితా స‌బ‌ర్వాల్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.
మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అవసరమైతే డైరీల్లో రాసుకోండి అని సూచించారు. పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలని.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. అత్యుత్సాహం ప్రదర్శించొద్దని సూచించారు. ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదని.. నేను కూడా రేపటినుంచి బయల్దేరుతా ఒక్కొక్కరి సంగతి చూస్తా అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.