శాంతి తో రిలేషన్ బయట పెట్టిన విజయసాయి

Publish Date:Jul 20, 2024

Advertisement

దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి తో తనకున్న రిలేషన్ గూర్చి వైకాపా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా విజయసాయి, శాంతితో అక్రమ సంబంధం గూర్చి చర్చ జరుగుతుంది. శాంతి కొడుకుకు విజయసాయి తండ్రి అని చెప్పిన శాంతి భర్త మదన్ మోహన్ నిన్న రాష్ట్ర హోంమంత్రి అనితను కల్సి డిఎన్ఏ టెస్ట్ చేయాలని  కోరారు. గిరిజన చట్టాల ప్రకారం శాంతి  ఇంకా తన భార్య అని, ఇంకా విడాకులు కూడా మంజూరు కాలేదని ఆయన వివరణ ఇచ్చారు. డిఎన్ ఏ పరీక్ష విజయసాయిరెడ్డి, సుభాష్ రెడ్డిలకు చేయాలని మదన్ మోహన్ కోరుతున్నారు. డిఎన్ ఏలో తాను తండ్రి కాదని తేలితే  చట్టబద్దంగా విడాకులు కూడా ఇస్తానన్నారు.  లీగల్ గా భర్త  అయిన తనకు ఫ్యూచర్ లో  ఇబ్బందులు ఉండకూడగన్న ఉద్దేశ్యంతో డిఎన్ ఏ టెస్ట్ అడుగుతున్నట్లు చెప్పారు. మదన్ మోహన్ పదే పదే డిఎన్ ఏ టెస్ట్ అడుగుతున్నప్పటికీ శాంతి మాత్రం డిఎన్ ఏ అవసరం లేదంటూ పట్టుబడుతున్నారు.  అడ్వకేట్ సుభాష్ రెడ్డి ద్వారా బిడ్డను కన్నట్లు శాంతి అంగీకరించింది.  మదన్ మోహన్ తనపై చేస్తున్న ఆరోపణల గూర్చి విజయసాయి  మొదటిసారి స్పందించారు.  వైజాగ్ సీతమ్మధారలో మొదటి సారి శాంతితో భేటీ అయినట్లు ఆయన చెప్పారు. దేవాదాయ  అసిస్టెంట్  కమిషనర్ హోదాలో ఉన్నశాంతిని 2020లో కలిసినట్లు విజయసాయి చెప్పుకొచ్చారు. శాంతిని బిడ్డ మాదిరిగా చూసుకున్నాను. శాంతికి బిడ్డ పుడితే  ఇంటికి వెళ్లి పరామర్శించాను.  తన బిడ్డతో కల్సి తాడేపల్లి గూడెంకు వస్తే  శాంతిని బిడ్డ మాదిరిగా చూసుకున్నానని విజయసాయి చెప్పుకొచ్చారు. కొన్ని టీవీ చానళ్లు మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని వక్రీకరించి ప్రసారం చేస్తున్నాయని విజయసాయి అంటున్నారు.  ఇంత జరుగుతున్నా సుభాష్ రెడ్డి స్పందించకపోవడంతో వివాదం మరింత ముదురుతుంది. శాంతి బిడ్డకు తండ్రి సుభాష్ రెడ్డి ప్రూవ్ కాకపోతే వియసాయి తండ్రి అని కన్ఫర్మ్ అవుతుంది. ఈ కారణంగా విజయసాయి ఆదేశం మేరకు సుభాష్ రెడ్డి అండర్ గ్రౌండ్ లో వెళ్లినట్లు తెలుస్తోంది. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.