వైసీపీ మునిసిపోల్ అక్రమాలపై ఫిర్యాదు: ఎస్ఈసీని కలిసిన తెలుగుదేశం నేతల బృందం.!

Publish Date:Nov 2, 2026

Advertisement

మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీ  అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిందంటూ తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను  ఆశ్రయించింది. వైసీపీ అగ్రనేతలు, కార్యకర్తలు ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ ఎన్నికల నిర్వహణకు విఘాతం కలిగించారని ఆరోపిస్తూ   ఫిర్యాదు  అందజేశారు.

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు,  ఎంఎల్‌సి వర్ల రామయ్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్   అనిల్ చంద్ర పునేఠాని కలసి ఈ ఫిర్యాదు చేసింది. ఎస్ఈసీని కలిసిన బృందంలో వర్ల రామయ్య తో పాటు నాలెడ్జ్ కమిటీ చైర్మన్ గురజాల మాల్యాద్రి, జాతీయ అధికార ప్రతినిధి,  ఏపీ బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు,  బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్,  తెలుగుదేశం పార్టీ అధికారప్రతినిది బండారు వంశీ కృష్ణ తదితరులు ఉన్నారు.

ఈ  సందర్భంగా వారు  పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.

దీంతోపాటు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన అక్రమాలను కూడా ప్రత్యేకంగా ఫిర్యాదులో ప్రస్తావించారు. 16వ డివిజన్‌లోని గుణదల ప్రాంతానికి చెందిన బూత్ నెంబర్ 5లో పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగుతున్న సమయంలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా చొరబడ్డారని   వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ, నిబంధనలను ఉల్లంఘించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అధికార పరిధిని దాటి, పోలింగ్ కేంద్రాల్లోకి అనుచరులతో ప్రవేశించి ఓటర్లను భయపెట్టేలా వ్యవహరించిన దేవినేని అవినాష్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని   డిమాండ్ చేశారు.  తెలుగుదేశం పార్టీ నేతలు అందించిన ఫిర్యాదులను స్వీకరించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా, ఈ అంశాలపై నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తామని తెలిపారు. సమగ్ర విచారణ జరిపి నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

[TDP Complaint SEC, Pulivendula Municipality Elections, Jagan, Provocation, Gunadala, Devineni Avinash, Booth Entry, AP Local Body Elections, Telugu One] 

By
en-us Political News

  
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.