జగన్ మెప్పు కోసం మతాల మార్పిడి.. విజయసాయిరెడ్డి సంచలనం.!

Publish Date:Sep 16, 2026

Advertisement

జగన్ హయాంలో లవ్ జిహాద్ లు, మతమార్పిడులు జరిగాయని గతంలో ఆరోపించిన విజయసాయిరెడ్డి తాజాగా జగన్ హయాంలో ఆయన మెప్పు పొందడం కోసం పెద్ద ఎత్తున బలవంతపు మతమార్పిళ్లకు వైసీపీయులు పాల్పడ్డారని మరో బాంబు పేల్చారు. వైసీపీలో గతంలో నంబర్ 2 స్థానంలో చక్రం తిప్పిన విజయసాయి, ఆ పార్టీ తరఫున రెండు సార్లు రాజ్యసభకు వెళ్లారు. వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ మాజీ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. మత మార్పిడి అంశాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన ప్రకటనలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున దుమారానికి దారితీశాయి.   తాజాగా విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్టులో  జగన్ విధానాలపై  విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా జగన్ హయాంలో రాష్ట్రంలో మత మార్పిడిలను ప్రోత్సహించారన్న కోణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వేదికలపైనా కూడా హాట్ టాపిక్ గా మారాయి. చాలా కాలం పాటు వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా, మరీ ముఖ్యంగా జగన్ సన్నిహితుడిగా, వైసీపీలో    కీలక పదవులు నిర్వహించిన వ్యక్తిగా విజయసాయి నుంచి వచ్చిన వ్యాఖ్యలు వైసీపీని డిఫెన్స్ లో పడేశాయి.  

వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ కూడా జగన్ కు రాజకీయ సలహాదారుగా, కుడి భుజంగా మెలిగిన విజయసాయి జగన్ అధికారంలో ఉండగా మతమార్పిళ్లు జరిగాయని చేసిన వ్యాఖ్యలను చాలా మంది నమ్ముతున్నారు. దీంతో వైసీపీ డిఫెన్స్ లో పడి విజయసాయి వ్యాఖ్యలు రాజకీయ లబ్ధి కోసమేనంటూ ఎదురుదాడికి దిగింది.  ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ ఆరోపణలను   ఖండించారు. విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవన్న సజ్జల. వైయస్ జగన్ మోహన్ రెడ్డి   అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని, ఏ ఒక్క మతానికి వ్యతిరేకంగా, లేదా ఒక మతాన్ని బలవంతంగా ప్రోత్సహించే విధంగా  ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ, అధికారంలో లేని  సమయంలోనూ కూడా జగన్ అన్ని వర్గాల ప్రజల విశ్వాసాలను కాపాడే చర్యలు తీసుకున్నారన్నారు.  

విజయసాయి రెడ్డి వైసీపీని   వీడి చాలా కాలం గడిచిపోయిందని, వ్యక్తిగత కారణాల వల్ల ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లారన్న ఆయన..   విజయసాయి పార్టీని వీడినప్పుడు ఆయనపై జగన్ ఎటువంటి విమర్శలూ చేయలేదని గుర్తు చేశారు.

విజయసాయి మాటలు పట్టించుకోనవసరం లేదు కానీ, ఇప్పుడు మత మార్పిడులపై విజయసాయి చేసిన వ్యాఖ్యలపై మౌనంగా ఉంటే..   ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందనే ఉద్దేశంతోనే తాను మీడియా ముందుకు వచ్చి స్పందిస్తున్నానన్నారు.  దశాబ్దాలుగా జగన్ కుటుంబంతో కలిసి పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.  మొత్తంగా స్థానిక ఎన్నికల ముంగిట విజయసాయి చేసిన వ్యాఖ్యలు వైసీపీకి పెద్ద మైనస్ అవుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ వినా ఆయన కుటుంబం నుంచి ఎవరూ కూడా ఇంత వరకూ తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరు కాకపోవడం, జగన్ కూడా డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించడం వంటి విషయాలను గుర్తు చేస్తున్నారు. మొత్తంగా జగన్ హయాంలో బలవంతపు మతమార్పిళ్లు అన్న విజయసాయి వ్యాఖ్యలు వైసీపీకి పెద్ద శరాఘాతంగా మారతాయనడంలో సందేహం లేదని అంటున్నారు. 

[Vijayasai Reddy, YS Jagan Mohan Reddy, YSRCP, Sajjala Ramakrishna Reddy, Andhra Pradesh Politics,Telugu One]

By
en-us Political News

  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.