కొత్త పార్టీయే..తిరుమల వేదికగా కన్ ఫర్మ్ చేసిన విజయసాయి.!

Publish Date:Aug 19, 2026

Advertisement

మాజీ ఎంపీ, రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే వ్యాపకం అని చాటిన  విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయ అడుగులు ప్రారంభించారు. గత కొంత కాలంగా ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన బీజేపీలోకి చేరతారనీ, కాదు కాదు మళ్లీ వైసీపీ గూటికి చేరనున్నారంటూ పెద్ద ఎత్తున జరుగుతున్నచర్చోపచర్చలకు, ఊహాగాన సభలకు తెరదించుతూ ఆయన కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు.  బుధవారం (ఆగస్టు 19) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న విజయసాయి రెడ్డి దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై స్పష్టత ఇచ్చారు.  

 ప్రజా సమస్యలపై పోరాడేందుకు కొత్త వేదికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పిన విజయసాయి..   ప్రజల తరఫున నిలబడి వారి హక్కుల కోసం ప్రశ్నించే బలమైన గొంతుకగా తాను నూతన పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  ప్రజల సంక్షేమం, ప్రయోజనాలే ధ్యేయంగా తమ భవిష్యత్ రాజకీయ ప్రస్థానం ఉంటుందన్నారు.  

పార్టీ నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక ప్రక్రియను ఈ నెల్లోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించిన విజయసాయి..  పార్టీ పేరు,  జెండా, విధానాలు, కార్యాచరణకు  సంబంధించిన వివరాలను త్వరలోనే  ప్రకటించనున్నట్లు తెలిపారు.   

గతంలో వైసీపీలో కీలక నేతగా, రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన  విజయసాయిరెడ్డి, ఆ తరువాత వైసీపీ నుంచి బయటకు వచ్చి రాజకీయ సన్యాసం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇప్పుడు సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి క్రియాశీలం కానుండటం విశేషం. విజయసాయి ఏర్పాటు చేయనున్యన కొత్త రాజకీయ పార్టీ  ఏపీ రాజకీయాల్లో  ఏ మేరకు  ప్రభావం చూపుతుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది.  

Vijayasai Reddy, New Political Party, Tirumala Srivari Darshan, AP Politics, Vijayasai Reddy Party Announcement

By
en-us Political News

  
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.