విజయసాయికి షాక్.. ఆర్ఆర్ఆర్ ఎఫెక్టేనా?

Publish Date:Dec 8, 2022

Advertisement

వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కేంద్రం  షాకిచ్చింది. రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్ పేర్ల జాబితా నుంచి ఆయన పేరును తొలగించింది. ముందుగా ప్యానల్ లో ఆయన పేరును ప్రకటించి, రెండు రోజుల వ్యవధిలోనే తొలగించింది. తొలుత  ప్రకటించిన రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ జాబితాలో విజయసాయి రెడ్డి  పేరు ఉంది.

దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. పలు ఆర్థిక నేరాల కేసుల్లో విజయసాయి రెడ్డి ఏ2గా ఉన్నారు, ఆయనను రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ జాబితాలో ఎలా చేరుస్తారంటూ ప్రశ్నలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పేరును తొలగించారు. తొలుత ఎనిమిది మంది పేర్లతో విడుదల చేసిన జాబితాలో విజయసాయికి స్థానం దక్కింది. అయితే ఆ తరువాత రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ సభ్యులను వెల్లడించే సమయంలో రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీష్ ధన్కఢ్ కేవలం ఏడుగురి పేర్లు మాత్రమే చదివారు. ఆయన చదివిన పేర్లలో వైసీపీ ఎంపీ విజయసాయి పేరు లేదు. ఆయనను రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ జాబితా నుంచి తొలగించారు.

అయితే విజయసాయి రెడ్డిని రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ జాబితా నుంచి తొలగించడానికి కారణాలేమిటన్నది మాత్రం రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీష్ ధన్కఢ్  వెల్లడించలేదు. ఈ ప్యానెల్ జాబితాలో తన పేరు ఉన్నట్లు తెలియగానే విజయసాయి స్పందించారు. ఉపరాష్ట్రపతికి కృతజ్ణతలు తెలిపారు.  సభ నిర్వహణలో పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే హఠాత్తుగా ప్యానల్ జాబితా నుంచి ఆయనను తొలగించడంపై మాత్రం ఇంత వరకూ ఆయన స్పందించలేదు.

అయితే ఈ జాబితా నుంచి విజయసాయిరెడ్డి పేరు తొలగించడంపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు (ఆర్ఆర్ఆర్) ఫిర్యాదు కారణంగానే విజయసాయి పేరును తొలగిస్తూ రాజ్యసభ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. విజయసాయి సామాజిక మాధ్యమంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రఘురామకృష్ణంరాజు ఇటీవల రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఆ ఫిర్యాదులో ప్యానల్ జాబితా నుంచి విజయసాయిరెడ్డిని తొలగించాలని రఘురామ కోరారు. దీంతో విజయసాయి తొలగింపు వెనుక రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు ఉందని అంటున్నారు. అయితే రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ జాబితా నుంచి తన పేరు తొలగింపుపై విజయసాయి రెడ్డి స్పందన ఏమిటనేది తెలియాల్సి ఉంది.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.