Publish Date:Jan 28, 2025
విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటన సృష్టించిన సంచలనం ఇంకా పూర్తిగా సమసిపోలేదు. ఆయన రాజీనామాకు కారణాలు, రాజీనామాకు వెనుక ఉన్న ఉద్దేశాలు, బీజేపీకి అదనంగా ఒక ఎంపీ సీటు ఇవ్వడం కోసమే నంటూ విశ్లేషణలు.. ఇందంతా జగన్ ప్లానే అన్న అనుమానాలూ ఇంకా సాగుతూనే ఉన్నాయి.
ఈ లోగానే విజయసాయి రెడ్డి తన కొత్త ఉద్యోగం మొదలెట్టేశారు. రాజీనామా ప్రకటన సందర్భంగా చెప్పినట్లు వ్యవసాయం చేయడం ఆరంభించేశారు. అలా మొదలెట్టేసి ఊరుకోలేదు. తాను వ్యవసాయం చేస్తున్న ఫొటోలు ఎక్స్ లో పోస్టు చేశారు. రాజకీయాలను దూరమై ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నాననీ, ఈ వ్యాపకం తనకెంతో హాయిగా, సంతోషంగా ఉందంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. అసలు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం వార్తే ఆశ్చర్యం కలిగిస్తే.. ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను రాజ్యసభ స్వీకర్ క్షణం జాగు చేయకుండా ఆమోదించేయడం మరింత ఆశ్చర్యం కలిగించింది.
ఇక దానికి మించి విజయసాయిరెడ్డి చిప్పినట్లుగానే వ్యవసాయ వ్యాపకంలోకి దిగిపోవడం ఎక్కువ ఆశ్చర్యం కలిగిస్తోంది. విజయసాయి రెడ్డి తాజాగా రైతుగా తన పనుల్లో నిమగ్నమై ఉన్న ఫొటోలను ట్వీట్ చేశారు. ఆ ఫొటోల్లో ఆయన హార్టికల్చర్ సాగు చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తం మీద తాను అన్న మాటకు కట్టుబడి ఉన్నానని చాటుకోవడానికి విజయసాయి ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారని తేటతెల్లమైపోతోంది. రాజకీయాలు వదిలేశాను ఇదిగో రుజువు.. ఇక నన్ను వదిలేయండి మహప్రభో అని కూటమి నేతలను అభ్యర్థిస్తున్నట్లుగా విజయసాయి ట్వీట్ ఉందంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijayasai-new-avatar-25-191971.html
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.