Publish Date:Jan 25, 2025
విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. విజయసారిరెడ్డి ఇంత హఠాత్తుగా రాజీనామా చేయడం వెనుక ఉన్న వ్యూహం ఏమిటన్నదానిపైనే రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. కేసుల నుంచి తప్పించుకోవడానికే వ్యూహాత్మకంగా విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం అంటున్నారన్న వాదన బలం పుంజుకుంటోంది.
ఈ నేపథ్యంలోనే పలువురు తెలుగుదేశం నేతలు విజయసాయిరెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేసుల నుంచి తప్పించుకోజాలరని అంటున్నారు. ఇదే విషయంపై తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజీనామా చేసి, రాజకీయాలనుంచి వైదొలగినంత మాత్రాన చట్టం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదనీ, విజయసాయి చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు. విజయసాయి హయాంలో విశాఖ వాసులు పడిన ఇక్కట్లు, విశాఖలో జరిగిన విధ్వంసం, దాడులు అందరికీ తెలుసునన్న గంటా శ్రీనివాసరావు అన్నారు. అయితే విజయసాయి రాజీనామాతో ఒక విషయం మాత్రం ప్రస్ఫుటమైందనీ, వైసీపీ అనేది మునిగిపోయే నావ అన్నది తేటతెల్లమైందని గంటా అన్నారు. వైసీపీ మునిగిపోయే నావ అన్న విషయం తాను ఎప్పుడో చెప్పాననీ, ఇప్పుడది నిజం కాబోతోందని పేర్కొన్నారు.
ఇక అమరావతి బహుజన సమాఖ్య అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అయితే విజయసాయిని ఒక మాయల ఫకీరుగా అభివర్ణించారు. ఆయన ఏదైనా చేయగలరు, ఎవరినైనా నమ్మించగలరని పేర్కొన్నారు. విజయసాయి రాజీనామాను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఆమోదించిన నేపథ్యంలో శనివారం (జనవరి 25) మీడియాతో మాట్లాడిన బాలకోటయ్య.. ఏదో బోధి వృక్షం కింద జ్ణానోదయం అయ్యింది అనుకోవడానికి విజయసాయి బుద్ధుడు కాదన్నారు. ఇక తన భవిష్యత్ వ్యవసాయమే అని విజయసాయి చెప్పడాన్ని కూడా బాలకోటయ్య ఎద్దేవా చేశారు. గత నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి విదేయుడైన ఆడిటర్ గా వ్యవహరించిన విజయసాయికి వ్యవసాయం అంటే ఏం తెలుసునని ప్రశ్నించారు. జగన్ రెడ్డి పార్టీలోనూ, ఆయన కేసుల్లోనూ కూడా ఏ2గా ఉన్న విజయసాయి వ్యవసాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తనంతటి వాడు లేడని విర్రవీగి, అధికారం పోగానే పలాయనం చిత్తగించటం విజయసాయి నైజమని విమర్శించారు. ఆయన రాజకీయ సన్యాసం అనడం వంద ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయ సన్యాసం పుచ్చుకున్నంత మాత్రాని చట్టం నుంచి తప్పించుకోగలననుకోవడం విజయసాయి భ్రమ మాత్రమేనని బాలకోటయ్య అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijayasai-mayalaphakir-39-191845.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.