తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పై విజయ్ వర్సెస్ రజనీకాంత్

Publish Date:Jun 6, 2026

Advertisement

తమిళనాట మరో రాజకీయ పార్టీ తెరమీదకు రానుంది.  కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించి,  తన  మొదటి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించి, ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం ఒక పొలిటికల్ సునామీలా మారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏ ఇతర రాజకీయ నాయకుడికైనా ఇది ఒక తీరని కల అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే  తమిళనాట విజయ్  సునామీ   ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు  పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇప్పటికే రజినీకాంత్ ఒక సారి రాజకీయ పార్టీ అంటూ హడావుడి చేసి.. వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే.  

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా రజినీకాంత్ తాజా రాజకీయ అడుగులపై  చర్చ నడుస్తోంది. ఇందుకు  ప్రధాన కారణం రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్ ప్రారంభించిన ప్రజా ఉద్యమం. ఆమె తమిళనాడులో  మక్కల్ మేడై అంటే తెలుగులో ప్రజల వేదిక  అనే ఒక పౌర వేదికను అధికారికంగా ప్రారంభించారు. స్థానిక స్థాయిలో సరికొత్త నాయకులను తయారు చేయడం, వారి ద్వారా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడటం తన  మక్కల్ మేడై   ముఖ్య ఉద్దేశంగా ఆమె  ప్రకటించారు. ఒక రకంగా ఇది సమాజ సేవకు, రాజకీయ అవగాహనకు సంబంధించిన మంచి కార్యక్రమమే అయినప్పటికీ.. నెటిజన్లు మాత్రం దీని వెనుక ఉన్న టైమింగ్‌ను నిశితంగా గమనిస్తున్నారు. సరిగ్గా దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన తరుణంలోనే ఈ సంస్థను తీసుకురావడం వెనుక  పొలిటికల్ స్ట్రాటజీ   ఉందని నెటిజనులు అనుమానిస్తున్నారు.  

  దళపతి విజయ్‌కు వస్తున్న విపరీతమైన క్రేజ్, స్టార్‌డమ్ ను రజినీకాంత్ జీర్ణించుకోలేకపోతున్నారా అంటూ నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు.  విజయ్ ఇమేజ్‌ను,  ప్రజాదరణను ఏదో మేరకు  తగ్గించేందుకే రజినీకాంత్ కుటుంబం ఈ సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను తెరపైకి తెచ్చిందంటున్నారు.    మక్కల్ మేడై  సంస్థను స్థాపించింది రజినీకాంత్ కాదు, ఆయన భార్య లతా రజినీకాంత్ అయినప్పటికీ.. ఆమో తన సంస్థకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించినప్పటికీ..  దీని వెనుక ఖచ్చితంగా రజనీకాంత్ ఉంటారనీ, ఉన్నారనీ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. రజినీకాంత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దళపతి విజయ్ రాజకీయ ఎదుగుదలను చూసి తాను ఎంతో సంతోషిస్తున్నానని   చెప్పారు.

అంతేకాకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్‌కు  శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన పదవీ కాలం విజయవంతం కావాలని కోరుకున్నారు. ఒకవైపు రజినీకాంత్ ఇలా సానుకూలంగా స్పందించినా.. తాజాగా రజనీకాంత్ భార్య ప్రారంభించిన మక్కల్ మేడై సంస్థ పెద్ద రాజకీయ దుమారాన్నే రేపుతోంది. ఇది కేవలం సేవా సంస్థగానే మిగిలిపోతుందా.. ముందు ముందు  విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ అస్త్రంగా మారుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే ప్రస్తుతం తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పై విజయ్ వర్సెస్ రజనీ అన్న చర్చకు కేంద్రంగా మారింది.  

By
en-us Political News

  
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.