విజయసాయి.. ఏ సంచలనాలకు తెరలేపుతారు?

Publish Date:Sep 7, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్  రాజకీయాలలో విజయసాయిరెడ్డి తీరు సంచలనంగా మారింది.  గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం నంబర్ 2గా ఓ వెలుగు వెలిగి, వైసీపీ అధినేతకు కుడిభుజంగా వ్యవహరించిన విజయసాయి.. ఆ తరువాత మారిన పరిణామంలో  వైసీపీని వీడి రాజకీయ సన్యాసం ప్రకటించారు. అలా రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి.. ఇప్పుడు సొంతంగా ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. తన రాజకీయ పార్టీ జెండా, అజెండా ప్రకటనకు సోమవారం (సెప్టెంబర్ 7) ముహూర్తం నిర్ణయించారు. 

బెజవాడ వేదికగా ఆయన సోమవారం  మీడియా సమావేశంలో కొత్త పార్టీ జెండా, అజెండావి ప్రకటించనున్నారు.  వైసీపీతో విభేదించి బయటకు వచ్చిన తరువాత విజయసాయిరెడ్డి.. రాష్ట్ర రాజకీయాలపై తరచూ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో ఆయన కుండబద్దలు కొట్టినట్లుగా ఆ స్కామ్ కర్తా, కర్మా, క్రియా రాజ్ కేసిరెడ్డి అని వెల్లడించిన సంగతి తెలిసిందే. వైసీపీలో జరిగిన అరాచకాలు, అక్రమాలు, అవినీతిపై విజయసాయి దశల వారీగా వివరాలు వెల్లడిస్తూ.. ఆ పార్టీని డిఫెన్స్ లో పడేస్తున్నారు.  వైసీపీలో ప్రస్తుతం నంబర్ 2గా చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఇటీవల ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ప్రకటనతో మరిన్ని సంచలనాలకు తెరలేపుతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సోమవారం (సెప్టెంబర్ 7) విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్ లో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయసాయి కొత్త పార్టీ విధి విధానాలు, పేరు, జండా, అజెండా ప్రకటించే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  


[Vijay Sai Reddy Vijayawada Pressmeet, AP Politics, Vijay Sai Reddy New Party, YCP Telugu Desham, AP Politics, Telugu One]

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.