విజయసాయి నయా స్ట్రాటజీ: రీల్స్, వీడియోలతో ఇస్తున్న సంకేతమేంటి.?

Publish Date:Oct 31, 2026

Advertisement

వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయి అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది ఆయన రాజకీయ విమర్శలు, వ్యూహాలు, ప్రెస్ మీట్లే. ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, పార్టీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన విజయసాయి రెడ్డి ఆ తరువాత క్రమంగా పార్టీలో ప్రాభవం, పలుకుబడి కోల్పోయారు. దరిమిలా 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం తరువాత ఆయన పార్టీకీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేశారు. రాజకీయ సన్యాసం ప్రకటించి వ్యవసాయమే తన వ్యాపకమని ప్రకటించారు. అయితే కొద్ది కాలానికే రాజకీయ సన్యాసంపై యూటర్న్ తీసుకుని సొంత పార్టీ అంటూ ప్రకటనలు గుప్పించారు. పనిలో పనిగా జగన్ పై విమర్శలూ గుప్పించారు. విజయసాయి తొలి నుంచీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటూ వచ్చారు. ఇప్పుడు తాజాగా ట్రెండ్ మార్చారు. ఇన్ స్టా గ్రాం రీల్స్ తో సందడి చేస్తున్నారు. 

ఇటీవల   సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విజయసాయి  రాజకీయ విషయాలకే పరిమితం కాకుండా, విభిన్న అంశాలపై  రీల్స్ రూపొందిస్తూ  నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. తాజాగా  తారకరత్న కుమార్తెతో కలిసి ఆయన ఇటీవల చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్  అయ్యింది.   

అయితే విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే రాజకీయాల్లోకి సొంత పార్టీతో రీఎంట్రీ ఇవ్వబోతున్న విజయసాయి, ఇలా రీల్స్ లో నెట్టింట, నెటిజనులలో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.  

[Vijay Sai Reddy Instagram reels, New Political Strategy, AP politics, videos, digital politics, Telugu One]

By
en-us Political News

  
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.