విజయసాయి రెడ్డి గవర్నరా? బుర్రుందా?

Publish Date:Apr 12, 2024

Advertisement

వైసీపీ ఏ2 విజయసాయిరెడ్డి మెరుపు కలలు మామూలుగా  లేవుగా. అయ్యగారి దృష్టి ఇప్పుడు గవర్నర్ పదవి మీద  పడింది. ఈ ఆర్థిక నేరగాడు రెండుసార్లు రాజ్యసభకు వెళ్ళడమే ప్రజాస్వామ్యంలో జరిగిన పెద్ద పొరపాటు అని ప్రజాస్వామ్యవాదులు అనుకుంటుంటే, ఏకంగా గవర్నర్  పదవిని ఆశిస్తున్నట్టు చెప్పి విజయసాయిరెడ్డి తన దురాశని సిగ్గూ ఎగ్గూ లేకుండా బయటపెట్టుకున్నారు.

విజయసాయిరెడ్డి రెండుసార్లు చొక్కా నలగకుండా, చెమట చుక్క చిందించకుండా ఎంచక్కా రాజ్యసభ సభ్యత్వాన్ని పొందారు. ఏ1 జగన్ పుణ్యమా అని ఏ2 విజయసాయిరెడ్డి ఉన్నత పదవిలో ఊరేగారు. పదవి పెంచిన అహంకారం ప్రకోపించి తన వాచాలత్వాన్ని అనేక సందర్భాల్లో  ప్రదర్శించారు. తన ట్విట్టర్ అకౌంట్లో బూతుపురాణాలు రాశారు.  ప్రపంచ వ్యాప్తంగా ట్విటర్ని అత్యంత నీచాతి నికృష్టంగా వాడిన వాళ్ళ లిస్టు తయారు చేస్తే అందులో విజయసాయి  పేరు టాప్ ఫైవ్‌లో వుండే అవకాశం వుంది. కుసంస్కారంలో పరిధులు దాటిపోయిన ఈయన ఇప్పుడు గవర్నర్ లాంటి పెద్దమనిషి పదవిని ఆశించడమే వింతల్లోకెల్లా వింత. పరువు పాతాళానికి పోతుంటే, మాటలు ఆకాశంలో  విహరించడం అంటే ఏమిటో విజయసాయి రెడ్డిని చూస్తే అర్థమవుతుంది.

ఏపీలో ఈసారి వైసీపి తుడిచిపెట్టుకుని పోవడం ఖాయమనే విషయం అందరికీ అర్థమైపోయింది. వైసీపీ నాయకులకు కూడా ఈ విషయం అర్థమైపోయినా అర్థం  కానట్టు భ్రమల్లో బతుకుతున్నారు. 2024 ఎన్నికల తర్వాత తనని గవర్నర్ చేయాలని, ఒకవేళ 2024లో కుదరకపోతే  2029 ఎన్నికల తర్వాత అయినా తనను గవర్నర్‌గా  రికమండ్ చేయాల్సిందిగా జగన్‌ని విజయసాయిరెడ్డి రిక్వెస్ట్  చేశారట, తన రిక్వెస్ట్.ని జగన్ ఓకే చేస్తారని ఆశిస్తున్నారట.  

సర్పంచ్‌గా పోటీ చేసినా గెలవలేని స్థాయి వున్న విజయసాయిరెడ్డిని ఈసారి ఏకంగా నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా జగన్ ఆదేశించారు. ఈ ఆదేశం శరాఘాతంలా తగిలినప్పటికీ చేసేదేం లేక నెల్లూరు నియోజవర్గంలో విజయసాయిరెడ్డి ఫ్యామిలీ మెంబర్లతో కలసి ప్రచార తంటాలు పడుతున్నారు. వేడివేడి బిర్యానీ పెడతామని పిలుస్తున్నా జనం పట్టించుకోకుండా విజయసాయి ప్రచార సభల నుంచి పారిపోతున్నారు. నెల్లూరు ఎంపీ స్థానంలో విజయసాయిరెడ్డి గెలిచే అవకాశం లేదని ఏమాత్రం రాజకీయ అవగాహన వున్నవారికైనా అర్థమయ్యే విషయమే. మరి విజయసాయిరెడ్డికి అర్థం కాకుండా వుంటుందా? అందుకేనేమో 2024 ఎన్నికల తర్వాత గవర్నర్ గిరీ దక్కించుకుంటే ఏ కేసులూ గట్రా లేకుండా హ్యాపీగా విశ్రాంతి తీసుకోవచ్చని అయ్యగారు భావిస్తున్నట్టున్నారు. కలలు కనొచ్చుగానీ, కాస్త సాధ్యాసాధ్యాలు కూడా చూసుకోవాలి కదా విజయసాయిరెడ్డి సార్!

By
en-us Political News

  
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన మలుపుల మధ్య సాగుతోంది.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు...కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాల్..
మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు. మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29) క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.
జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
ఆ అమ్మాయి నోట జగన్ సార్ అనే మాట రాగానే.. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
  బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.
ఈ శిలాఫలకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ వింత పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన ఆయన, ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు.
కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు చోటుచేసుకుంటూనే ఉంటాయి
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.