ఎన్టీఆర్ తరువాత విజయే!

Publish Date:May 4, 2026

Advertisement

సినిమాల్లో అగ్రహీరోగా రాణించి.. రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టిన తొలి ప్రయత్నంలోనే అధికారంలోకి రావడమనేది సాధారణ విషయం కాదు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి తలపండిన నేతలకు ధీటుగా నిలబడి.. ప్రచారాలు చేసి, పార్టీని అధికారంలో నిలబెట్టిన ఘనత ఆనాటి నందమూరి తారకరామారావుకే చెందుతుంది. ఆయన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రభంజనం.

భారత రాజకీయ చరిత్రలో సినీ గ్లామర్‌కు, రాజకీయ పీఠానికి విడదీయలేని అనుబంధం ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వెండితెర వేల్పులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాకపోయినా, అడుగుపెట్టిన తొలి ప్రయత్నంలోనే అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం అనేది మాత్రం ఒక అద్భుతం. నాడు ఆంధ్రప్రదేశ్‌లో స్వర్గీయ నందమూరి తారక రామారావు  సృష్టించిన ఆ ప్రభంజనాన్ని, నాలుగు దశాబ్దాల తర్వాత నేడు తమిళనాడులో నటుడు విజయ్ పునరావృతం చేశారు.  

తమిళనాడు రాజకీయ యవనికపై  నూతన శకం ఆరంభమైంది.   ఐదు దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్యే సాగుతున్న అధికార మార్పిడికి చెక్ పెడుతూ.. దళపతి విజయ్ నేతృత్వంలోని  తమిళగ వెట్రి కళగం  అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని దక్కించుకుని  రికార్డు సృష్టించారు.  ఆ  తరువాత విజయ్ కూడా అలాగే పార్టీ పెట్టిన స్వల్ప కాలంలోనే  తమిళ గడ్డపై రాజకీయ ప్రభంజనాన్నిసృష్టించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన నాటి నుండి టీవీకే అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో విజయ్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు చేరువగా స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపడం ఈ విజయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అగ్రనేతలు పోటీ చేసిన స్థానాల్లో సైతం టీవీకే అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించడం గమనార్హం.  

విజయ్ తన ప్రచారంలో చాటిన  సామాజిక న్యాయం, అవినీతి రహిత పాలన నినాదాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకును విజయ్ చీల్చడమే కాకుండా,  తటస్థ ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో   సఫలీకృతమయ్యారని ఈ ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి.  
సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి నేరుగా ముఖ్యమంత్రి అయిన ఎంజీఆర్, జయలలిత వారసత్వాన్ని విజయ్ కొనసాగిస్తున్నారని ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, గత నేతల కంటే భిన్నంగా విజయ్ ఆధునిక రాజకీయ పోకడలను, టెక్నాలజీని వాడుకుంటూ ప్రజలకు చేరువయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు..  మార్పు కోరుకునే ఓటర్లందరూ టీవీకే గుర్తుకే ఓటు వేశారని ఈ ఫలితాలు విస్పష్టంగా చెబుతున్నాయి. 

ఈ విజయం కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా..  దక్షిణాది రాజకీయాల్లోనే ఒక పెద్ద మార్పుగా భావించవచ్చు. ప్రాంతీయ పార్టీల బలం తగ్గుతున్న తరుణంలో..  ఒక కొత్త ప్రాంతీయ పార్టీ ఈ స్థాయి విజయం సాధించడం ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా చర్చనీయాంశంగా మారింది.  టీవీకే విజయంతో ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.  ఎన్టీఆర్ తర్వాత అంతటి వేగంతో అధికారాన్ని అందుకున్న నాయకుడిగా విజయ్ పేరు చరిత్రలో నిలిచిపోనుందంటున్నారు.  

ఎన్టీఆర్ తరువాత విజయ్ కు ముందు రాజకీయ పార్టీలు పెట్టి ప్రత్యక్ష ఎన్నికలలో నిలబడిన సినీ తారలు చాలా మందే ఉన్నారు. అయితే వారెవరూ కూడా విజయ్ లా విజయాన్ని అందుకోవడంలో విఫలమయ్యారు.   2005లో పార్టీ పెట్టి 2006 ఎన్నికల్లో పోటీ చేసిన నటుడు విజయ్ కాంత్.. ఆ ఎన్నికలలో ఆక్ష్న ఒక్కరే గెలిచారు. 2011లో ప్రతిపక్ష నేత స్థాయికి ఎదిగినా అధికారానికి దూరంగానే ఉండిపోయారు. ఆ తరువాత చిరంజీవి 2009లో భారీ అంచనాలతో ప్రజా రాజ్యం పార్టీని స్థాపించారు.  ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 18 సీట్లు గెలుచుకున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరుకోలేక చివరకు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

 ఆ తరువాత 2014లో పవన్ కల్యాణ్ పార్టీ పెట్ట.. , 2019లో తొలిసారి పోటీ చేస్తే కేవలం ఒక్క సీటుకే పరిమితమయ్యారు. అయితే ఆ తరువాత 2024 ఎన్నికలలో   100% స్ట్రైక్ రేట్‌తో  పోటీ చేసిన 21 స్థానాలలోనూ పార్టీని గెలిపించుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు.  ఇక 2018 కమల్ హసన్ సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించిన.. ఇంత వరకూ జరిగిన ఎన్నికలలో  ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. 

అయితే విజయం మాత్రం 2024 ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించి.. రెండేళ్లలోనే అంటే 2026 అసెంబ్లీ ఎన్నికలలో  105కుపైగా స్థానాల్లో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టనున్నారు.  దీంతో ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి కాబోతున్న స్టార్ హీరోగా విజయ్ చరిత్ర పుటల్లో నిలిచిపోనున్నారు. 

By
en-us Political News

  
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.