కోర్టులో వీగిపోయిన చెవిరెడ్డి వాదనలు.. రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలుకు

Publish Date:Jun 19, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డికి జూన్ 1 వరకూ రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు బుధవారం (జూన్ 18) ఉత్తర్వులు జారీ చేసింది. చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాజీ సీఎం, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే అయిన వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడు.  ఈ కేసులో చెవిరెడ్డితో పాటుగా  సన్నిహిత సహచరుడువెంకటేశ్ నాయుడికి కూడా కోర్టు రిమాండ్ విధించింది. 

మద్యం కుంభకోణం కేసులో తనను ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ముందుగానే ఆరోపణలు గుప్పించి తప్పించుకోవాలనుకున్న చెవిరెడ్డి అది కుదరకపోయేసరికి చేసిన సవాళ్లన్నిటినీ మరిచిపోయి ఎవరికీ తెలియకుండా బెంగళనూరు నుంచి శ్రీలంక చెక్కేయడానికి పక్కా ప్లాన్ తో బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే ఈ ప్రణాళిక ఫలించలేదు. చెవిరెడ్డిపై లుక్ ఔట్ నోటీసు ఉండటంతో బెంగళూరు విమానాశ్రయంలో చెవిరెడ్డిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని సిట్ కు సమాచారం అందించారు. దీంతో సిట్ అధికారులు విజయవాడ నుంచి హుటాహుటిన బెంగళూరు చేరుకుని చెవిరెడ్డిని అదుపులోనికి తీసుకుని బుధవారం (జూన్ 18) కోర్టులో హాజరు పరిచారు. సిట్ అధికారులు బెజవాడ చేరుకునే వరకూ చెవిరెడ్డి బెంగళూరులో ఇమ్మిగ్రేషన్ అధికారులు తన అధీనంలోనే ఉంచుకున్నారు.  

బుధవారం (జూన్ 18) ఉదయం నుంచి సాయంత్రం వరకూ చెవిరెడ్డిని విచారించి సిట్ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. అంతకు ముందు బెంగళూరులో చెవిరెడ్డి తనదైన వాదనా పటిమతో ఇమ్మిగ్రేషన్ అధికారులతో వాగ్వాదానికి దిగారని తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసులో తనపై ఎఫ్ఐఆర్ లేకుండానే ఎలా లుక్ ఔట్ నోటీసులు జారీ చేస్తారంటూ ఆయన ఇమ్మిగ్రేషన్ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం స్వయంగా న్యాయవాది అయిన చెవిరెడ్డి తన తరఫున తానే వాదించుకున్నారు.  తన పై ఎఫ్ఐఆర్ లేకుండానే లుక్ ఔట్ నోటీసు ఎలా జారీ చేస్తారనీ, రిమాండ్ రిపోర్టులో తాను చెప్పని విషయాలను సిట్ నమోదు చేసిందంటూ ఆయన కోర్టు ముందు వాదించినట్లు తెలుస్తోంది.  ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తాననీ, తనను అన్యాయంగా మద్యం కుంభకోణం కేసులో ఇరికిస్తున్నారంటూ ఆయన కోర్టులో పేర్కొన్నారు.

అయితే సిట్ అధికారులు ఆయన దేశం విడిచి పరారయ్యేందుకు ప్రయత్నించారంటూ కోర్టుకు తెలపడంతో పాటు.. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి పాత్ర కీలకమనీ, రెండు నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకూ ఆయన మద్యం కుంభకోణం ముడుపులను ఎన్నికలలో వినియోగించారి కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలూ విన్న మీదట కోర్టు చెవిరెడ్డి భాస్కరరెడ్డికి జులై 1 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు చెవిరెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఇదే జైలులో ఇప్పటికే మద్యం కుంభకోణంలో అరెస్టైన నిందితులు రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. 

By
en-us Political News

  
అమరావతి భవిష్యత్తు పై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందన్నారు. రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. లోక్ సభలో అమరావతి బిల్లు ఆమోదం స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయి అని పేర్కొన్న చంద్రబాబు.. అమరావతి ఇక అజేయం..అజరామరమన్నారు.
లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందడం అమరావతికి చట్టపరమైన రక్షణ దిశగా అత్యంత కీలక ముందడుగు పడినట్లైంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా, విస్తృత చర్చ అనంతరం మెజారిటీ సభ్యుల మద్దతుతో బిల్లును సభ ఆమోదించింది. సభలో ఈ బిల్లుపై దాదాపు రెండు గంటల పాటు చర్చ జరిగింది.
హిట్ అండ్ రన్ నేరాల కంటే అత్యంత ఘోరమైన నేరాలకు పాల్పడిన పార్టీగా విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని దుయ్యబట్టారు. అలవోకగా అబద్ధాలు చెబుతూ, వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తోందని వైసీపీ పేరు చెప్పకుండానే ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు.
గతంలో అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపిన జగన్, అధికారంలోకి వచ్చాక రంగు మార్చి మూడు రాజధానులన్నారని దుయ్యబట్టారు. జగన్ ఊసరవెల్లి రాజకీయాలు ఇకపై సాగవన్నారు.
జగన్ హయాంలో అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు తెరపైకి వచ్చింది. 2014-19 మధ్యకాలంలో రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి, తమకు అనుకూలమైన వారికి లబ్ధి చేకూర్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ, చంద్రబాబును ప్రధాన నిందితుడిగా చేరుస్తూ అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
పల్నాడు జిల్లా పోలీసు విభాగం సలహాదారుగా చదలవాడ అరవిందబాబు రామినేని ప్రసాద్ ను నియమించాలని ఎనిమిది నెలల కిందట సిఫారసు చేశారు. ఆ విషయంలో ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన స్వయంగా మంగళవారం ఉదయం పదకొండున్న గంటల సమయంలో ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ బి.కృష్ణారావును కలిశారు.
జగన్ హయాంలో అప్పటికే జోరుగా నిర్మాణమౌతున్న అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులు అంటూ ఆరంభించిన మూడుముక్కలాట కారణంగానే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చిందన్న అభిప్రాయం అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.
అసోంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో పాతిక నుంచి 30 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులే ప్రజలను ఆకర్షిస్తున్నారు. ప్రచారం నుంచి ప్రతి విషయంలోనూ వారి హవా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువ నేతలు సోషల్ మీడియా వేదికలను తమ ప్రచార మాధ్యమాలుగా ప్రభావమంతంగా వినియోగించుకుంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను చర్చిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై శాసనమండలి వేదికగా విజయశాంతి తమ సొంత ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన ఉద్యమకారులకు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా నెరవేర్చకపోవడాన్ని విజయశాంతి ఎత్తి చూపారు.
ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు ఆమోదముద్ర వేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు వచ్చే నెల 1న లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. కాగా ఈ అంశంలో కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి వచ్చే నెల 9న జరగనున్న ఎన్నికలలో ఎన్డీయే 14 నుంచి17 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ఇక విపక్ష ఎస్పీయే 9 నుంచి11, నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2 నుంచి4 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.
సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలపడాన్ని మార్షల్స్ అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం మార్షల్స్‌ను అడ్డం పెట్టుకుంటోందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంద మంది ప్రముఖులతో ప్రకటించిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఈ జాబితాలో 13వ స్థానం దక్కగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 25వ స్థానంలో నిలిచారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.