కోర్టులో వీగిపోయిన చెవిరెడ్డి వాదనలు.. రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలుకు
Publish Date:Jun 19, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డికి జూన్ 1 వరకూ రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు బుధవారం (జూన్ 18) ఉత్తర్వులు జారీ చేసింది. చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాజీ సీఎం, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే అయిన వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఈ కేసులో చెవిరెడ్డితో పాటుగా సన్నిహిత సహచరుడువెంకటేశ్ నాయుడికి కూడా కోర్టు రిమాండ్ విధించింది. మద్యం కుంభకోణం కేసులో తనను ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ముందుగానే ఆరోపణలు గుప్పించి తప్పించుకోవాలనుకున్న చెవిరెడ్డి అది కుదరకపోయేసరికి చేసిన సవాళ్లన్నిటినీ మరిచిపోయి ఎవరికీ తెలియకుండా బెంగళనూరు నుంచి శ్రీలంక చెక్కేయడానికి పక్కా ప్లాన్ తో బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే ఈ ప్రణాళిక ఫలించలేదు. చెవిరెడ్డిపై లుక్ ఔట్ నోటీసు ఉండటంతో బెంగళూరు విమానాశ్రయంలో చెవిరెడ్డిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని సిట్ కు సమాచారం అందించారు. దీంతో సిట్ అధికారులు విజయవాడ నుంచి హుటాహుటిన బెంగళూరు చేరుకుని చెవిరెడ్డిని అదుపులోనికి తీసుకుని బుధవారం (జూన్ 18) కోర్టులో హాజరు పరిచారు. సిట్ అధికారులు బెజవాడ చేరుకునే వరకూ చెవిరెడ్డి బెంగళూరులో ఇమ్మిగ్రేషన్ అధికారులు తన అధీనంలోనే ఉంచుకున్నారు. బుధవారం (జూన్ 18) ఉదయం నుంచి సాయంత్రం వరకూ చెవిరెడ్డిని విచారించి సిట్ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. అంతకు ముందు బెంగళూరులో చెవిరెడ్డి తనదైన వాదనా పటిమతో ఇమ్మిగ్రేషన్ అధికారులతో వాగ్వాదానికి దిగారని తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసులో తనపై ఎఫ్ఐఆర్ లేకుండానే ఎలా లుక్ ఔట్ నోటీసులు జారీ చేస్తారంటూ ఆయన ఇమ్మిగ్రేషన్ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం స్వయంగా న్యాయవాది అయిన చెవిరెడ్డి తన తరఫున తానే వాదించుకున్నారు. తన పై ఎఫ్ఐఆర్ లేకుండానే లుక్ ఔట్ నోటీసు ఎలా జారీ చేస్తారనీ, రిమాండ్ రిపోర్టులో తాను చెప్పని విషయాలను సిట్ నమోదు చేసిందంటూ ఆయన కోర్టు ముందు వాదించినట్లు తెలుస్తోంది. ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తాననీ, తనను అన్యాయంగా మద్యం కుంభకోణం కేసులో ఇరికిస్తున్నారంటూ ఆయన కోర్టులో పేర్కొన్నారు. అయితే సిట్ అధికారులు ఆయన దేశం విడిచి పరారయ్యేందుకు ప్రయత్నించారంటూ కోర్టుకు తెలపడంతో పాటు.. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి పాత్ర కీలకమనీ, రెండు నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకూ ఆయన మద్యం కుంభకోణం ముడుపులను ఎన్నికలలో వినియోగించారి కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలూ విన్న మీదట కోర్టు చెవిరెడ్డి భాస్కరరెడ్డికి జులై 1 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు చెవిరెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఇదే జైలులో ఇప్పటికే మద్యం కుంభకోణంలో అరెస్టైన నిందితులు రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
http://www.teluguone.com/news/content/vijatawada-acb-court-orders-chevireddy-remand-39-200264.html





