విద్యానిధి ప‌థ‌కానికి  జ‌గ‌న్  పేరా!

Publish Date:Jul 16, 2022

Advertisement

పేరు మార్చుకోవ‌డం ఈ రోజుల్లో చాలా స‌హ‌జంగా జ‌రిగిపోతోంది. పాత‌కాలం పేర్లు న‌చ్చ‌క  ఈ త‌రం యువ‌త వారి పేర్లు మార్చేసుకుంటున్నారు. స‌రే అది వారి వ్య‌క్తిగ‌తం. కానీ  రాష్ట్రంలో విద్యార్దుల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్న విదేశీ విద్యానిధి ప‌థ‌కానికి పేరు మార్చ‌డంలో ఆంధ్రా సిఎం జ‌గ‌న్  దుస్సా హ‌స‌మే చేశారనాలి.  ఈ ప‌థకం అంబేద్క‌ర్ పేరుతో పిల‌వ‌బ‌డుతోంది. కానీ  జ‌గ‌న్‌కి ఎందుకో న‌చ్చ‌లేదు.  రాష్ట్రం లో అన్ని ప‌థ‌కాల‌కు త‌న పేరు పెట్టేసుకున్న‌ట్టే ఈ  ప‌థ‌కానికి  త‌న పేరు పెట్టుకున్నారు.  ఇది  జ‌గ‌న్ అహంకార‌మేన‌ని తెలుగుదేశం జాతీయ అధ్య‌క్షులు చంద్ర‌బాబు మండిప‌డ్డారు.  ఆయ‌న  శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ, గ‌తంలో త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో  అంబేద్కర్  ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పిహెచ్ డి,  ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేం దుకు  రూ.15 లక్షల ఆర్థిక సాయం చేశామని తెలిపారు. 

ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం కింద బీసీ, మైనారిటీ విధ్యార్థు లకైతే  రూ.15 లక్షలు,  ఈబీసీ,  కాపు విద్యార్థుల‌కు  రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించామని గుర్తుచేశారు. ఐదేళ్ల తెలుగుదేశం హయాంలో మొత్తం 4528 మంది విద్యార్థులు విదేశీ విద్యకు రూ.377.7 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగిందన్నారు. 

మూడేళ్లపాటు ఈ పథకాలను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం  ఇప్పుడు  అంబేద్కర్ పేరును తొలగించి జగన్  తన పేరు చేర్చడం కోసం ఏకంగా అంబేద్కర్ వంటి ఒక మహాశయుని పేరును తొలగించడం ఆయ నను అవమానించడమే అని అన్నారు. ఇది  జగన్ అహంకారమే అంబేద్కర్‌ను దైవంగా భావించే వారంద రినీ కూడా అవమానించినట్టే అని తెలిపారు. విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే అంబేద్కర్ పేరు పెట్టా లని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

ఇదిలావుండ‌గా, అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి పథకానికి జగనన్న విదేశీ విద్య దీవెనగా పేరు మార్పుపై అమరావతి దళిత నేతల ఆగ్రహం వ్యక్తం  చేశారు. బీఅర్ అంబేద్కర్ పేరు తొలగించి తన పేరు  ఎలా పెట్టుకుంటారంటూ నిరసనకు దిగారు.  దళిత రైతులు, నేతలు తుళ్ళూరు  అంబేడ్కర్ విగ్రహానికి నివాళు లు అర్పించి  అక్కడే  బైఠాయించి నిరసన తెలియజేశారు. అంబేద్కర్ పేరు ఈ పథకానికి  కొనసాగిస్తూ మరో ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.