విడదల రజినీకి రమ్యమైన నామం.. సామాజిక మాధ్యమంలో ట్రోలింగ్
Publish Date:May 7, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ రమ్యమైన నామం.. పంగనామమంటూ అప్పుడే సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్‌కు తెర తీసి పారేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇంకా నెలరోజులు కూడా కాకుండానే ఈ విడదల రజినీ తన మార్క్ రాజకీయాన్ని కొత్త పుంతలు తొక్కిచేస్తోందంటూ సదరు నెటిజన్లు.. విస్తుపోతున్నారు. ఎంతైనా విడదల రజినీ ఫారన్ రిటర్న్ అని... అంతేకాదు గురువు గారికి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వగల ఘటనాఘటన సమర్థురాలంటూ ఆమె నియోజకవర్గంలో అప్పుడే ఓ టాక్ అయితే ఓ రేంజ్‌లో మోత మోగి పోతోంది. విడుదల రజినీ.. ఇటీవలే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సంతోష సమయంలో.. తన ఆనందాన్ని షేర్ చేసుకునేందుకు ఓ గ్రాండ్ పార్టీని ఆమె ఏర్పాటు చేశారట. ఆ పార్టీకి సెలెక్టడ్ వీఐపీ మహిళలను ఎంపిక చేసి.. మరీ ఆమె ఆహ్వానించారట. ఈ పార్టీకి ఫ్యాన్ పార్టీలోకి కీలక మహిళా నేతలు సైతం హాజరయ్యారట. అంత వరకు ఓకే. కానీ.. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ తాజా మంత్రిగారు ఇచ్చిన ఈ తాజా తాజా గ్రాండ్ పార్టీకి తన రాజకీయ గురువు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లరావు సతీమణి వెంకాయమ్మ కూడా హాజరయ్యారంటూ.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు గారి సతీమణి వెంకాయమ్మ ఏమిటి.. విడదల రజినీ పార్టీ ఇస్తే వెళ్లిపోవడమేమిటంటూ సదరు నియోజకవర్గ ప్రజలే కాదు.. తెలుగు ప్రజలు సైతం ముక్కున వేలేసుకుని.. మరీ ఈ విషయంపై ఆరా తీశారు. ఒకానొక దశలో టీడీపీలోని కీలక నేతలు సైతం ఈ మాజీ మంత్రి పుల్లారావును ఫోనులో తలంటినట్లు తెలిసిందే. దీంతో వారందరికి వివరణ ఇచ్చుకుని.. సర్ధి చేపుకునే సరికి తాజా మంత్రి గారి రాజకీయ గురువు పుల్లరావు గారి ప్రాణం.. హెడ్డ్‌లో నుంచి బొడ్డులోకి సర్రున జారిపోయిందట. ఇక ఇలా లాభం లేదనుకుని.. ఆయనే స్వయంగా రంగంలోకి దిగి.. ఓ ప్రెస్‌మీట్ పెట్టి.. రజినీ పార్టీకి తామెవ్వరం వెళ్లలేదంటూ క్లియర్ కట్‌గా వివరణ ఇచ్చుకున్నారు. ఓ వేళ.. మీరు ఇచ్చిన పార్టీకి తమ ఫ్యామిలీ వచ్చినట్లు.. అందుకు సంబంధించిన వీడియోలు కానీ.. ఫోటోలు కానీ విడుదల చేయాలంటూ విడదల రజినీకి మీడియా సాక్షిగా సవాల్ విసిరారు. అంతేకాదు.. మంత్రిగా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి.. అంతేకానీ సోషల్ మీడియాను నమ్ముకుని.. ఇలా చేయడం పద్దతి కాదంటూ.. తన మాజీ శిష్యురాలు కమ్ తన రాజకీయ ప్రధాన ప్రత్యర్థి కమ్ తాజా మంత్రి విడదల రజినీకి ఈ మాజీ గురువు గారు చాలా సంప్రదాయ బద్దంగా తలంటారు. 2014 ఎన్నికల వేళ.. టీడీపీ ప్రచారం కోసం పని చేసేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు యూఎస్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలి వచ్చారు. వారిలో రజినీ కూడా ఉన్నారు. అలా వచ్చిన ఆమె.. పార్టీ విజయం కోసం తన వంతు కృషి చేశారు. ఆ క్రమంలో చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ప్రత్తిపాటి పుల్లారావు.. ఈ విడదల రజినీని పార్టీ అధినేత చంద్రబాబుకు పరిచయం చేశారు. ఆ క్రమంలో విశాఖపట్నంలో జరిగిన టీడీపీ మహానాడు వేదికపై నుంచి ఈ రజినీకి మాట్లాడే అవకాశం కల్పించారు. ఆ తర్వాత అంటే 2019 ఎన్నికలకు ముందు .. తన రాజకీయ ప్రస్థానానికి ఓనమాలు నేర్పించిన ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట ఎమ్మెల్యే సీటు కోసం.. విడదల రజినీ తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో ఆమె సైకిల్ పార్టీకి బెల్ కొట్టి... జగన్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత ఆమె చిలకలూరిపేట ఎమ్మెల్యేగా.. తన రాజకీయ గురువు ప్రత్తిపాటి పుల్లారావుపై గెలుపొంది.. అసెంబ్లీలో అడుగు పెట్టి.. ఆ తర్వాత మంత్రి పదవిని అందుకున్నారు. దీంతో రజినీ.. తన రాజకీయ గురువు ప్రత్తిపాటి పుల్లారావుకే కాదు.. సదరు నియోజకవర్గ ప్యాన్ పార్టీ ఇన్‌చార్జ్ మర్రి రాజశేఖర్‌కు సైతం పంగనామం పెట్టిందనే టాక్ గతంలోనే చిలకలూరిపేట నియోజకవర్గంలో ఓ రేంజ్ లో హల్‌చల్ చేసింది... చేస్తోంది కూడా. ప్రతి ఏటా సోషల్ మీడియాలో తన ప్రచారం కోసం కోట్లాది రూపాయిలు నీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తూ.. తాజా మంత్రి విడదల రజినీ గారు తన ప్రచారాన్ని ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోందనే టాక్ అయితే అటు పోలిటికల్ సర్కిల్‌లో రంజు రంజుగా సాగుతోంది.
http://www.teluguone.com/news/content/vidadala-25-135553.html





