గెలుపు ముర్ముదే.. ఓడింది సిన్హా కాదు!

Publish Date:Jul 22, 2022

Advertisement

అనుకున్నదే జరిగింది. అందరూ ఊహించినట్లుగానే  రాష్ట్రపతి ఎనికల్లో, అధికార బీజేపీ/ ఎన్డీఎ అభ్యర్ధి ద్రౌపతి ముర్ము ఘన విజయం సాధించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీలో ముర్ముకు 6,76,803 ఓట్లు పోలయితే, ఆమె ప్రత్యర్ధి  ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు 3,80,177 ఓట్లు లభించాయి. మొత్తం పోలైన ఓట్లలో ముర్ము 64 శాతం ఓట్లు సాధించారు. యశ్వంత్ సిన్హాకే 36 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.

మరో మూడు రోజుల్లో, జులై 25న  ద్రౌపతి ముర్ము భారత  15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.  నిజమే రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్ధి విజయం సాధించడం విశేషమేమీ కాదు.  ఇంతవరకు ఒకే ఒక్క సందర్భంలో మినహా, మిగిలిన అన్ని సందర్భాలలో అధికార పార్టీ/ కూటమి అభ్యర్ధులే రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ  ఒక్క సందర్భం (1969) లో కూడా. అధికార కాంగ్రెస్ పార్టీలో చీలిక నేపధ్యంగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీనే, కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్ధి నీలం సంజీవ రెడ్డికి వ్యతిరేకంగా వీవీ గిరిని స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దించారు. ఆత్మ ప్రభోదం నినాదంతో  ఆమె వీవీ గిరిని గెలిపించారు. అదొక ప్రత్యేక పరిస్థతి. ప్రత్యేక సందర్భం. 

అయితే ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను ఎన్డీఎ అభ్యర్ధి ద్రౌపతి ముర్ము గెలుపు కోణం కాకుండా ప్రతిపక్ష పార్టీల ‘ఉమ్మడి’ అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఓటమి కోణం నుంచి చూడవలసి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి,రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ తొలి గంట కొట్టక ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి ఎన్నికపై దృష్టిని కేంద్రీకరించాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దేశ భవిష్యత్ రాజకీయలకు, రాష్ట్రపతి ఎన్నికలు,టర్నింగ్ పాయింట్ , మేలి మలుపు అవుతుందని, మోడీ, షా జోడీ దూకుడుకు రాష్ట్రపతి  ఎన్నికల ఫలితాలతో బ్రేక్ పడుతుందని ఆశించారు.  అన్ని పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్ధిని బరిలో దించితే, అధికార  ఎన్డీఎ కూటమికి గట్టి పోటీ ఇవ్వగలమని, తద్వారా, 2024 సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి పోరాటాన్నిముందుకు తీసుకు పోగలమనే ఆలోచన వెంబడి అడుగులు వేశారు.

అందు కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ డైరెక్షన్ లో శరద్ పవార్ మొదలు కేసీఆర్ వరకు  ప్రతిపక్ష పార్టీల పెద్దలంతా, పేరంటాలు చేశారు. పావులు కదిపారు. చర్చలు జరిపారు. అయితే, ఉమ్మడి అభ్యర్ధి  ఎంపిక దగ్గరే  తడబడి తప్పటడుగులు వేశారు అనుకోండి అది వేరే విషయం. చివరకు  ఏమి జరిగింది అనేది ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తోంది. యశ్వంత్ సిన్హాను బరిలో దించారు. అయిన ఫస్ట్ సీన్ లోనే సినిమా అర్థమై పోయింది.  ప్రతిపక్షాల ఐక్యత ఎండమావని మరో మారు తెలిపోయింది. ప్రతిపక్షాల పక్కా ఓట్లనుకున్న ఓట్లలో పది శాతం కంటే ఎక్కువ ఓట్లే అధికార కూటమి అభ్యర్ధికి పోలయ్యాయి.మొతం మీద ఓ 17 మంది ఎంపీలు ఓ వంద మందికి పైగా ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు చెబుతున్నారు. ముర్ముకు బహిరంగంగా మద్దతు ప్రకటించిన జేఎంఎం, వైసీపీ, శివసేన ఇతర ఎన్డీయేతర పార్టీల ఓట్లు వీటికి అదనం.  

సో.. ముర్ము గెలుపు యశ్వంత్ ఓటమి కాదు, ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి పరాజయం. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి ఎన్నికలు  దేశ రాజకీయాలలో టర్నింగ్ పాయింట్ అవుతాయని పెట్టుకున్న ఆశలు నెరవేర లేదు, సరికదా ఓటి కుండ బొక్కలు బయట పడ్డాయి. అంతే కాదు ముర్ము తిరుగులేని విజయంతో కంగుతిన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఇక ముందు ముందు ప్రతిపక్ష పార్టీల ఐక్యత ఇంకెన్ని వంపులు, వంకర్లు పోతుందో చూడవలసిందేనని పరిశీలకులు అంటున్నారు. మరో వంక, వచ్చే రెండేళ్ల వ్యవధిలో జరిగే గుజరాత్‌, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో,  అదే విధంగా 2024 ఎన్నికల పైనా గిరిజన రాష్ట్రపతి ప్రభావం తప్పక ఉంటుందని అంటున్నారు.

అలాగే రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశాలను కొట్టి వేయలేమని  అంటున్నారు.  అందుకే రాజకీయ విశ్లేషకులు  రాష్టపతి ఎన్నికల్లో ముర్ము గెలుపు, బీజేపీ దీర్ఘకాల వ్యూహంలో మరో గెలుపు, మరో మలుపు అంటున్నారు. బీజేపీకి బ్రాహ్మణ, బనియా పార్టీ అనే ముద్ర ఉన్నా, ఉత్తారాది పార్టీ అనే ముద్ర ఉన్నా, ఇంకా  చాలా చాలా గీతలు, గళ్ళు ఉన్న బీజేపీ,  ఒక్కొక గీతను  దాటుకుంటూ వస్తోంది. చివరకు ముస్లిం ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం  చేస్తోంది. అన్ని వర్గాలను కలుపుకు పోతోందని పరిశీలకులు అంటున్నారు.

 ప్రస్తుత పార్లమెంట్ లో ఎస్సీ,ఎస్టీ  ఎంపీలు 131 ఉంటే అందులో బీజేపీ ఎంపీలు  77 మంది ఉన్నారు. ఇంకో ఆసక్తికర విషయం ఏమంటే, 2014లో కంటే 2019 బీజేపీకి 21 ఎంపీ సీట్లు ఎక్కువచ్చాయి ( 282 నుంచి 303) ..ఈ  21 మంది  ఎంపీలలో 10 మంది  ఎస్సీ, ఎస్టీ ఎంపీలున్నారు. ఇప్పడు ముర్ము ఎన్నిక తర్వాత ఎస్సీ, ఎస్టీలలో బీజేపీ ఇంకా విస్తరించే అవకాశం ఉంటుందని, ఆ  ప్రభావం భవిష్యత్ రాజకీయాలపై ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి ఎన్నికల వ్యూహం బెడిసి కొట్టిందని,  భవిష్యత్;లోనూ ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా బీజేపీని  ఎదుర్కోవడం అయ్యే పని కాదని అంటున్నారు.

By
en-us Political News

  
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.