వెంకయ్యకే మళ్ళీ.. నాగపూర్ ఆదేశం ?

Publish Date:Jul 13, 2022

Advertisement

రాష్ట్రపతి ఎన్నికల సందడి చివరాఖరు దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో అంటే జులై 18 పోలింగ్ జరుగుతుంది. 21 న కౌంటింగ్, 25 న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం. ఇక  అక్కడితో నెల రోజులకు పైగా రాష్ట్రపతి  ఎన్నికల  చుట్టూ సాగుతున్న రాజకీయ సందడి సర్డుమణుగుతుంది. అయితే ఆ వెంటనే, నిజానికి ఇంకా ముందుగానే, ఉప రాష్ట్రపతి ఎన్నిక  ప్రక్రియ మొదలవుతుంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పదవీకాలం 2022, ఆగస్టు 10 వతేదీతో ముగుస్తోంది. ఈ నేపధ్యంలో నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక  ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే విడుదల చేసిన న్నికల షెడ్యూలు ప్రకారం, జూలై 5 న నోటిఫికేషన్ విడుదలైంది. అదే రోజున మొదలైన నామినేషన్ల గడువు, జూలై 19 తో ముస్తుంది.

అవసరమైతే ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.  అయితే, ఇంత వరకు అధికార, విపక్ష పార్టీలు/ కూటములు అభ్యర్ధుల ఎంపికపై, అంతగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. నిజానికి, రాష్ట్ర పతి ఎన్నికలలో విపక్షాలకు, అంతా కలిసి, పోటీ చేస్తే గెలిచే అవకాశం, ఆశ ఓ చిగురంత అయినా వుంది. కానీ, ఉపరాష్ట్ర పతి ఎన్నికలలో చిగురంత కాదు, కనీసం చీమ తలంత చిరు అవకాశం, చిన్ని ఆశకు కూడా అవకాశం కనిపించడం లేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో పాటుగా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభ్యులకు కూడా,ఓటు హక్కు ఉంటుంది. కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికలో, ఎమ్మెల్యేలకు ఓటుహక్కు ఉండదు, కేవలం, లోక్ సభ, రాజ్యసభ ఎంపీలకు మాత్రమే ఓటు హాక్కు ఉంటుంది. 

పార్లమెంట్ ఉభయ సభల్లో  బీజేపీ/ ఎన్డీఎ కూటమికి సంపూర్ణ ఆధిక్యత వుంది. పార్లమెంటు ఉభయ సభల ప్రస్తుత బలం 780 కాగా.. మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసేందుకు  390 మంది ఎంపీల మద్దతు అవసరం అవుతుంది. అయితే, ఒక్క బీజేపీకే పార్లమెంట్ ఉభయ సభల్లో కలిపి 394 మంది ఏంపీలున్నారు. ఎన్డీఎ బలం 390(ఎల్ఎస్) ప్లస్ 144 (ఆర్ ఎస్) మొత్తం 534 వరకు  వుంది. ఎన్డీఎకి మద్దతు ఇస్తున్న వైసీపే, (22)  శివసేన చీలిక వర్గం (14) బీజేడీ ఇతర పార్టీల సఖ్యాబలన్ని కలుపుకుంటే మొత్తం 780 ఎంపీలలో ఎన్డీఎ అభ్యర్ధికి ఇంచుమించుగా 600 మంది మద్దతు లభించే అవకాశం వుంది.

అంతే కాకుండా రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎదురైనా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రతిపక్షాలు ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్ధిని నిలిపే విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి ఎంపిక బాధ్యతను, రాజ్య సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గేకి అప్పగించింది.  అంతే కాకుండా బలబాలతో సంబంధం లేకుండా, లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ను బరిలో దించే అవకాశం ఉందని అంటున్నారు. అదలా ఉంటే బీజేపీ/ ఎన్డీఎ అభ్యర్ధి విషయంలో ప్రస్తుతాని సస్పెన్స్ కొనసాగుతోంది.  అయితే మొదటి నుంచి కూడా  మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

అందుకే  ఆయన్ని రాజ్య సభకు తిరిగి నామినేట్ చేయలేదని ప్రచారం జరిగింది. కాగా, ఆయన రాజ్యసభ పదవీ  కాలం జులై  10 తేదీతో ముగిసింది. అందుకు ఒక రోజు ముందే ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, తాజగా, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడినే మరో మారు కొనసాగించాలని, పార్టీ  హై కమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రానున్న రెండేళ్లలో , బీజేపీ కోర్ ఐడియాలజీకి సంబందించిన కీలక బిల్లులు వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో, ఇలాంటి సమయంలో వెంకయ్య నాయుడు రాజ్యసభ చైర్మన్ గా ఉండడం అవసరమని, హై కమాండ్ అలోచిస్తునట్లు తెలుస్తోంది.

అయితే వెంకయ్య నాయుడు నో’ అనే పక్షంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసైతో, కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహ్మద్ ఖాన్ తో పాటుగా కేంద్ర మాజీ మంత్రులు సురేశ్‌ ప్రభు, ఎస్‌ఎస్‌ ఆహ్లూవాలియా, కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్‌ పురీ, గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ తదితరులు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే, విశ్వసనీయ సమాచారం మేరకు వెంకయ్య నాయుడిని ఒప్పించే ప్రయత్నం గట్టిగా సాగుతోందని తెలుస్తోంది. కాగా, ఒకటి రెండు రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై అభ్యర్థిని నిర్ణయించనున్నట్లు సమాచారం. బోర్డులో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్‌ సంతోష్‌ సభ్యులుగా ఉన్నారు.

By
en-us Political News

  
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
బిజెపి ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.