మోడీ షా జోడీ మ్యాజిక్ బాక్స్‌లో..ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరో?

Publish Date:Jul 23, 2025

Advertisement

 

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు (జూలై 21),నాటకీయ పరిణామాల నడుమ తమ పదవికి  రాజీనామా చేశారు. ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోదించారు. జగదీప్ ధన్‌ఖడ్’ ఎందుకు రాజీనామా చేశారు? ఏమిటి, అనే చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతోంది. 

ధన్‌ఖడ్ ఎందుకు రాజీనామా చేసినా, అందుకు కారాణాలు ఏవైనా, భారత ఉపరాష్ట్రపతి సీటు ఖాళీ అయింది. ఎన్నిక అనివార్యమైంది. మరోవంక భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. భారత ఎన్నికల సంఘం ఇప్పటికే 2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల సన్నాహాలను ప్రారంభించిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ సన్నాహాక చర్యలు పూర్తయ్యాక, ఎన్నికల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. 

అదలా ఉంటే, చక చకా పరిణామాలు నేపధ్యంగా, అనూహ్యంగా తరుముకొస్తున్న  ఉపరాష్టపతి ఎన్నిక పట్ల, సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. నిజానకి అభ్యర్ధుల ఎంపిక మొదలు గెలుపు ఓటముల లెక్కల వరకు. ‘ఉప’ ఎన్నిక పట్ల రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ అప్పుడే మొదలైంది. అధికార ఎన్డీఎ, విపక్ష ఇండియా కూటమి తరపున బరిలో దిగే అభ్యర్ధులు ఎవరన్న విషయంలో,ముఖ్యంగా అధికార కూటమి అభ్యర్ధి ఎవరన్న విషయంగా అనేక వ్యూహగానాలు వినిపిస్తునాయి.

అనేక పేర్లు వినిపిస్తున్నాయి. రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ చైర్మన్,హరివంశ నారాయణ సింగ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్,,కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మొదలు కేంద్ర మాజే మంత్రి రవిశంకర్ ప్రసాద్ వరకు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్’ మొదలు మెగా స్టార్’చిరంజీవి, బీజేపే రాజ్యసభ సభ్యడు కే. లక్ష్మణ్’ వరకు అనేక తెలుగు పేర్లు సహా చాలా పేర్లు వినిపిస్తునాయి. 

అయితే,అంతిమంగా మోదీ షా జోడీ’ మ్యాజిక్ బాక్స్ నుంచి ఎవరి పేరు పై కొస్తుందో చెప్పలేము. అలాగే ఇండియా కూటమి నుంచి ఎవరు బరిలో దిగినా పోటీ నామమాత్రంగానే ఉంటుందని,అంటున్నారు. చివరకు,ఏ కూటమిలో లేని, వైసీపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేడీ, బీఎస్పీ వంటి తటస్థ పార్టీలు ఇండియా కూటమికి వైపు మొగ్గు చూపినా ఎన్డీఎ అభ్యర్ధి విజయం తధ్యమని అంటున్నారు. అయితే, బీజేపీ..ఒంటరిగా గెలిచే అవకాశం మాత్రం ఏ కొంచెం కూడా లేదు. 

తెలుగుదేశం, జేడీయు సహా ఇతర ఎన్డీఎ పార్టీల మద్దతుతో మాత్రమే అధికార కూటమి అభ్యర్ధి విజయం  సాధ్యంవుతుందని ఓట్ల గణాంకాలు చెపుతున్నాయి ప్రస్తుత లెక్కల ప్రకారం,ఉపరాష్ట్రపతి ఎలెక్టోరల్ కాలేజీలో (నామినేటెడ్ సహా పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు) మొత్తం 788 ఓట్లున్నాయి. అందులో అందులో 5 రాజ్యసభ, ఒక లోక్ సభ, సిటు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 782 ఓట్లలో ఎన్డీఎకి 427 ఓట్లు,(293 లోక్ సభ. 134 రాజ్యసభ) ఓట్లున్నాయి. ఇండియా కూటమికి లోక్ సభలో 236, రాజ్యసభలో 87, మొత్తం కలిపి 323 ఓట్లున్నాయి. 

అలాగే, ఉభయ సభల్లో కలిపి ఏ కూటమిలోనూ లేని తటస్థ సభ్యుల సఖ్య  సుమారు 30 వరకు ఉంటుంది. సో.. ఈ లెక్క తప్పకుండా ఎవరి ఓట్లు వారికి పోలైతే, ఎన్డీఎ కూటమి గెలుపు నల్లేరుపై బండి అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.  ఉపరాష్ట్రపతి ఎన్నిక రహస్య బ్యాలెట్ పద్దతిలో జరుగుతుంది.విప్ వర్తించదు. కాబట్టి,ఎంపీలు, ఆత్మ సాక్షిగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చును.అలాగే, పార్టీలకు  కూటమి కట్టుబాట్లు వర్తించవు.గత 2022 ఎన్నికల్లో, ఎన్డీఎ అభ్యర్ధి జగదీప్ ధన్‌ఖడ్’కు పోటీగా   ప్రతిపక్ష పార్టీలు తమ ఉమ్మడి అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మార్గరెట్ అల్వాను బరిలో దించాయి.

అయితే,ఆమె అభ్యర్ధిత్వంపై అభ్యంతరం చెప్పిన తృణమూల్  కాంగ్రెస్’ ఓటింగులో పాల్గొన లేదు. ఫలితంగా ధన్‌ఖడ్’ మొత్తం పోలైన 725 ఓట్లలో 528 ఓట్ల భారీమెజారిటీతో గెలిచారు. మార్గరెట్ ఆల్వా కేవలం 182 ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాగే ఈసారి కూడా, అభ్యర్ధి ఎంపిక తర్వాత లెక్కలు మారినా మారవచ్చును. అయితే, ఎన్డీఎలో కంటే ఇండియా కూటమిలోనే, కోతలకు ఎక్కువ అవకాశం ఉంది, కాబట్టి, ఎన్డీఎ గెలుపు నల్లేరుపై నడక అంటున్నారు.

By
en-us Political News

  
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.