ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా వీఈఆర్ అభివృద్ధి : సీఎం చంద్రబాబు

Publish Date:Aug 5, 2026

Advertisement

 

 విశాఖ ఎకనమిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని సీఎం చంద్రబాబు  ఆదేశించారు. ఈ రీజియన్ పరిధిలోని అన్ని ప్రాంతాలను, అన్ని రంగాలను పరిగణనలోకి తీసుకుంటూ పూర్తి స్థాయి  అభివృద్ధి ప్రణాళిక చేయాలని సూచించారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో విశాఖ ఎకనమిక్ రీజియన్-వీఈఆర్ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత సమీక్షించారు. విశాఖ రీజియన్ పరిధిలో కొత్త ప్రాజెక్టులు..CRZ రీ-క్లాసిఫికేషన్, వైజాగ్ బే సిటీ, బే-సిటీ అథారిటీ ఏర్పాటు వంటి అంశాలపై సీఎం సమీక్షించారు. వీఈఆర్ పరిధిలో మొత్తంగా రూ. 9.50 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందని అధికారులు వివరించారు.

 ప్రైవేట్ రంగం నుంచి రూ. 5.30 లక్షల కోట్ల పెట్టుబడులు, అలాగే రూ. 3.50-4 లక్షల కోట్ల మేర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయాల్సి వస్తుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే గూగుల్ ఏఐ డేటా సెంటర్, ఆర్సెల్లార్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ వంటివి విశాఖ, ఉత్తరాంధ్ర కేంద్రంగా వచ్చిన అంశాన్ని అధికారులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పటికే విశాఖలో ఐటీ, డేటా సెంటర్ల సహా వివిధ రంగాలకు చెందిన ఎకో సిస్టం ఏర్పాటైందని..దీనికి అనుగుణంగా వీఈఆర్ డెవలప్మెంట్ ప్లాన్ సిద్దం చేస్తున్నామని...బేసిటీ ప్రాజెక్టును యాంకర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేపట్టేలా ప్రణాళికలను సిద్దం చేసినట్టు అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు.

సీఆర్ జెడ్ నిబంధనలకు అనుగుణంగా వీఈఆర్ ప్రాజెక్ట్..

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..”వీఈఆర్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలను రూపొందించాలి. శ్రీకాకుళం జిల్లాలోని మూల పేట పోర్టు మొదలుకుని... రాజమహేంద్రవరంలోని అఖండ గోదావరి ప్రాజెక్ట్ వరకూ ప్రతి ప్రాంతం.. ప్రతి టూరిజం స్పాట్, ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసేలా... పెట్టుబడులు వచ్చేలా చేయడంతోపాటు... అవసరమైన మేరకు ఎక్స్ పీరియన్స్ జోన్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. వివిధ ప్రాజెక్టులను అనుసంధానిస్తూ వీఈఆర్ ప్రగతి సాగేలా చూడాలి. వీఈఆర్ ప్రాజెక్టులో వైజాగ్ బే సిటీది కీలకపాత్ర. ఈ ప్రాజెక్ట్ ద్వారా రీజియన్ పరిధిలో పెద్ద ఎత్తున పట్టణాభివృద్ధి పనులు జరగాలి. 

ఇందుకు వివిధ పధకాల నిధులను కన్వెర్జెన్స్ చేసి ఈ ప్రాజెక్టు కోసం వినియోగించాలి. అలాగే కేంద్ర నిధులను మరింతగా రాబట్టే అంశంపై దృష్టి సారించాలి. వీఈఆర్ పరిధిలో ఉన్న 6 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో అద్భుతమైన అభివృద్ధి జరగాలి. ఈ ప్రాజెక్టును వినియోగించుకుని ప్రతి ప్రాంతంలోనూ మౌలిక సదుపాయాల కల్పన పూర్తి స్థాయిలో జరగాలి. స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు చేపట్టాలి.. ప్రాజెక్టులను రాబట్టాలి. పెట్టుబడుల సాధన ద్వారా వివిధ రంగాల్లో ఉద్యోగాలను కల్పించే దిశగా చర్యలు చేపట్టాలి. ఈ మేరకు స్థానికంగా ఉండే యువతకు స్కిల్స్ అప్ గ్రేడ్ చేయాలి. కోస్టల్ మేనేజ్మెంట్ ప్రణాళికలకు అనుగుణంగా ప్రాజెక్టులు చేపట్టాలి. పరిశ్రమలు, టౌన్ షిప్ ఎకో సిస్టమ్, టూరిజం ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురావాలి. 

దీంట్లో భాగంగా పీపీపీ ప్రాజెక్టులను అమల్లోకి తీసుకురావడంతోపాటు.. వాటికి వీజీఎప్ స్కీం అమలు చేసే అంశాలను పరిశీలించండి. CRZ నిబంధనలకు అనుగుణంగా వీఈఆర్ ప్రాజెక్టును పూర్తి చేద్దాం. జరుగుతున్న అభివృద్ధి.. చేపడుతున్న ప్రాజెక్టులు.. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు.. ఉద్యోగ-ఉపాధి అవకాశాలు వంటి అంశాలను ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాలి. వీఈఎర్ అభివృద్ధి ప్రణాళికల్లో విద్యా సంస్థలను... యూనివర్శిటీలను కలుపుకుని వెళ్లాలి. ముఖ్యంగా ఆంధ్రా యూనివర్శిటీ సేవలను వినియోగించుకోవాలి.”అని ముఖ్యమంత్రి అన్నారు.

బే సిటీ కోసం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ కమిటీ..

“బేసిటీ ప్రాజెక్ట్ అమలు కోసం ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాజెక్టులను అనుసంధానం చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. జీసీసీ, ఫిన్ టెక్, లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్ రంగాలపై దృష్టి సారించాలి. ఈస్ట్ టూ వెస్ట్ కనెక్టివిటీపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుల రూపకల్పన.. పెట్టుబడుల సాధన జరిగేలా ప్రణాళికలను సిద్దం చేయండి. రోడ్-రైల్ ఇంటిగ్రేషన్ జరగాలి. 

కాకినాడ, విశాఖలతో పశ్చిమ భారత్ లోని వివిధ ప్రాంతాలు అనుసంధానం కావాలి. ముఖ్యంగా 4 ఎయిర్ పోర్టులు, 3 పోర్టులు లింక్ చేస్తే అభివృద్ధి వేగంగా జరగడంతోపాటు... పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. విశాఖలో జంతు ప్రదర్శన శాలను మరింత అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలి. అంతర్జాతీయ నగరంగా విశాఖ ఎదుగుతోంది. ఇలాంటి ప్రాంతంలో ఉన్న జంతు ప్రదర్శన శాల మంచి పర్యాటక ప్రాజెక్టు అవుతుంది." అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షకు సీఎస్ సాయి ప్రసాద్, ఆర్ధిక, పరిశ్రమలు, పురపాలక, అటవీ, ఇంధన, పర్యాటక, విద్య, వైద్య శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

VER Project, CM Chandrababu, Naralokesh,Visakhapatnam Region, PPP project, Srikakulam District

By
en-us Political News

  
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ తీవ్ర జాప్యం కావడంపై పార్లమెంట్ వేదికగా తెలుగుదేశం పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ తో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ వార్తల్లో నిలిచారు. స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబా సిడర్‌గా మెగాస్టార్ చిరంజీవిని నియమించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
భారత విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక మార్పుకు బీజం పడింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధింపులకు గురిచేసిన కేసులో నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని అత్తాపూర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు రిపబ్లికన్ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ తన భార్యతో కలిసి చేపట్టిన నిరసన
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారి ఉక్కుపాదం మోపుతున్నారు
మహిళలకు బంగారం.. పుట్టిన బిడ్డలకు బంగారు ఉంగరం..!
ప్రాణ‌హిత న‌దిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపున‌కు మ‌హారాష్ట్ర నుంచి అనుమ‌తులు ఇప్పించాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిరోజూ అత్యంత బిజీ షెడ్యూల్‌తో గడుపుతుంటారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఆగస్టు 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు, మొత్తం 3 రోజుల పాటు పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.