Publish Date:Dec 19, 2024
ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నుంచీ బలపడేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పార్టీ ఇప్పటికే అన్ని వర్గాల మద్దతూ సాధించింది. ఆ సంగతి ఇటీవల టీడీపీ తన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నిర్ద్వంద్వంగా రుజువైంది.
తెలుగుదేశం సభ్యత్వ నమోదు డ్రైవ్ ద్వారా దాదాపు 73 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వీరిలో 54శాతం మంది కొత్త వారే. ఒక రాజకీయ పార్టీ సభ్యత్వ నమోదు లో ఇంత పెద్ద సంఖ్యలో కొత్త వారు సభ్యత్వం తీసుకోవడం ఒక రికార్డు అనుకుంటే..దానిని తలదన్నే రీతిలో ఒక గ్రామంలో మొత్తం జనాభా అంతా తెలుగుదేశం సభ్యులుగా నమోదు చేసుకోవడం ద్వారా నభూతో.. నభవిష్యతి అన్న రికార్డు కూడా తెలుగుదేశం వశమైంది.
ఇంతకీ ఆ గ్రామం ఏదో తెలుసా.. దివంగత పరిటాల రవి స్వగ్రామం వెంకటాపురం. ఆ గ్రామంలోని ఓటర్లందరూ తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నారు. ఇలా ఒక గ్రామంలో నమోదైన ఓటర్లందరూ పార్టీ సభ్యత్వం తీసుకుని అనితర తెలుగుదేశం పార్టీకి అనితర సాధ్యమనదగ్గ రికార్డును అందించారు. వెంకటాపురంలో మొత్తం 581 మంది ఓటర్లు ఉండగా, వారిలో 11 మంది మరణించారు. మిగిలిన 570 మంది ఓటర్లు అందరూ తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నారు. తద్వారా తెలుగుదేశం పార్టీ, పరిటాల కుటుంబం పట్ల తమకున్న అభిమానాన్ని చాటారు. ఈ విషయంపై రాప్తాడు ఎమ్మెల్యే, పరిటాల రవి భార్య పరిటాల సునీత మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఈ ఘనత సాధించిన మొదటి గ్రామం వెంకటాపురం అని చెప్పారు. పార్టీ పట్ల, తమ కుటుంబం పట్ల ప్రజలు చూపుతున్న అభిమానానికి కృతజ్ణతలు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/venkatapuram-voters-tdp-members-25-190077.html
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.