ఒక కొత్త ప్రవాహం ఈ "వెళ్లిపోవాలి"!

Publish Date:May 11, 2022

Advertisement

ఇతర భాషల్లో, దేశాల్లో సినిమాకు నిర్వచనం మార్చి, పూర్వం ఊహించి ఎరగని విధానాలలో కథలను తెర మీదికి తీసుకొస్తున్నారనీ, మనవాళ్ళు ఇంకా మూసపద్ధతులనుంచి బయటపడటం లేదనీ విచారపడే,  ప్రత్యేక తెగ తెలుగు ప్రేక్షకుల కోసం ఒక కొత్తగాలి వీచినట్లు వచ్చింది " Camera Stylo" banner నుంచి "వెళ్ళిపోవాలి" సినిమా అనవచ్చు. సినిమా తీయడంలో, రిలీజ్ చేయడం లో కూడా మామూలు పద్ధతులకు పూర్తి భిన్నంగా ప్రయత్నించి, సఫలీకృతం గా బయటికి తీసుకొచ్చిన మొదటి సినిమా బహుశా తెలుగులో ‘‘వెళ్ళిపోవాలి‘‘ మాత్రమే నేమో. 

ఏవిధంగా చూచినా ఇదొక విప్లవం లాంటిది సినీ చరిత్రలో. ఒక చెప్పుకోదగ్గ కథా, ఒక ప్రధానపాత్ర, పెద్ద సంఘర్షణ , ఒక క్లైమాక్స్ , ఇవేవీ లేని పూర్తి నిడివి సినిమా ఇది. చాలా మామూలు డిజిటల్ కెమెరాతో, అత్యంత చిన్న పెట్టుబడితో అన్నీ తామే అయి ఒక ముగ్గరు మిత్రులు చెప్పిన తమ కథ ఈ సినిమా విషయం. అలా అని ఇది ఏ డాక్యుమెంటరీ సినిమానో కాదు. ఇలా ప్రయోగాత్మకంగా docufilms genre లో సినిమాలు తీసిన వాళ్ళు వేరే ప్రపంచం సినిమా డైరెక్టర్ లు అబ్బాస్ కియొరస్తమీ, నూరి బెల్గ్ చెయ్లన్ లాంటి కొందరు ఉన్నా, వాళ్ళ అనుభవాలే సినిమాగా తీసినా వాళ్ళు వాళ్ళ పాత్రలను వేరే నటులతో నటింపచేశారు. ఒక్క ఈ ‘‘వెళ్ళిపోవాలి‘‘ సినిమా తీసిన ముగ్గురు, మెహెర్, రాజిరెడ్డి, అజయ్  వాళ్ళ సంగతులనే కథ చేసి, వారి వారి పాత్రలు వాళ్ళే నటించడం బహుశా మొత్తం ప్రపంచ సినీ చరిత్రలో నే తొలిసారి జరిగింది. 

రచనలు చేయటం అనే ఒక కామన్ అభిరుచి,  వయసు నలభైలలో ఉన్న, పరిచయస్తులకు ఎక్కువ, మరీ బాల్య ప్రాణస్నేహితులకు తక్కువ అయిన ముగ్గురు మిత్రులు ప్రస్తుతజీవితంలో ఎదుర్కుంటున్న సమస్య, ‘‘స్వంత ఇల్లు ఎక్కడ ఏర్పరుచుకోవాలి?‘‘ పుట్టిపెరిగిన వేరు వేరు ఊర్ల  నుంచి ఉద్యోగాల కోసం హైదరాబాద్ కు వచ్చిన వాళ్ళకు ఇది అంతుచిక్కని ప్రశ్న. జీతం దొరికే ఏదో ఒక పని దొరికిందని తప్ప ఇంకేవిధంగానూ తమకు స్వంతం అనిపించని ఈ నగరం లో ఇల్లు ఏర్పరుచుకోవటం ఆర్థికంగా అసంభవం. ఇక్కడ ఆత్మీయతా దుర్లభమే. అటు ఉండొచ్చిన ఊరూ ఇన్నేళ్ల వలస తరువాత పరాయిగా కనిపిస్తుంది. ఊరితో, అక్కడ మనుషులతో వీరి అనుబంధం కీలుబందు వదులైన కుర్చీకాలులా ఊగుతుంటుంది, ఆసరా నిమ్మళంగా ఇవ్వలేదు అది. ఆ juncture లో మనిషికి ఇల్లు కట్టుకోవడమనే సమస్య రూపాంతరం చెంది అసలు అది తన అస్తిత్వ సమస్యగా ఎలా మారి కలవరపెడుతుందో అనేదే ఈ సినిమా కథ. 

జీతానికి, జీవితానికీ, మూలాలకీ, ఉండవలసొచ్చిన నగరాలకు ఒక అర్థం వెతకడం మొదలు పెడుతుంది మనసు. ఒక క్షణం బలంగా మనదంటూ ఒక కుటుంబం, ఊరూ, జీవితం కావాలని, మరుక్షణం వీటివేటికీ అంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరమా ఎలాగూ ‘‘సగాన పడ్డాం జీవితంలో, ఇంకా ఎందుకు ఒక ఇల్లు ఏర్పరుచుకోవడం కోసం తక్కిన సగం జీవితం తాకట్టు పెట్టుకోవడం ‘‘ అని ఒక వైరాగ్యమూ ఆవహిస్తుంది. 

అదొక విషాదమైన సందిగ్ధం. కానీ ఆ సందిగ్ధాన్ని ఎవరికి తోచిన రీతిలో, ఎవరికి చేతనైన మార్గంలో వారి వారి జవాబు వెతుక్కోవడంలో తప్పనిసరి సౌందర్యం ఆవిష్కృతమైంది ఈ ముగ్గురి కథలలో. సినిమా చివర్లో వచ్చిన  "మనం సగం సన్యాసులం, సగం సంసారులం" అనే మాట ఈ సినిమాలో కనిపించే ముగ్గురికీ ఉన్న మూలసూత్రం.

కానీ ఆ మూడు ముఖ్యమైన పాత్రల్లో, ఆ నిష్పత్తుల లో తేడాలు, ఆ రెండిటినీ ఎంతలో ఎక్కడ నిలబెట్టాలో తెలుసుకోవడంలో తేడాలు ఉన్నాయి.

అసలు ఈ "clinging to one's roots, past, desire for belongingness" మనిషి ప్రాథమిక సమస్యా? మౌలిక సమస్యా?

మెటఫర్లు, లేటెంట్ అర్థాలు , దృశ్యాల framing లకు significances, అన్ని నెట్టిపారేసి అతి మామూలు ముచ్చట్లోతోనే ప్రస్తుతపు ప్రతిమనిషి అస్తిత్వ వేదనను నింపాదిగా కథలా వ్రాసుకొచ్చింది  ఈ  కెమెరా stylo. 

ఆ నెమ్మది కథనంలోనే బోలెడంత agitation feel చేయించింది. 

"వెళ్ళిపోవాలి"  చీకట్లనూ వెలుతుర్ల నూ, ఇరుకిరుకు జేగురు గదులనూ,  పచ్చటి వైశాల్యాలను కథకు అవసరమైనప్పుడు అవసరమైనట్లు చూసింది. 

అందులో జీవితం మీద కావలసినంత ప్రేమ కనిపించింది, బ్రతుకంటే విరక్తీ కనిపించింది.


ఈ సినిమా లెన్స్ లైట్ ను, దాని అన్ని hues తో beautiful గా పట్టుకుంది. Hues, that are beyond just physical also... నగరంలో వానకు తడిసిన నారింజ రంగు రోడ్లు అవి దాటుతున్న అజయ్ మనఃస్థితిని, సగం ఖాళీగా ఉన్న పచ్చటిపొలాలు, పడిపోతున్న జేగురు రంగు ఇల్లు రాజిరెడ్డి ఆలోచనలనూ, చీకటి మేడ, ఎండిన సిమెంట్ రోడ్లు మెహెర్ apparent out look నూ పట్టిచ్చిన్నట్టు ఉంటుంది. ముగ్గురు

ఆడవాళ్ల ఉనికి ప్రాణం ఈ మగవాళ్ళ కథలకూ, తెరకూ కూడా.

"కత్తిని బేరం చేసేప్పుడు దాని వాదరకు విలువ కట్టాలి, పిడికి కాదు", సినిమా అయినా అంతే. అది ఎంత పదునుగా తను చెప్పదలుచుకున్నది చెపుతున్నదో చూడాలి కానీ కెమెరా సైజూ, బడ్జెట్ బరువూ కాదు లెక్కించాల్సింది.

మనిషి ఎప్పుడూ  ఇంకా ఎక్కడికో వెళ్ళేందుకు చూస్తుంటాడు వాకిలికి ఒక కాలు లోపలికి, ఒక కాలు వెలుపలికి వేసి.

Congrats to the whole team.

(విశ్లేషణాత్మక సమీక్ష అందించిన పద్మజ సూరపురాజు గారికి ధన్యవాదములు.)  

◆వెంకటేష్ పువ్వాడ.

By
en-us Political News

  
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.