Publish Date:Sep 29, 2025
టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపుల్-టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ వరకు 113 I/M రూట్ బస్సులో ప్రయాణించారు. యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో ముచ్చటించారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున సజ్జనర్ ప్రజా రవాణాపై అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. వీసీ సజ్జనార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బదిలీపై వెళుతున్న సంగతి తెలిసిందే.
ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థలో ఒక కొత్త మార్పు శకం ప్రారంభమైంది. ఆర్టీసీ బ్రాండ్‌ను మళ్లీ ప్రజల్లో స్థాపించేందుకు, ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆయన అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా ‘మన ఆర్టీసీ’ అనే నినాదం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందించడంతో పాటు, సంస్థను లాభాల దిశగా నడిపే ప్రయత్నం చేశారు.
ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేసి, ఆన్‌లైన్ సేవలను మరింత మెరుగుపరిచారు. ఆదాయ వనరులను పెంచే దిశగా సరుకు రవాణా సేవలను విస్తరించి, ప్రత్యేకంగా కార్గో సేవలను ప్రారంభించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, దాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో సజ్జనార్ కీలక పాత్ర పోషించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vc-sajjanar-36-207103.html
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్‌మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.