మహా విలయం.. మాటలకందని విషాదం!
Publish Date:Jul 31, 2024
Advertisement
కేరళ వయనాడ్ జిల్లాలో మంగళవారం (జులై 30) తెల్లవారుజామున భారీవర్షాలతో కొండచరియలు విరిగి పడిన ఘటనలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఇది మహా విలయం.. మాటలకందని విషాదం. గ్రామాలకు గ్రామాలు ఆనవాలు లేకుండా పోయాయి 130మందికి పైగా మృతి చెందారు. ఇంకా వందల మంది ఆచూకీ తెలియడం లేదు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వందలాది మంది గాయపడ్డారు. గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మెప్పోడి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. మెప్పోడ ప్రాంతం లోని నాలుగు గ్రామాలు శవాల దిబ్బగా మారాయి.ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.ప్రధాని మోడీ వెంటనే స్పందించి మృతుల కుటుంబాలకు రెండులక్షలరూపాయలు, క్షతగాత్రులను 50వేలరూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సహాయచర్యలకు రూ. 5కోట్లు విడుదల చేసారు.హెలికాప్టర్ సహాయంతో బాధితులను తరలిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. కేరళకు చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు వలంటీర్లుగా సహాయచర్యలు చేపట్టేలా చూడాలని మోడీ నడ్డాని ఆదేశించారు. నిరంతర వర్షాల వల్ల నేల తడిగా తయారై బలం కోల్పోయి నీరు,బురద,రాళ్లు వేగంగా జారిపోతాయనీ, ప్రస్తుత విలయానికి అదే కారణమని అంటున్నారు. అడవుల నరికివేత వల్ల కూడా ఇలాంటి విపత్తులు సంభవిస్తాయి. ఏదిఏమైనా వరద బాధితులను అదుకోవడానికీ అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలి. బాధితులకు అండగా నిలవాలి. ప్రకృతి విధ్వంసానికి కారణమయ్యే చర్యలను అరికట్టే విషయంపై ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.
http://www.teluguone.com/news/content/vayanad-tragedy-landslides-kill-hundreds-39-181858.html





