వాస్తుతో పాటు జగన్ ఈ పనులు కూడా చేయాలి...

Publish Date:May 6, 2024

Advertisement

ఐదేళ్ళపాటు చేయకూడని అరాచకాలు అన్నీ చేసిన జగన్, ఇప్పుడు అధికారం చేజారిపోతోందని అర్థం చేసుకుని ఆందోళన పడిపోతున్నారు. మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఆయనకు తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కమ్ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలను సెట్ చేసుకుంటే సరిపోతుందని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన వెంటనే అమల్లో పెట్టేశారు. ఇనుప కాంపౌండ్ వాల్‌కి సంబంధించిన రిపేర్లు చేశారు. గోడ ఎత్తు తగ్గించడం యుద్ధ ప్రాతిపదిక మీద జరిగిపోయింది. వాస్తు దోషాలను సరిచేశారు సరే... మరి మిగతా దోషాల సంగతేంటి?

-- అద్బుతమైన రాజధానిగా రూపొందే అమరావతిని పాడుబెట్టేసి ఘోస్ట్ సిటీగా మార్చేశారు. మరి ఈ దోషానికి పరిహారం ఏమిటి?
-- ఈ ఐదేళ్ళలో జగన్ అండ్ కో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచేసి, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు. మరి ఆ తప్పుకు దండన ఏమిటి?
-- కల్తీ మద్య ప్రవాహంతో వేలాది ప్రాణాలు గాల్లో కలసిపోయేలా చేశారు.. ఆ నేరానికి శిక్ష ఏమిటి?
-- హత్యారాజకీయాలు చేసి ఎంతోమంది టీడీపీ కార్యకర్తల ప్రాణాలు తీశారు.. ఆ ఘోరాలకు శిక్ష ఏమిటి?
-- రాష్ట్ర విభజన తర్వాత ముందడుగులో వున్న రాష్ట్రాన్ని పాతికేళ్ళు వెనక్కి తీసుకెళ్ళారు.. ఆ నేరానికి శిక్ష ఏమిటి?
-- పరిశ్రమలను తరిమేసి, ఉపాధి అవకాశాలను పాతాళంలోకి పడేసి లక్షలాది మంది యువకుల జీవితంలో ఐదేళ్ళ కాలాన్ని వృధా చేశారు. ఏం చేస్తే ఈ పొరపాటు సరిదిద్దడానికి వీలవుతుంది?
-- ఈ ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వం ఆశీస్సులతో జరిగిన నేరాలు, ఘోరాలు, అన్యాయాలు, ఆర్థిక నేరాలు... వీటన్నిటి సంగతేమిటి?
.... ఇవి జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన దారుణాల్లో కొన్ని... మరి ఇలాంటివన్నిటినీ మరచిపోయి, ఒక్క వాస్తు దోషం సరిచేస్తే అధికారం వచ్చేస్తుందని ఆశించడం అజ్ఞానం కాక మరేమవుతుంది?

By
en-us Political News

  
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఏమైనా అభినవ గజనీయా? గతంలో ఆయన చేసినవేవీ ఆయనకు ఇప్పుడు గుర్తుకు లేవా? లేక తన కన్వీనియెన్స్ కోసం మరిచిపోయినట్లు నటిస్తున్నారా? ఆ ప్రశ్నలన్నీ ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర గీతం జయహే తెలంగాణకు ప్రసిద్ధ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందించే విషయమై బీఆర్ఎస్ గగ్గోలు పెట్టేస్తోంది.
ఉత్తరాదిలో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చే పరిస్థితి వున్నా, తెలంగాణలో మాత్రం ఆ పార్టీ తొమ్మిది స్థానాలు గెల‌వ‌బోతోంది. ఏపీలో జగన్ వచ్చినా, చంద్రబాబు వచ్చినా బీజేపీకి ప్రమాదం లేదు కానీ, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పట్టు సాధించడానికి వ్యూహాత్మ‌కంగా ఎత్తుగ‌డ‌లు వేసింది.
వైసీపీ మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో మూడు కేసుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం (మే28) షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటనపై ఆయనపై నమోదైన కేసులో ఇప్పటికే హైకోర్టు కండీషన్డ్ బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
వైసీపీలో వున్న ప్రతి అడ్డమైన వాడికీ ఒక దిక్కుమాలిన ముహూర్తం దొరికింది. ప్రతివాడూ ఆ ముహూర్తానికి జగన్ ప్రమాణ స్వీకారం వుంటుందని చెబుతూ నోటి తుత్తర తీర్చుకుంటున్నారు. ఆ బ్యాచ్‌లో ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా చేరాడు.
మరికాసేపట్లో పేలి పోతుంది అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి అగంతకుడు ఫోన్ కాల్ చేశాడు. ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్వ్కాడ్ బృందాలు హుటాహుటీన చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి తెలంగాణ డిప్యూటీ భట్టి విక్రమార్క నివాసం ఉంటున్నారు. బాంబు బెదిరంపుతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. సిబ్బంది సహా అందరినీ భవన్ నుంచి ఖాళీ చేయించి బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు జరుపుతోంది.  మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్‌ చేసిన ఆగంతకుడిని ట్రేస్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
సీఎస్ జవహర్ రెడ్డి నిబంధనలకు నిలువుపాతరేసి.. అడ్డగోలుగా జగన్ తో అంటకాగిన జవహర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా ఒంటరి అయిపోయారు. ఇటు అధికారులు, అటు ప్రభుత్వ పెద్దలు ఎవరకూ కూడా ఆయనకు మద్దతుగా నోరు మెదపడం లేదు.
మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశాలు కనిపించడం లేదు.బెయిల్ పొడిగింపు కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది.
సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. వచ్చే నెల 1న జరిగే తుదివిడత పోలింగ్ తరువాత జూన్ 4న ఫలితాలు వెలువడటమే తరువాయి. ఇప్పటి వరకూ జరిగిన ఆరు విడతల పోలింగ్ తరువాత పరిశీలకులు, రాజకీయపండితులు ఒక అంచనాకు అయితే వచ్చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూంలలో భద్రంగా ఉంది. ఫలితాలు వచ్చే నెల 4న వెలువడతాయి. ఈ ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టబోయేది ఎవరు? పరాజయం పాలై ఇంటికి చేరేదెవరు అన్నది తేలడానికి మరో ఎనిమిది రోజులు మాత్రమే ఉంది.
వైసీపీ వర్గాలు కూడా వేణు స్వామి మీద గుర్రుగా వుండటంతో, ముఖ్యంగా వాళ్ళకి దొరక్కుండా వుండాలని వేణు స్వామి అబ్ స్కాండ్ అయినట్టు  తెలుస్తోంది. 
హైదరాబాద్ బిల్డర్ ఒకరు కర్ణాటకలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన కుప్పాల మధు (48) బిల్డర్. ట్రావెల్స్ వ్యాపారం కూడా నిర్వర్తిస్తున్నారు. వ్యాపారం కోసం తరచూ బీదర్ వెళ్లేవారు. ఎప్పట్లానే ఈ నెల 24న కుటుంబ సభ్యులకు చెప్పి బీదర్  బయలుదేరాడు. ఈ క్రమంలో డ్రైవింగ్ కోసం చింతల్‌కు చెందిన రేణుక ప్రసాద్ (32), వరుణ్, లిఖిత్ సిద్దార్థరెడ్డిని వెంట తీసుకెళ్లారు.
సార్వత్రిక ఎన్నికలు చివరిదశకు వచ్చాయి. ఏడు దశల్లో భాగంగా ఇక చివరి దశ మాత్రమే మిగిలింది. చివరి దశ పోలింగ్ వచ్చే నెల 1న జరగనుంది. స్వతంత్ర్య భారత చరిత్రలో ఎటువంటి ట్రెండ్ లేకుండా జరుగుతున్న సాధారణ ఎన్నికలు ఇవేనని అంటున్నారు.
నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు జయంతి . ఈ సందర్భంగా  వేడుకలకు ఘనంగా తెలుగు తమ్ముళ్లు, అభిమానులు ఏర్పాట్లు చేశారు. ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలకు టీడీపీ నిర్ణయం తీసుకుంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.