బీజేపీకి కాక్రోచ్ టెన్షన్.. కాషాయ పార్టీకి ఇక కష్టాలేనా..!
Publish Date:Jul 30, 2026
Advertisement
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు దేశ రాజధానిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఇన్నాళ్లూ నిశ్శబ్దంగా ఉన్న గొంతుకలు ఒక్కసారిగా గర్జించడంతో కేంద్ర పాలకులు సైతం భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం ఒక నిరసన మాత్రమే కాదు... ఏళ్ల తరబడి అనుభవిస్తున్న నైరాశ్యం, ఉపాధి లేమి, విద్యా వ్యవస్థలోని లోపాలు, ప్రజాస్వామ్య హక్కుల కాలరాచివేతపై సామాన్యుడు విసిరిన సమరభేరి. ఈ అంశాలపై టోన్ న్యూస్ వాస్తవ వేదిక కార్యక్రమంలో తెలుగువన్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్లేషణాత్మకంగా చర్చ నిర్వహించారు. అధికార గర్వాన్ని ఎదిరించిన సామాన్యుడి ఆక్రోశం..! దేశంలో గత కొన్ని ఏళ్లుగా ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఒకరి చేతుల్లో బందీ అయిపోయాయన్న ఆవేదన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఏళ్ల తరబడి కష్టపడి చదివినా ఉద్యోగాలు రాక, రోజువారీ బతుకుదెరువు కోసం గిగ్ వర్కర్లుగా మారుతున్న యువత కడుపు మంట ఈ ఉద్యమానికి ఇంధనంగా మారింది. ఏటా ఫలితాల్లో అక్రమాలు, నిరుద్యోగం, మరోవైపు కార్పొరేట్ల లబ్ధి కోసం అమలవుతున్న విధానాలు సామాన్య కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. తమ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతోందని గ్రహించిన యువత, ఇళ్లలోని నిశ్శబ్దాన్ని వీడి వీధుల్లోకి వచ్చింది. రక్తమోడిన వీధులు... గుండె బలంతో నిలబడిన యువత..! ఢిల్లీ వీధుల్లో కనిపించిన దృశ్యాలు ప్రతీ భారతీయుడి హృదయాన్ని ద్రవీంపజేసాయి. లాఠీలు దెబ్బ తింటున్నా, రక్షక భటులే రక్షకులు కాక భయానక వాతావరణం సృష్టిస్తున్నా యువకులు వెనక్కి తగ్గలేదు. "మమ్మల్ని కాల్చండి... కానీ మా భవిష్యత్తును కాపాడండి" అంటూ నినదిస్తూ పోలీసుల ముందే నిలబడిన దృశ్యాలు స్వాతంత్ర్య పోరాట సమయాలను గుర్తుచేశాయి. ఒక సాధారణ అమ్మాయి రక్షణ వాహనానికి అడ్డంగా నిలబడి తన నిరసనను వ్యక్తం చేయడం, తమ హక్కుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడిన సామాన్యుల తెగువకు అద్దం పడుతోంది. 16 మెట్రో స్టేషన్లను మూసివేసి, ఇంటర్నెట్‌ను నిలిపివేసి ఉద్యమాన్ని అణచివేయాలని చూసినా, గుండెల్లో రగులుతున్న కడుపు మంట ముందు ఏ ఆంక్షలూ నిలవలేకపోయాయి. ప్రజాస్వామ్యంలో కొత్త ఆశల చిగురు..! ఈ సుదీర్ఘ పోరాటం వెనుక ఏ రాజకీయ పార్టీ ప్రయోజనాలూ లేవు, ఏ నాయకుడి స్వార్థమూ లేదు. ఇది స్వచ్ఛందంగా, ఆవేదనలోంచి ఉద్భవించిన ఒక అగ్నిపర్వతం. ఎండనక, వాననక వీధుల్లో రాత్రంతా గడిపిన ప్రతీ యువకుడి వెనుక ఒక పేద కుటుంబం ఆశలు ఉన్నాయి. "మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో" అని రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా తల్లడిల్లిన తల్లిదండ్రుల కన్నీళ్లు ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థలన్నీ మౌనం వహించిన చోట, ఈ యువ శక్తి చూపించిన సాహసమే ఈనాడు పాలకవర్గాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ ఉద్యమం మనకు నేర్పిన పాఠం ఒకటే... ఎంతటి బలమైన అధికారమైనా ప్రజల ఆక్రోశం ముందు తలవంచక తప్పదు. ఇలాంటి అంశాలపై పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి. Vasthava Vedika, Kanthamneni Ravi Shankar, Dolendra Prasad, Cockroach party, Gig Workers Strike Delhi, BJP
http://www.teluguone.com/news/content/vasthava-vedika-25-227589.html




