తిరుమల లడ్డూ ప్రసాదం.. తప్పు చేసిందెవరు?.. పరిష్కారం ఏమిటి?
Publish Date:Feb 13, 2026
Advertisement
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో వాస్తవ వేదిక 12వ సంచిక గురువారం (ఫిబ్రవరి 12) విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ అర్ధవంతమైన చర్చ జరిపారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం జగన్ హయాంలో సరఫరా అయినది అసలు నెయ్యే కాదని డోలేంద్ర ప్రసాద్ కుండ బద్దలు కొట్టారు.
పామాయిల్‌తో పాటు రసాయనాలు కలిపిన నూనె సరఫరా చేశారన్నారు. ఇప్పుడు వైసీపీ నాయకులు తెలివిగా నెయ్యిలో కల్తీ లేదని వాదిస్తూ ప్రజలను తొప్పుదోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నం దొంగే దొంగ దొంగా అని అరుస్తున్న చందంగా ఉందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును వదిలి సుప్రీంకోర్టులో సీబీఐ విచారణ కోరడం అలాంటిదేనని కంఠంనేని రవిశంకర్ అన్నారు. అపచారం చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు బుకాయిస్తున్నారన్నారు. ఈ దశలో కంఠంనేని రవి శంకర్ గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలకు ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు చాలు అన్న విషయాన్ని అప్పట్లో వైఎస్ ఏకంగా ఏడు కొండలు కాదు రెండు కొండలే అంటూ జీవో ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించి.. వైఎస్ఆర్ కుటుంబం తిరుమలపై కక్ష కట్టిందా? అన్న ప్రశ్న సంధించారు. ఈ సంచికలో ఇంకా పింక్ డైమండ్ అన్న రమణదీక్షితులు వ్యవహారంపై కూడా చర్చకు వచ్చింది.
మొత్తంగా వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో అసలు నెయ్యిని వాడలేదనీ, నెయ్యిలా కనిపించేందుకు, పూసపూసలా నెయ్యి అనిపించేందుకు నూనెలో రసాయనాలు కలిపి సరఫరా చేశారని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు. దీనివల్ల తిరుమల లడ్డూ ప్రసాదం మూడు నాలుగు రోజులలోనే బూజు పట్టేవన్నారు. ఈ విషయంలో తెలుగుదేశం డిఫెన్స్ లో పడటానికి, ల్యాబ్ రిపోర్టులు పూర్తిగా అధ్యయనం చేయకుండా చంద్రబాబు నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ అని ప్రకటించడమేనన్నారు. ఇక నుంచైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి'అనడం మాని కల్తీ నూనె లేదా రసాయనాల మిశ్రమం అని పిలవాలని డోలేంద్ర ప్రసాద్ సూచించారు. ఎందుకంటే అసలు నెయ్యే లేనప్పుడు కల్తీ నెయ్యి అని ఎలా అనగలం అన్నారు.
ఇక తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఇంతటి అపచారం జరిగితే చిన్న జీయర్ స్వామి వంటి మతాధిపతులు, మఠాధిపతులు, హిందూ సంస్థలు ఎందుకు మౌనం వహిస్తున్నాయన్నారు. దర్యాప్తు సంస్థల విచారణలు, రాజకీయ ఆరోపణలు కాకుండా కంటే మతాధిపతులతో కూడిన కమిటీ విచారణ చేస్తే ప్రజలకు నమ్మకం కలుగుతుందని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. దేవుడికి అపచారం చేసిన వారు ఎవరూ బాగుపడలేదన్నారు. జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్త హోమం నిర్వహించాలని, జగన్ తన హయాంలో జరిగిన తప్పుకు బహిరంగ క్షమాపణ కోరాలని డోలేంద్ర ప్రసాద్ అన్నారు.
వాస్తవ వేదిక పూర్తి చర్చను తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో వీక్షించండి
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.