Publish Date:Jun 16, 2025
ముడి చమురు దిగుమతులకు భారత్ ఇక వెంపర్లాడాల్సిన పని లేదు. ఇప్పటికైనా ప్రపంచంలో ముడి చమురు విషయంలో అమెరికా, చైనాల తరువాత మూడో స్థానంలో ఉన్న భారత్ అతి త్వరలో ముడి చమురును ఎగుమతి చేసే స్థాయికి ఎదగనుంది. అండమాన్ సముద్రంలో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయనీ, వాటిని కనుగొని వెలికి తీసేందుకు భారత్ సమాయత్తమౌతోంది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియయం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. ఒక ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ సంగతి తెలిపారు.
అండమాన్ సముద్రంలో ఉన్న భారీ చమురు నిల్వల ముందు గయానాలోని చమురు నిల్వలు తక్కువేనని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత్ రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా వంటి దేశాల నుండి పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అండమాన్ సముద్రంలో భారీగా ఉన్న చమురు నిల్వలను వెలికి తీస్తే భారత్ దశ మారిపోతుంది. ముడి చమురును దిగుమతి చేసుకునే స్థితి నుంచి పెద్ద ఎత్తున ఎగుమతి చేసే స్థాయికి చేరుతుంది. అంతే కాదు 3.7 ట్రిలియన్ నుంచి మన $20 ట్రిలియన్ లకు మన ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని కేంద్ర మంత్రి చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vast-crude-oil-deposits-in-andaman-sea-39-200032.html
Publish Date:Jul 10, 2025
దేశ రాజధాని ఢిల్లీలో గురువారం (జులై 10) తెల్లవారు జామున భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారానికి పాల్పడిన పలువురు నటులు, సామాజిక మాధ్యమ ఇన్ ఫ్లుయెన్సర్లపై ఈడీ కేసుల కొరడా ఝుళిపించింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (జులై 10) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
నటుడు ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే మొత్తం వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం భరించేందుకు ముందుకు వచ్చింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్న ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒక జర్నలిస్టు బలవన్మరణానికి పాల్పడ్డారు.
గత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణకు పూడ్చలేని నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ నాయకత్వ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విలియమ్స్ కంపెనీని వీడనుండటంతో.. సీఈవో టిమ్కు కుక్కు అదనపు బాధ్యతలను అప్పగించింది.
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్ వడోదరాలోని మహిసాగన్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి ఒక్కసారిగా కూలింది.
గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో రద్దైన పాత రూ.1000, రూ.500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి.
గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామం గల గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎరువుల కొరత లేకుండా రాష్ట్రానికి సహకరిస్తామని తెలిపింది. యూరియా కోటా పెంచాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్రానికి ఇటీవల విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదికతో చర్యలు ప్రారంభించారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీలో ప్రభుత్వం రైతాంగానికి తీపి కబురు చెప్పింది. బుధవారం (జులై 9) వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధాన్యం పాత బకాయిలు రూ.1000 కోట్లలో రూ. 672 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది.