ఎమ్మెల్సీగా వర్ల రామయ్య ప్రమాణ స్వీకారం.!

Publish Date:Aug 19, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్  శాసనమండలి సభ్యుడిగా తెలుగుదేశం సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ప్రమాణ స్వీకారం చేశారు.  శాసనమండలి లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు రెండు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఆ స్థానాల భర్తీకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇద్దరి పేర్లతో గవర్నర్ కు జాబితా పంపింది. వారిలో ఒకరు వర్ల రామయ్య కాగా మరొకరు దళవాయి రమాదేవి.  ఈ మేరకు ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలపడంతో వారిద్దరినీ నామినేట్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.  ప్రజా సేవ, పార్టీ పట్ల నిబద్ధత  ప్రాతిపదికగా తీసుకుని కూటమి ప్రభుత్వం ఈ ఇద్దరినీ గవర్నర్ కోటా కింద ఎమ్మోల్సీలుగా ఎంపిక చేసింది. దీంతో నూతన ఎమ్మెల్సీగా వర్ల రామయ్య బుధవారం (ఆగస్టు 20) ప్రమాణ స్వీకారంచేశారు. మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు వర్ల రామయ్య చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 

కాగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన వర్ల రామయ్య   26 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పోలీసు శాఖలో సర్వీస్ చేశారు. పదవీ విరమణకు పదేళ్ల ముందే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 2001లో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో ఎస్సీ సెల్ బాధ్యతల నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకూ వివిధ పదవులను సమర్థంగా నిర్వహించారు.  గతంలో గృహ నిర్మాణ సంస్థ,  ఆర్టీసీ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నెరవేర్చిన ఆయన, ప్రస్తుతం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. 

ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన దళవాయి రమాదేవి,  తెలుగుదేశం  కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి, పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక ప్రతికూల పరిస్థితులు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో నిలబడి గట్టగి పోటీ ఇచ్చారు.  అనంతపురం పరిధిలో పార్టీ అంగన్‌వాడీ విభాగం కన్వీనర్‌గా, యూనిట్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు.    ప్రస్తుతం పార్టీ క్లస్టర్ ఇన్‌ఛార్జిగా సేవలందిస్తున్నారు.  

AP Governor Quota MLCs, Varla Ramaiah MLC, Dalavai Ramadevi MLC, AP Legislative Council, AP News Telugu

By
en-us Political News

  
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.