Publish Date:Apr 26, 2025
అనుచిత వ్యాఖ్యలు, అడ్డగోలు దౌర్జన్యాలు, కిడ్నాప్ లు, బెదరింపులకు పాల్పడిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నదంట. ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, అలాగే నారాలోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు ేసినప్పుడూ, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి ఉసికొల్పిన సమయంలోనూ.. అదే కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించినప్పుడూ నోరెత్తిని ఆ గొంతు ఇప్పుడు లేస్తోంది. ఇంతకీ ఆ గొంతు ఎవరిదంటే వల్లభనేని వంశీ సీమణి పంకజాక్షిది. ఔను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తన భర్తపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందంటున్నారు వల్లభనేని పంకజాక్షి. ఈ మేరకు ఆమ రాష్ట్ర వర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఫిర్యాదు చేశారు. శుక్రవారం (ఏప్రిల్ 25) విజయవాడలోని రాజ్ భవన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు తన భర్త వల్లభనేని వంశీ పట్ల కూటమి ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని గవర్నర్ కు చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె వెంట వైసీపీ నేతలు నేతలు మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ కూడా ఉన్నారు.
జగన్ హయాంలో చంద్రబాబు మీద, లోకేష్ మీద, టీడీపీ మీద, నారా భువనేశ్వరి మీద వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు, అదే టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్ కిడ్నాప్ కేసు, భూ ఆక్రమణ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vanshi-wife-pankjaakshi-complaint-governor-25-196963.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.