Publish Date:Apr 23, 2022
అవును, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఫుల్ హ్యాపీగా ఉన్నారట. ప్రస్తుత హోంశాఖ మంత్రి తానేటి వనిత మాటలను చూసి మనసులో తెగ సంబరపడిపోతున్నారట. ఎస్సీ ఎమ్మెల్యే అయిన తనను మంత్రి మండలి నుంచి తప్పించి.. తన ప్లేస్‌లో వనితను హోంమంత్రిగా నియమించి సీఎం జగన్ ఎంత తప్పు చేశారో ఇప్పుడు అందరికీ తెలిసొచ్చిందని సుచరిత తన సన్నిహితుల దగ్గర సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. మంత్రి పదవి రాలేదని తాను అలిగితే.. తనను బుజ్జగించకుండా పక్కనపెట్టేసి అవమానించారని.. తీవ్ర అసమనంతో, అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ మంత్రి సుచరితకు.. తాజా మంత్రి తానేటి వనిత వ్యవహారం కాస్త తృప్తిని, ఆనందాన్ని ఇచ్చాయంటున్నారు. ఎందుకంటే...
ఇప్పుడు సోషల్ మీడియాకు హోంమంత్రి వనితనే ఫుల్ టార్గెట్. ఆమె వ్యాఖ్యలపై ఫుల్ ట్రోలింగ్ జరుగుతోంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి అత్యాచార ఘటనపై హోంమంత్రిగా ఆమెకు కనీస అవగాహన కూడా లేకపోవడం.. అధికారులను ఆ వివరాలు అడిగి తెలుసుకుంటూ.. దొరికిపోవడంతో ఆమె ట్రోలర్స్‌కు, ప్రతిపక్షాలకు చేతి నిండా పని కల్పించారు.
విజయవాడ ప్రభుత్వాసుపత్రి అత్యాచార ఘటన యావత్ తెలుగుజాతిని కలిచివేస్తే.. హోంమంత్రి తానేటి వనిత మాత్రం ఎలాంటి ప్రాధమిక సమాచారం లేకుండా మీడియా ముందుకు వచ్చి అడ్డంగా బుక్కయ్యారు. మీడియా మైక్‌లు ఆన్‌లో లేవనుకున్నారో ఏమో.. అత్యాచారం ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఇవాళ డేట్ ఎంత? ఎప్పుడు అరెస్ట్ చేశారు? అంటూ అధికారులను సమాచారం అడిగి తెలుసుకోవడం.. అదికాస్తా రికార్డు కావడం.. ఆ వీడియో ఫుల్ వైరల్ కావడంతో ప్రభుత్వ పరువంతా పోయింది. హోంమంత్రిగా ఉండికూడా.. అంత ఘోరం జరిగితే కూడా.. కనీస సమాచారం లేకుండా ఎలా ఉంటారు? ఆమె హోంమంత్రిగా ఎలా పనికి వస్తారు? అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు, ట్రోల్స్ నడుస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వనీత తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
ఇదంతా చూస్తూ.. మాజీ హోంమంత్రి సుచరిత మాత్రం లోలోన తెగ ఖుషీ అవుతున్నారని ఆమె అనుచరులే అంటున్నారు. తాను హోంమంత్రిగా ఉన్నప్పుడు ఎలా పని చేసే దానినని.. కొత్త మంత్రి ఇలా మినిమమ్ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా మాట్లాడి.. ఇటు ప్రభుత్వ పరువు, అటు పార్టీ పరువు రెండూ మంటగలిపారని.. తనను కాదనుకున్నందుకు.. ఏరికోరి వనితను కేబినెట్‌లోకి తెచ్చిపెట్టుకున్నందుకు.. తగిన శాస్త్రి జరిగిందంటూ.. సుచరిత తెగ సంతోష పడుతున్నారని చెబుతున్నారు. తనను అవమానించినందుకే, తన కడుపుమంట ఇలా వారికి తగిలిందని శాపనార్థాలు కూడా పెడుతున్నారట మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vanitha-episode-become-hot-topic-in-ycp-39-134864.html
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.