జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధా.. నియోజకవర్గం ఏదంటే?

Publish Date:Mar 20, 2024

Advertisement

వంగ‌వీటి రాధా కృష్ణ‌ ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. దివంగ‌త వంగ‌వీటి  రంగా కుమారుడిగా ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయాల్లో  ఆయనకు ఒక ప్రత్యేక ముద్ర, గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో వంగవీటి ఇంటి పేరుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంగవీటి రంగా హత్య తరువాత ఆ కుటుంబ ప్రాధాన్యత రాజకీయాలలో కీలకంగా మారింది. ఇక విషయానికి వస్తే వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా  పాతికేళ్ల పిన్న వయస్సులోనే  (2004 ) ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైయ్యారు.  విజ‌యవాడ రాజ‌కీయాల్లో కీల‌క నేత‌గా ఎదిగారు. ఆయనకు అభిమానుల సంఖ్య కూడా చాలా చాలా ఎక్కువే. వంగవీటి  రంగా రాజకీయ వారసుడిగా ఆయన నిత్యం తన అనుచరులకు, అభిమానులకు అందుబాటులో ఉంటారన్న గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఇటీవలి కాలంలో ఆయన ఉద్దేశపూర్వకంగా రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం అధిష్ఠానం ఆయనను ఎన్నికలలో పోటీ చేయాలని కోరినప్పటికీ పెద్దగా ఆసక్తి  చూపలేదు. దీంతో ఆయన వైసీపీ గూటికి చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కూడా.  ప్రజలిచ్చిన ఒక్క చాన్స్ ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్.. ఎలాగైనా మరో సారి అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో  ఉన్న జగన్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేయగల వంగవీటి రాధాను వైసీపీలోకి రావాల్సిందిగా కోరారు.

ఇందు కోసం ఆయన వంగవీటి రాధాకు సన్నిహితంగా మెలిగే చనువు ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీలను ఆయన వద్దకు పంపారు. వంగవీటి రాధాను వైసీపీ గూటికి చేర్చగలిగితే కాపు సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవడం, అదే సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్ కు దూరం చేయడం చిటికెలో పని అని భావించారు.  కాపు ఉద్యమ నుత ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరినా ఆయన ప్రవేశం పార్టీకి ఏమాత్రం మైలేజీ ఇవ్వలేదని అర్ధం కావడంతో ఆయన చూపు వంగవీటి రాధాపైకి మళ్లింది.  వాస్తవానికి గత రెండేళ్లు జగన్ వంగవీటి రాధాను పార్టీలో చేర్చుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ రాధా ఎలాంటి పదవులూ ఆశించలేదు. అయితే వంగవీటి రాధా తెలుగుదేశంలో అసంతృప్తితోనే కొనసాగుతున్నరని భావించిన జగన్  రాధా వైసీపీలోకి వస్తే ఆయనకు విజయవాడ సెంట్రల్ స్థానాన్ని కేటాయిస్తామని ఆఫర్ ఇచ్చారు.  కొడాలి నాని, వల్లభనేని వంశి, మిథున్ రెడ్డి, పేర్ని నాని వంటి వారు జగన్ దూతలుగా రాధాను కలిశారు. ఆయనను వైసీపీలోకి ఆహ్వానించారు.

రాధాతో వైసీపీ నేతలు ఎంతగా అంటకాగి తిరిగారంటే.. తాము రాధాకు దగ్గరగా మెసిలితే.. ఆయన వైసీపీ గూటికి చేరుతున్నారన్న సంకేతం ఆయన అనుచరులకు వెడుతుందనీ, అదే విధంగా తెలుగుదేశం ఆయనను దూరం పెడుతుందన్న దూరాలోచనతో  రాధా   త‌న తండ్రి రంగా వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని  పిండ ప్ర‌దానం చేసేందుకు కాశీ వెడితే ఆయన వెంట కొడాలి నాని   వెళ్లారు.  ఎన్ని ప్రయత్నాలు చేసినా వంగవీటి రాధా జగన్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టేశారు. అంతే కాకుండా విజయవాడ వైసీపీ ఇన్ చార్జ్ బొప్పన భవకుమార్ ను తెలుగుదేశంలోకి రావాల్సిందిగా ఆహ్వానించి వంగవీటి రాథా జగన్ కు భారీ షాక్ ఇచ్చారు. తద్వారా తాను పార్టీ మారే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు. దీంతో జగన్ కాపు సామాజికవర్గ మద్దతు కోసం వేసిన ఎత్తులు, పన్నిన వ్యూహాలు పూర్తిగా బెడిసికొట్టాయి.  

అయితే వంగవీటి రాధా తెలుగుదేశం కార్యక్రమాలలో పెద్దగా చురుగ్గా పాల్గొనడం లేదన్నది వాస్తవం. అలాగే ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయాలని హైకమాండ్ స్వయంగా కోరినా సున్నితంగా తిరస్కరించారని చెబుతారు. అటువంటి వంగవీటి రాథా ఇప్పుడు జనసేన నేతలతో వరుస భేటీలతో యాక్టివ్ గా మారడంతో తెలుగుదేశం, జనసేనల పొత్తుతో ఆయన ఎన్నికల బరిలోకి దిగాలన్న నిర్ణయానికి వచ్చారని పరిశీలకులు చెబుతున్నారు.

తెనాలిలో జనసేన  సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ తో, ఆ తరువాత బాలశౌరితో భేటీ అయ్యారు. ఈ భేటీల వెనుక కారణం ఏమిటన్నది తెలియరాలేదు. అయితే ఆయన జనసేన తరఫున ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పొత్తులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో  జనసేనకు కేటాయించిన స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా వంగవీటి రాధా అనుచరులు కూడా చెబుతున్నారు.  వంగవీటి రాధ ఎన్నికల బరిలో దిగడం, దిగకపోవడం అటుంచితే ఆయన మాత్రం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున యాక్టివ్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం మాత్రం గ్యారంటీ అని ఆయన అనుచరులు చెబుతున్నారు.  గత ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో చేరిన రాథా ఆ ఎన్నికలలో పోటీ చేయలేదనీ, అయితే తెలుగుదేశం తరఫున విస్తృతంగా ప్రచారం చేశారనీ వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 

By
en-us Political News

  
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.