వంశీ పిటిషన్ ను తోసిపుచ్చిన నూజివీడు కోర్టు.. మళ్లీ విజయవాడ జిల్లా జైలుకే!
Publish Date:May 26, 2025
Advertisement
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీకి మరోసారి నిరాశే ఎదురైంది. నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను నూజివీడు కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తనపై నమోదైన అభియోగాలను రద్దు చేయాలని కోరుతూ వంశీ దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. వంశీ పిటిషన్ పై సోమవారం నూజివీడు కోర్టు విచారిం చింది. ఇరు పక్షాల వాదనలూ విన్న మీదట వంశీ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ప్రస్తుతం వంశీ విజయవాడ జిల్లా కోర్టులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా ఉండగా పోలీసు కస్టడీలో ఉండగా అస్వస్థతకు గురైన వంశీని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయనకు చికిత్స అందించిన తరువాత తిరిగి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కాగా వంశీ ఆరోగ్య పరిస్థితిపై గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి విడుదల చేసిన బులిటిన్ మేరకు వంశీకి ఫిట్స్ ఉన్నాయి. అలాగే నిద్రలో శ్వస అగిపోవడం అనే సమస్య కూడా ఉంది. ఈ సమస్యకు చికిత్స చేయడానికి ముందు స్లీప్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ టెస్ట్ చేయడానికి అవసరమైన పరికరాలు జీజీహచ్ లో లోకపోవడంతో ఆ టెస్ట్ చేయించుకోవడం కోసం మరో ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు ఆ బులిటిన్ పేర్కొంది.
http://www.teluguone.com/news/content/vamshi-petition-dismissed-25-198722.html





