తరచు ఎన్నికలతో ప్రజా ధనం వృధా : డిప్యూటీ సీఎం పవన్
Publish Date:May 26, 2025
Advertisement
దేశం ప్రధాని మోదీ నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చెన్నైలో జరుగుతున్న వన్ నేషన్-వన్ ఎలక్షన్ సెమినార్‌లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతు జమిలీ ఎన్నికలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన నిర్ణయం మార్చుకోవాలని సూచించారు. తరచూ ఎన్నికలతో కేంద్రంపై భారం పడుతుందని ఆయన తెలిపారు.భారత్‌కు ఉన్న సామర్ధ్యం రీత్యా ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ ఆచరణ సాధ్యమే అని తెలిపారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ దేశానికి అవసరమైన మార్పు అని చెప్పారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు ప్రధాని మోదీనే అని పవన్ పేర్కొన్నారు. త్వరల్లో తమిళనాడులో ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపు ఖాయమని అన్నారు. అవసరం అయితే ఇక్కడ ప్రచారం చేసేందుకు తాను వస్తానని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ క్రమంలో సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని అన్నారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ అధినేత జగన్‌పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలపై వైసీపీకీ ఓ విధానం లేదని అన్నారు. 2019లో వైసీపీ గెలిచింది కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ద్వారనే అని ఆయన తెలిపారు. పవన్‌సై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై ప్రశంసలు కురిపించారు. పవన్ ఏపీ నుంచి ఓ శక్తిలా ఇక్కడికి వచ్చారని ఆయను సుస్వాగతం మీరు రావడం నాకే కాదు మొత్తం తమిళనాడుకే చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు.
http://www.teluguone.com/news/content/one-nationone-election-25-198719.html





