భూమి గుండ్రంగా ఉందని ఎక్కడ మొదలయ్యామో అక్కడికే రాక తప్పదని ఇప్పటికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అర్ధమై ఉంటుంది. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై.. వైసీపీ అధికారంలోకి రాగానే వంశీకి కేసుల భయం పట్టుకుంది. అధికారంలో ఉన్న వైసీపీ పంచన చేరితే ఇక ఆ కేసుల భయం ఉండదని పార్టీ మారిపోయారు. ఇక్కడే ఆయన భూమి గుండ్రంగా కాదు బల్ల పరుపుగా ఉంటుందని భావించారు. మరెన్నడూ తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు.. జగనే శాశ్వత సీఎం, కనుక తనపై నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఎప్పటికీ తేలదని నమ్మారు.
అందుకే వంశీ తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వదిలేసి జగన్ పంచన చేరి వైసీపీ కండువా కప్పు కున్నారు. అంతేనా.. ఇన్నాళ్లూ ఆశ్రయం ఇచ్చిన పార్టీపై ఇష్టారీతిన ప్రేలాపనలు పేలారు. తెలుగు దేశం అధినేత సతీమణి భువనేశ్వరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనకు అండగా నిలబడిన గన్నవరం తెలుగుదేశం క్యాడర్ ను వేధించారు. ఐదేళ్లు తిరిగే సరికి సీన్ మారిపోయింది. జగన్ పార్టీ ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది అని భావించారు. జగన్ సీఎం పదవి పోయింది. ఓటమి అనేదే లేకుండా తాను గెలుస్తూ వస్తున్న గన్నవరం అసెంబ్లీ స్థానంలో వల్లభనేని వంశీ కూడా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. భూమి గుండ్రంగానే ఉందని, ఉంటుందని ఇప్పుడు వంశీకి బోధపడి ఉంటుంది. ఎందుకంటే ఏ కేసు భయంతో అయితే వంశీ తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వీడాడో.. అదే కేసు ఇప్పుడు ఆయనకు కటకటాల భయాన్ని చూపెడుతోంది.
బాపులపాడులో నకిలీ ఇల్ల పట్టాలు తయారు చేయించి పంచిన కేసులో వల్లభనేని వంశీ ముద్దాయి. 2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ కేసులో తనకు జైలు తప్పదన్న భయంతో ఆయన పార్టీ మారిపోయారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయన భావించినట్లే వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ నకిలీ ఇళ్ల పట్టాల కేసు పట్టాలెక్కలేదు. ఆ కృతజ్ణతో లేక వైసీపీ అధినాయకత్వం ఒత్తిడో తెలియదు కానీ వంశీ వైసీపీ పంచన చేరి తెలుగుదేశం నేతలపై ఇష్టాను సారం వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గంలోని తెలుగుదేశం క్యాడర్ ను వేధించారు. ఇప్పుడు కర్మఫలం అనుభవించక తప్పని పరిస్థితిలో ఉన్నారు. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో కోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు వంశీపై కేసు నమోదు అవ్వనుంది. వైసీపీ నుంచి అండ లభించే అవకాశాలు లేశమాత్రంగానైనా కనిపించడం లేదు. దీంతో వంశీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడగా మారిపోయింది. కటకటాలు లెక్కిండానికి రోజులు లెక్కపెట్టుకోవడమే మిగిలింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vamshi-in-deep-trouble-39-188092.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.