విలువల గురించి బే ఫికర్.. రాపాక రాజకీయం!

Publish Date:May 21, 2023

Advertisement

ఎన్నికలు మళ్లీ వచ్చేస్తున్నాయి. ఎమ్మెల్యేగా మళ్లీ గెలుపొందాలంటే.. పార్టీ అండ దండ కావాలి. అలా అయితేనే.. మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టి అధ్యక్షా.. అధ్యక్షా అనొచ్చు. కానీ గత ఎన్నికల్లో ఓ పార్టీ నుంచి గెలిచి.. ఆ తర్వాత మరో పార్టీలోకి జంప్ జిలానీ రాగం ఆలపించడంతో.. ఇప్పటి వరకు పరిస్థితులు బాగానే ఉన్నా.. ఎన్నికల నాటికి సీన్.. సితారా అయ్యే అవకాశాలు ఉన్నట్లు రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌కు గట్టిగానే అర్థమైన్నట్లుందనే ఓ టాక్   సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

ఆ క్రమంలో ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్‌కు ఆయన ఫ్యామిలీకి రాపాక వారు గట్టిగానే సోప్ వేస్తున్నట్లు ఆయన చర్యలు చూస్తే ఇట్టే అర్థమవుతోందనే చర్చ సైతం సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం తన కుమారుడు వివాహ వేడుకను రాపాక వాడుకొంటున్నట్లుగా ఉందని తెలుస్తోంది. ఆ క్రమంలో తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రంపై మాకు దైవ సమానులైన మా ప్రియతమ నాయకులు, ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, భారతమ్మ గార్ల ఆశీస్సులతో.. అంటూ వారి పొటోలను ముద్రించిన శుభలేఖ అటు మీడియాను ఇటు సోషల్ మీడియాను చూట్టేస్తోంది. అయితే ఈ పోటోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు..ఫ్యాన్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. జనసేన శ్రేణులు మాత్రం వ్యంగ్య బాణాలు సంధిస్తోంది.  

ఎందుకంటే.. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలుపొందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోల్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఘన విజయం సాధించారు. అయితే ఇవే ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. రెండు చోట్ల పోటీ చేసి.. ఓటమి పాలైయ్యారు. దీంతో ఆ పార్టీ తరఫున గెలిచిన ఒకే ఒక్కడు రాపాక.. దాంతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు.

తాను జనసేన సభ్యుడిగానే ఉంటానని.. అలా అయితే తన నెంబర్ 1 గా ఉంటుందని.. అదే జగన్ పార్టీలోకి వెళ్లితే.. తన నెంబర్ 152గా ఉంటానని అసెంబ్లీ సాక్షిగా రాపాక ప్రకటించారు. అలా చెప్పిన కొద్ది రోజులకే రాపాక.. పార్టీ కండువా మార్చే చేశారు. ఆయన కుమారుడిని ముందుగా పార్టీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పారు. అలాగే పి.గన్నవరంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో సైతం ఆయన జగన్ పార్టీ కండువా కప్పుకొని.. వేదిక మీద ఆశీసునులు అయిన సంగతి తెలిసిందే. 

మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాజోలు నుంచి అధికార ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రాపాక సన్నాహాలు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. ఓ వేళ పార్టీ టికెట్ సీఎం జగన్ వలదన్నా... తన వంతు ప్రయత్నంగా ముందు చూపుతో రాపాక వ్యవహరిస్తున్నారనే ఓ చర్చ సైతం జిల్లా ఫ్యాన్ పార్టీలో జోరందుకొంది.

By
en-us Political News

  
నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు.
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.