వల్లభనేని వంశీ వాట్సాప్ సందేశం.. కొడాలి నాని పేరు ప్రస్తావన

Publish Date:May 6, 2019

Advertisement

 

ఎన్నికల అనంతరం కూడా కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ వేడి తగ్గలేదు. ఎమ్మెల్యే వల్లభనేని తనను బెదిరిస్తున్నారంటూ వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ని కలిసి రక్షణ కోరినట్లుగా వార్తలొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై వంశీ కానీ, వెంకట్రావు కానీ ఇంతవరకు బహిరంగంగా ఎక్కడా మాట్లాడలేదు. అయితే తాజాగా వంశీ.. జరిగిన అన్ని పరిణామాలను వివరిస్తూ యార్లగడ్డకు వాట్సాప్‌ ద్వారా ఓ సందేశం పంపారు.

"డియర్‌ వెంకట్రావు.. నేను వల్లభనేని వంశీ. గతంలో మన ఉమ్మడి స్నేహితుడు కొడాలి నాని ద్వారా కొన్ని విషయాల్లో నేను నీకు సాయం చేశాను. రమేష్‌ అనే వ్యక్తి నీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు, భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో వరకట్న వేధింపుల కింద కేసు నమోదైనప్పుడు.. కానీ ఆయా సందర్భాలలో మనిద్దరం ప్రత్యక్షంగా కలవలేదు, కనీసం మాట్లాడుకోలేదు. కేవలం నాని ప్రోద్భలం వల్లే ఇదంతా చేశాను. దీనికి నువ్వు నానికి కృతజ్ఞుడివై ఉండాలి. ఎందుకంటే ఈ కేసుల్లోంచి బయటపడేసి, నీ పాస్‌పోర్టు సీజ్‌ చేయకుండా కాపాడాడు. నువ్వు గన్నవరం వైసీపీ అభ్యర్థిగా వచ్చే వరకు ఎక్కడా మనిద్దరం కలవలేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత లక్ష్మీతిరుపతమ్మ ఆలయంలో నువ్వు కనపడినపుడు నీకు స్వాగతం చెప్పాను. ప్రస్తుత ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు మూడు ఎన్నికల్లో నేను పోటీ చేశాను. ఎప్పుడూ టీడీపీ గొప్పదనం గురించి, చంద్రబాబు పరిపాలన గురించి మాట్లాడాను తప్పితే.. ఎవరిపైనా విమర్శలు చేయలేదు. నాపై పోటీ చేసిన లగడపాటి రాజగోపాల్‌, దుట్టా రామచంద్రరావుల గురించి ఎప్పుడూ కూడా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. లగడపాటి పిల్లలు, నా పిల్లలు మంచి స్నేహితులు, ఇప్పటికీ మా పిల్లలు లగడపాటి ఇంటికి వెళ్లి వస్తుంటారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ నీ గురించి వ్యక్తిగతంగా ఎలాంటి విమర్శలు చేయలేదు. కేవలం టీడీపీ, చంద్రబాబు పరిపాలన గురించే ప్రచారంలో వివరించాను. కానీ నువ్వు.. నేను గతంలో నీతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించి, అప్పు పొందినట్లు చెప్పినట్లుగా నా దృష్టికి వచ్చింది. నువ్వు గన్నవరం వచ్చే వరకు నన్ను చూశావా?, నాతో ఎప్పుడైనా మాట్లాడావా?, ఎప్పుడైనా నాకు అప్పు ఇవ్వడం గానీ, విరాళం ఇవ్వడం గానీ చేశావా?.. కానీ దీనికి భిన్నంగా చేస్తున్న ప్రచారం ఆశ్చర్యకరంగా ఉంది. పైగా నాపై నిరాధార, తీవ్రమైన ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. ఇవన్నీ నా దృష్టికి రావడంతో నియోజకవర్గంలో ఓ మంచి వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో నీకు ఫోన్‌ చేసి కలవాలనుకున్నా. అందుకే మీ ఇంటికి వచ్చి ఆత్మీయపూర్వకమైన వాతావరణం నెలకొల్పాలనుకున్నా. గన్నవరాన్ని డల్లాస్‌ లాగా మారుస్తానన్న నీ ప్రతిపాదన విని నీకు సన్మానం చేయాలనుకున్నా. అందుకే నీకు ఫోన్‌ చేశాను. నువ్వు స్పందిచకపోవడంతో నా మనుషుల్ని అపాయింట్‌మెంట్‌ కోసం పంపాను. ఆ తర్వాత నేనే వచ్చాను. ఇవి జరిగిన తర్వాత నువ్వు సీపీని కలిసినట్లు, నా నుంచి హాని ఉందని, రక్షణ కల్పించమని అడిగినట్లుగా పత్రికల్లో చూశాను. నా గురించి నువ్వేమీ భయపడనక్కర్లేదు, నా వల్ల నీకెలాంటి ఇబ్బంది ఉండదు. దేవుడున్నాడు, అన్నీ ఆయనకు తెలుసు. అందరికీ ఆ దేవుడే న్యాయం చేస్తాడు." అంటూ వంశీ సందేశాన్ని పంపారు. మరి దీనిపై యార్లగడ్డ ఎలా స్పందిస్తారో చూడాలి.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.