వైసీపీకి వల్లభనేని వంశీ గుడ్ బై?.. రాజకీయ సన్యాసమేనా?

Publish Date:Jul 2, 2025

Advertisement

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీ వివిధ కేసులలో గత కొంత కాలంగా విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చివరాఖరుకు ఆయనపై నమోదైన అన్ని కేసులలోనూ బెయిలు లభించడంతో బుధవారం (జులై 2)  ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఆయన బయటకు రావడంతోనే ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  ఏమిటంటే వైసీపీకి వల్లభనేని వంశీ రాజీనామా చేస్తారంటే రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేయడమే కాదు.. మొత్తంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పే అవకాశం ఉందని కూడా వినిపిస్తోంది.

కృష్ణా జిల్లా రాజకీయాలలో వంశీ కీలకమైన వ్యక్తి అనడంలో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన వంశీ వరుసగా రెండు సార్లు తెలుగుదేశం తరఫున గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికలలో విజయం తరువాత.. అప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ గూటికి చేరారు వల్లభనేని వంశీ.  అధికారం అండతో ఇష్టారీతిగా చెలరేగిపోయారు. దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలతో చెలరేగిపోయార్న ఆరోపణలతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో సాక్షిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టైన వంశీపై ఆ తరువాత పలు కేసులు నమోదయ్యాయి. ఎట్టకేలకు ఆయనకు అన్ని కేసులలో బెయిలు లభించడంతో  బయటకు వచ్చే అవకాశం ఉంది. 

వంశీకి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. జైలు జీవితం, పెరిగిపోతున్న రాజకీయ ఒత్తిడుల కారణంగా వంశీ వైసీపీకి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అంతే కాకుండా ప్రజాజీవితం నుంచి కూడి రిటైర్ కావాలని, రాజకీయాలకు పూర్తిగా దూరం అవ్వాలని వంశీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. వంశీ కుటుంబం నుంచి కూడా ఈ దశగా ఆయనపై ఒత్తిడి ఉందంటున్నారు. వంశీ జైలులో ఉన్న సమయంలో వైసీపీ నాయకత్వం ఆయన భార్యను రాజకీయంగా క్రియాశీలంగా ఉండాలని కోరినప్పటికీ ఆమె సుముఖత వ్యక్తం చేయకపోవడమే వంశీ కుటుంబం ఇంకెంత మాత్రం వైసీపీతో కలిసి పయనించేందుకు అవకాశం లేదనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. వంశీ ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఒత్తిడి కారణంగా వంశీ వైసీపీకి గుడ్ బై చెప్పేయాలన్న నిర్ణయానికి రావడానికి కారణంగా చెబుతున్నారు. ఈ వార్తలలో వాస్తవం ఎంతన్నది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.